అభిప్రాయం ఏదైనా ఏ మాత్రం ఆలోచించకుండా ఓపెన్‌గా చెప్పాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యం కోలీవుడ్ భామ శృతిహాసన్ కు సరిపోయేంతగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ భామ తాజాగా చేసిన కామెంట్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ బెస్ట్ సెల్లర్ లో నటించిన శృతిహాసన్..ఈ షోలో తన పాత్రపై స్పందిస్తూ ఆ రోల్ ప్రేక్షకులకు అనుబంధంగా ఉంటుందని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చింది.తనపై ఎవరో ఒకరు నెగెటివ్‌గా చెప్తే..అంత సీరియస్‌గా తీసుకోనని చెప్పింది శృతిహాసన్. తాను చాలా వరకు తనకు సంబంధించిన వార్తలను చదవనని తెగేసి చెప్పింది శృతిహాసన్. ఈ బ్యూటీ ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్‌లో కీలక పాత్రలో నటిస్తోంది. దీంతోపాటు బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎన్‌బీకే 107లో హీరోయిన్‌గా నటిస్తోంది.మరోవైపు బాబీ-మెగాస్టార్ చిరంజీవి యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్టందుకున్న శృతిహాసన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ ఎంటర్‌టైన్ మెంట్ అందించేందుకు రెడీ అవుతుంది.