Movies

జాతకాలు మారిపోతాయి!

జాతకాలు మారిపోతాయి!

సినీ తారల జీవితం అనునిత్యం ఆనిశ్చితితో కూడుకొని ఉంటుందని…కెరీర్‌కు ఎలాంటి భరోసా లభించదని ఆవేదన వ్యక్తం చేసింది కథానాయిక మెహరీన్‌. ఎత్తుపల్లాలతో కూడుకున్న సినీ ప్రయాణంలో ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టాల్సిన పరిస్థితులు ఉంటాయని బాధపడింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ పోస్ట్‌ను పంచుకుంది. ‘సినీ తారల జీవితం చిత్రవిచిత్రంగా అనిపిస్తుంది. అనూహ్యంగా విజయాలు పలకరిస్తాయి..అంతలోనే అపజయాల అగాథాల్లోకి కూరుకుపోతాం. ఇక్కడ ఒక్కరాత్రిలోనే జాతకాలు మారిపోతాయి. షూటింగ్‌ కోసం ఎక్కడెక్కడో తిరుగుతుంటాం. ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా రాత్రింబవళ్లు షూటింగ్స్‌ చేయాల్సి ఉంటుంది. వేళకు భోజనం, నిద్ర లేకపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా మనం ఎంతగానో ప్రేమించే కుటుంబానికి, స్నేహితులకు దూరంగా కొన్ని నెలల పాటు గడపటం అత్యంత బాధాకరంగా అనిపిస్తుంది. ఇన్ని కష్టాలున్నప్పటికి గొప్ప కళారూపంగా సినిమాను గౌరవిస్తాను. మనల్ని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసే అద్భుతమైన వేదిక సినిమా’ అని చెప్పుకొచ్చింది మెహరీన్‌.