Devotional

7.04 లక్షల శ్రీవారి దర్శన టికెట్లు ఖాళీ

Auto Draft

తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించి ఏప్రిల్‌ నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ సోమవారం ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసింది. మొత్తం 8.10 లక్షల టికెట్లను విడుదల చేయగా, తొలిరోజు 7.04 లక్షల టికెట్లను భక్తులు బుక్‌ చేసుకున్నారు. కొవిడ్‌ ప్రభావం తగ్గిన నేపథ్యంలో సోమవారం నుంచి బుధవారం వరకు రోజుకు 30వేలు, గురువారం నుంచి ఆదివారం వరకు రోజుకు 25 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ సోమవారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. మొదటి 45 నిమిషాల్లోనే 50 శాతానికి పైగా టికెట్లను భక్తులు కావాల్సిన తేదీల్లో బుక్‌ చేసుకున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల సమయానికి 7.04 లక్షల టికెట్లు బుక్‌ అయ్యాయి. మే నెల కోటాను మంగళవారం, జూన్‌ నెల కోటాను బుధవారం విడుదల చేయనున్నారు. ఈ టికెట్లను ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్‌’ లేదా ‘గోవింద’ యాప్‌ల ద్వారా భక్తులు బుక్‌ చేసుకోవచ్చు.