NRI-NRT

నెహ్రూ కఠారు ఆధ్వర్యంలో ‘తానా’ ఉచిత కంటి వైద్య శిబిరం

నెహ్రూ కఠారు ఆధ్వర్యంలో ‘తానా’ ఉచిత కంటి వైద్య శిబిరం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా న్యూయార్క్ లోని తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నెహ్రూ కఠారు సమర్పణలో కృష్ణా జిల్లా గంపలగూడెం గ్రామంలో మరో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గుంటూరు జిల్లా పెదకాకాని లోని శంకర్ కంటి వైద్యశాలతో సంయుక్తంగా ఈ శిబిరాన్ని మార్చి 13న నిర్వహించారు. కృష్ణాజిల్లా గంపలగూడెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఈ శిబిరానికి సుమారు 200 మంది గ్రామవాసులు తరలి వచ్చారు. అందరికి వైద్య పరీక్షలు నిర్వహించగా వీరిలో 90 మందికి కేటరాక్ట్ ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. ఈ 90 మందికి గుంటూరు నగరంలోని శంకర కంటి వైద్యశాలలో ఉచితంగా ఆపరేషన్ చేస్తారని నిర్వాహకులు తెలిపారు.
TANA-Eye-Camp-in-Gampalagudem-Krishna-District-2
TANA-Eye-Camp-in-Gampalagudem-Krishna-District-3
నెహ్రూ కఠారు ఆధ్వర్యంలో ‘తానా’ ఉచిత కంటి వైద్య శిబిరం
TANA-Eye-Camp-in-Gampalagudem-Krishna-District-5
free image hosting