జాన్వీకపూర్ కథానాయికగా కొత్త సినిమా ఖరారైంది. ఈ చిత్రానికి ‘బవాల్’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. నితేష్ తివారి దర్శకత్వంలో సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ బుధవారం చిత్రబృందం పోస్టర్‌ను విడుదల చేసింది. కథానాయకుడు వరుణ్ ధావన్, జాన్వీ ఇన్స్టాగ్రామ్ వేదికగా తమ కొత్త సినిమా ప్రకటనను అభిమానులతో పంచుకున్నారు. ఒక చక్కని ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ‘బవాల్’ను విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది. జాన్వీ, వరుణ్ తొలిసారి జంటగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. జాన్వీ ప్రస్తుతం ‘గుడ్‌లక్ జెర్రీ’, ‘మిలీ’ చిత్రాల్లో నటిస్తున్నారు.
జాన్వీ-వరుణ్ జోడీగా
