Movies

త్వరలోనే తల్లి కాబోతున్న హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌

త్వరలోనే తల్లి కాబోతున్న హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌

ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా సోనమ్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. భర్తలో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేస్తూ.. ‘నాలుగు చేతులు. మేము చేయగలిగినంత ఉత్తమంగా నిన్ను పెంచడానికి. రెండు హృదయాలు. అవి నీతో కలిసి అడుగడుగునా కొట్టుకుంటాయి. ఒక కుటుంబం నీకు ప్రేమ మరియు మద్దతును ఇస్తుంది. నీకు వెల్‌కం చెప్పేందుకు ఇంక వేచి చూడలేం’ అంటూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసింది. దీంతో కరీనా కపూర్‌, జాన్వీ కపూర్‌, ఏక్తా కపూర్‌ సహా పలువురు సెలబ్రిటీలు,నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా 2018లో వ్యాపారవేత్త ఆనంద్‌ అహుజాను ప్రేమ వివాహం చేసుకున్న సోనమ్‌ గత కొంతకాలంగా సినిమాలకు దూరమైంది. కాగా సోనమ్‌.. బాలీవుడ్‌ స్టార్‌ అనిల్‌ కపూర్‌ కుమార్తె అన్న సంగతి తెలిసిందే.