దర్శకధీరుడు రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరో నాలుగు రోజుల్లో సినిమా విడుదలవుతుండడంతో జక్కన్న అండ్ టీమ్ ప్రచారాల్ని స్పీడప్ చేశారు. ఆల్రెడీ దుబాయ్, బెంగళూర్ లోని చిక్ బళ్ళాపూర్ లో ప్రమోషనల్ ఈవెంట్స్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించిన చిత్ర బృందం.. అటు నుంచి అటే గుజరాత్, ఢిల్లీ పయనమై.. అక్కడ తమ ప్రచారాల్ని షురూ చేశారు. ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్ ఎక్కడికి వెళ్ళినా అక్కడ వారికి మంచి ఆదరణ దక్కుతోంది. తాజాగా రాజమౌళి, యన్టీఆర్, రామ్ చరణ్ లు పంజాబ్ లోని అమృతసర్ లో ఉన్న స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. పంజాబీ సాంప్రదాయంలో ముగ్గురూ తలకు వస్త్రం చుట్టుకొని అక్కడ నది ఒడ్డున ప్రార్దిస్తున్నట్టున్న .. ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. చిత్రం పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. దాదాపు మూడేళ్ళ పాటు కష్టపడి.. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని కంప్లీట్ చేశారు. ఆ క్రమంలో తారక్, చెర్రీ, రాజమౌళి ఎన్నో కష్టాలు పడి.. ఫైనల్ గా మంచి ఔట్ పుట్ ఇచ్చారని మూడు రోజుల క్రితం వారు ముగ్గురూ కూర్చుని డిస్కస్ చేసుకొన్న ఒక వీడియోతో అర్ధమైంది. కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ .. హాలీవుడ్ స్థాయి యాక్షన్ బ్లాక్స్ అభిమానులకు విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నాయి. ఓవర్సీస్ లో ఈ సినిమాను హైయస్ట్ స్ర్కీన్స్ లో విడుదల చేయబోతున్నారు. దానికి తగ్గట్టుగానే సినిమాకి తొలిరోజున రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ను ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మరి అందరి అంచనాల్ని అధిగమించి ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఏ స్థాయి రికార్డుల్ని నెలకొల్పుతుందో చూడాలి.