తెలంగాణా ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో భాగంగా బే-ఏరియాలో పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన “మన ఊరు-మన బడి” పథకం గురించి స్థానిక ప్రవాసులతో తన ఆలోచనలను పంచుకున్నారు. సీఎం కేసీఆర్ రూపొందించిన ఈ పథకంలో ప్రవాసులు భాగస్వాములు కావాలని కేటీఆర్ కోరారు. పాఠశాలలు, గ్రంథాలయాల నిర్మాణానికి ప్రభుత్వ సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. ఇండియన్ కాన్సులేట్ జనరల్ డా.నాగేంద్రప్రసాద్, సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్, WETA అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బే-ఏరియా ప్రవాసులతో కేటీఆర్ భేటీ
Related tags :