జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ రాజకీయ బ్రోకర్ అంటూ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక పార్టీ పెట్టుకుని మరో పార్టీ రూట్ మ్యాప్ కోసం చూడటమేంటని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడమేమిటని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని తులసిరెడ్డి మండిపడ్డారు.