NRI-NRT

ఘంటశాలకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్

ఘంటశాలకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్

అమర గాయకుడు ఘంటసాలకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని అమెరికాకి చెందిన శంకర నేత్రాలయ అధ్యక్షులు బాల ఇందుర్తి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా రెడ్డి ఊరిమిండి నిర్వహణలో 2022 మార్చి 20న మరొకసారి వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. అన్నమాచార్య భువనవాహిని సంస్థ అధ్యక్షురాలు పద్మశ్రీ శోభారాజు మాట్లాడుతూ ఘంటసాలకి భారతరత్న ఇవ్వడం అంటే ఆయనకు ఘనమైన నివాళి అందివ్వడమని తెలిపారు. ఈ ‍కార్యక్రమంలో సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్, అట్లాంటా నుండి శంకర నేత్రాలయ పాలక మండలి సభ్యులు శ్రీనిరెడ్డి వంగిమళ్ళ, దక్షిణ ఆఫ్రికా నుండి దక్షిణాఫ్రికా తెలుగు కమ్యూనిటీ అధ్యక్షులు విక్రమ్ పెట్లూరు, ఒమాన్ నుంచి తెలుగు కళా సమితి కన్వీనర్ అనిల్ కుమార్ కడించెర్ల, ఖతార్ నుంచి తెలుగు కళా సమితి అధ్యక్షులు ఉసిరికల్ల తాతాజీ, నార్వే నుంచి వీధిఅరుగు అధ్యక్షులు వెంకట్ తరిగోపుల, యూఏఈ నుంచి తెలుగు తరంగిణి అధ్యక్షులు వెంకట సురేష్, లండన్ నుంచి తెలుగు అసోసియేషన్ అఫ్ లండన్ ఉపాధ్యక్షులు రాజేష్ తోలేటి తదితరులు పాల్గొన్నారు.