Business

దేశంలో మరోసారి పెరిగిన ఇంధన ధరలు – TNI వాణిజ్య వార్తలు

దేశంలో  మరోసారి పెరిగిన ఇంధన ధరలు – TNI వాణిజ్య వార్తలు

* దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్, డీజిల్పై 80పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.101.81కి చేరింది. డీజిల్ ధర రూ.93.07కి పెరిగింది. ముంబయిలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు 84 పైసల చొప్పున పెరిగాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.116.72కి, డీజిల్ ధర రూ.100.94కి చేరింది. ఆంధ్రప్రదేశ్లో లీటర్ పెట్రోల్ ధర 87 పైసలు, డీజిల్ ధర 83 పైసలు పెరిగింది. ఫలితంగా గుంటూర్లో లీటర్ పెట్రోల్ రూ.117.32, డీజిల్ రూ.103.10కి చేరింది. హైదరాబాద్లో పెరిగిన ధరల అనంతరం లీటర్ పెట్రోల్ రూ.115.42, డీజిల్ రూ.101.58గా ఉంది.
*6 నుంచి ఆర్‌బీఐ సమీక్ష
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి మూడు రోజులు జరగనుంది. ఏప్రిల్‌నుంచి ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2022–23) మొత్తం ఆరు ద్వైమాసిక సమావేశాలు జరుగుతుండగా, వచ్చే వారం తొలి సమావేశం జరుగుతుంది. సమావేశాల అనంతరం 8వ తేదీన ఎంపీసీ కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. గవర్నర్‌ నేతృత్వంలోని ఎంపీసీ కమిటీలోని మిగిలిన ఐదుగురిలో ఇద్దరు సెంట్రల్‌ బ్యాంక్‌ నుంచి నేతృత్వం వహిస్తారు.
*భారత్‌లో… సింగపూర్ ‘ఇ-కామర్స్ సంస్థ షాపీ’ క్లోజ్సిం
గపూర్‌కు చెందిన ఇ-కామర్స్ సంస్థ షాపీ భారత్ కార్యకలాపాలను మూసివేయనుంది. షాపీ ఫ్రాన్స్ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత, ప్రముఖ గేమింగ్ యాప్ ‘ఫ్రీ ఫైర్’ను భారత్ నిషేధించిన నేపథ్యంలో… ఈ ఉపసంహరణ జరిగింది. ఆగ్నేయాసియాస్ సీ లిమిటెడ్‌కు చెందిన ఇ-కామర్స్ విభాగం… షాపీ… ‘గ్లోబల్ మార్కెట్ అనిశ్చితుల దృష్ట్యా భారత్‌లో కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. సింగపూర్‌లో ప్రధాన కార్యాలయమున్న టెక్నాలజీ గ్రూప్, యూరోప్‌లో విస్తరించిన అంతర్జాతీయ పుష్‌లో భాగంగా… 2021 అక్టోబరులో భారత్‌లో ప్రారంభమైంది.
*కార్డియాలజీ, మధుమేహం తదితర విభాగాల్లో పేటెంట్‌ హక్కుల గడువు తీరిన ఔషధాలపై దృష్టి సారించాలని లారస్‌ లాబ్స్‌ భావిస్తోంది. లారస్‌ బయో ద్వారా బయోలాజిక్స్‌ విభాగంలో విస్తరించాలని యోచిస్తోంది. ఫినిష్డ్‌ డోసేజీస్‌ (ఎఫ్‌డీ), సింథసిస్‌ విభాగాల్లో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకోవడానికి కంపెనీ కృషి చేస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయు.
*కొత్త కైగర్‌ కారును హైదరాబాద్‌ విపణిలోకి రెనో ఇండియా విడుదల చేసింది. త్వరలో కైజర్‌ ఎంవై22 అందుబాటులోకి వస్తుంది. దీని ప్రారంభ ధర రూ.5.84 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). రెనోకు ప్రపంచంలోనే అయిదు అతిపెద్ద మార్కెట్లలో భారత్‌ నిలిచేందుకు దోహ దం చేసిందని కంపెనీ వెల్లడించింది. క్రూయి జ్‌ కంట్రోల్‌, వైర్‌లెస్‌ స్మార్ట్‌ఫోన్‌ చార్జర్‌. ఫ్రంట్‌ స్కిడ్‌ ప్లేట్‌ వంటి అదనపు సౌకర్యాలతో కొత్త కైజర్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపింది.
*అధికాదాయం ఆశ చూపి ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించి బిచాణా ఎత్తేసేవారికి చెక్‌ పెట్టేందుకు సెబీ నిబంధనలను కఠినతరం చేసింది. సాధారణంగా మనీ పూలింగ్‌ స్కీమ్‌లుగా పిలిచే సామూహిక పెట్టుబడి పథకాల (సీఐఎస్‌) నిర్వాహకులకు కనీస నెట్‌వర్త్‌ పరిమితిని పెంచింది. అలాగే, సీఐఎస్‌ ఏర్పాటు చేసేవారికి గత ట్రాక్‌ రికార్డు కలిగి ఉండాలన్న నిబంధనను సైతం ప్రవేశపెట్టింది. అంతేకాదు, సీఐఎ్‌సలకు క్రాస్‌ హోల్డింగ్‌ నియమావళినీ ప్రవేశపెట్టింది. ఈ నిబంధన ప్రకారం.. ఏదైనా సంస్థ ఒకటి కంటే ఎక్కువ కలెక్టివ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలో (సీఐఎంసీ) 10 శాతానికి మించి వాటా కలిగి ఉండటానికి వీల్లేదు. సీఐఎస్‌ నిబంధనలను సవరించడం 1999 తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి.
*రియల్‌టైమ్‌ వర్చువల్‌ కాన్ఫరెన్సింగ్‌ సేవలందిస్తున్న నెక్స్ట్‌మీట్‌కు అభిబస్‌ వ్యవస్థాపకుడు సీ సుధాకర్‌ రెడ్డి 2లక్షల డాలర్ల (దాదాపు రూ.1.5 కోట్లు) నిధులు అందించారు. వర్కింగ్‌బాట్‌ టెక్నాలజీస్‌ నెక్స్ట్‌మీట్‌ ప్లాట్‌పామ్‌ను అందిస్తోంది. భారత్‌లో భారత్‌లో ‘అవతార్‌’ తరహా 3డీ వర్చువల్‌ కన్ఫరెన్సింగ్‌ సేవలందిస్తున్న తొలి కంపెనీ ఇదే. కేపీఎంజీ, మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ తదితర సంస్థలు నెక్స్ట్‌మీట్‌కు ఖాతాదారులుగా ఉన్నాయి.
* టైర్ల కంపెనీలపై సీసీఐ(కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) అధికారులు ఆయా నగరాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. సీసీఐ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై భారత కంపెనీలైన సియట్, అపోలో టైర్స్, జర్మన్ కంపెనీ కాంటినెంటల్‌ సహా ఆయా టైర్ కంపెనీల కార్యాలయాలపై భారత యాంటీట్రస్ట్ బాడీ బుధవారం దాడులు నిర్వహించింది. దాడుల విషయమై కంపెనీల అధికారులు స్పందించడంలేదని వినవస్తోంది. ఉత్తర రాష్ట్రమైన హర్యానాలో ప్రజా రవాణా వాహనాలకు టైర్లను సరఫరా చేసే క్రమానికి సంబంధించి… నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న వాణిజ్య పద్ధతులురిగ్గింగ్ బిడ్లను ఉపయోగించడంపై యాంటీట్రస్ట్ విచారణకు ఆదేశించినట్లు వినవస్తోంది. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఐ విచారణ జరుపుతున్నట్లు వినవస్తోంది.
*ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ)లో 1.5ు వరకు వాటాను కేంద్రం విక్రయించనుంది. ఈనెల 30, 31 తేదీల్లో ఓఎఫ్‌ఎస్‌ పద్ధతిన జరగనున్న ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.3,000 కోట్ల వరకు సమకూరే అవకాశం ఉంది. ఒక్కో షేరు కనీస ధరను రూ.159గా నిర్ణయించారు. మంగళవారం బీఎస్‌ఈలో షేరు ముగింపు ధర రూ.171.05తో పోలిస్తే 7ు డిస్కౌంట్‌తో ఆఫర్‌ చేస్తోంది
* కార్యాలయ స్థలపరంగా హైదరాబాద్‌ నాలుగో అతిపెద్ద మార్కెట్‌. దేశవ్యాప్తంగా ఉన్న గ్రేడ్‌ ఏ కార్యాలయ స్థలంలో 12.7 శాతం వాటా హైదరాబాద్‌లోనే ఉంది. 2019-21 మధ్య కొత్తగా అందుబాటులోకి వచ్చిన గ్రేడ్‌ ఏ కార్యాలయ స్థలంలో 25 శాతం హైదరాబాద్‌లోనే అందుబాటులోకి వచ్చిందని జేఎల్‌ఎల్‌ వెల్లడించింది. ఈ కాలంలో 3.47 కోట్ల చదరపు అడుగుల స్థలం కొత్తగా అభివృద్ధి చేశారు. ఈ విధంగా బెంగుళూరు తర్వాత హైదరాబాద్‌ రెండో స్థానం లో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో గ్రేడ్‌ ఏ ఆఫీస్‌ స్థలం 9.04 కోట్ల చదరపు అడుగులు ఉంది. 2016-2021 మధ్య 81 శాతం పెరిగిందని వెల్లడించింది. అత్యంత వేగంగా వృద్ధి చెందిన మార్కెట్‌గా హైదరాబాద్‌ నిలిచింది. గ్రేడ్‌ ఏ ఆఫీస్‌ కార్యాలయాన్ని అద్దెకు తీసుకోవడంలో కూడా హైదరాబాద్‌ ముందంజలో ఉంది. 2022 చివరి నాటికి హైదరాబాద్‌ గ్రేడ్‌ ఏ ఆఫీస్‌ కార్యాలయ స్థల మార్కెట్‌ 10 కోట్ల చ.అ స్థాయికి చేరగలదని జేఎల్‌ఎల్‌ అంచనా వేస్తోంది.
*ప్రభుత్వ రంగ బ్యాంకులను మోసం చేసిన వ్యవహారంలో జీఎస్‌ అయిల్స్‌ లిమిటెడ్‌కు చెందిన రూ.63.05 కోట్ల విలువైన 290 స్థిరాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. ఆదిలాబాద్‌ జిల్లాలో ఆ సంస్థకు ఉన్న 2050 ఎకరాల భూమిని అటాచ్‌ చేసింది. ఆదిలాబాద్‌కు చెందిన జీఎస్‌ అయిల్స్‌ సంస్థకు మనోజ్‌ కుమార్‌ మఖారియా, సంజయ్‌ కుమార్‌ మఖారియా, ఉమేష్‌ కుమార్‌ మఖారియాలు యజమాను లుగా ఉన్నారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)యూకో బ్యాంకుల్లో తప్పుడు పత్రాలను సమర్పించి కోట్లలో రుణాలు తీసుకున్నారు. ఆ రుణాన్ని వ్యాపారం కోసం వినియోగించకుండా బోగస్‌ కంపెనీలకు దారి మళ్లించారు. ఆ నగదుతో పెద్ద ఎత్తున వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. ఆ భూములపైనా రుణాలు తీసుకోవడం గమనార్హం. ఏ రుణాన్ని కూడా సకాలంలో చెల్లించలేదు.
*బీమా కంపెనీలు కరోనా కవచ్‌కరోనా రక్షక్‌ పాలసీల విక్రయాలను ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు కొనసాగించేందుకు అనుమతిస్తూ భారత బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) సర్క్యులర్‌ జారీ చేసింది. కొవిడ్‌ చికిత్సకు తక్కువ ప్రీమియంతో బీమా కవరేజీ కల్పించేందుకు ఈ రెండు పాలసీలను అందుబాటులోకి తెచ్చారు. 2020 జూన్‌లో ప్రవేశపెట్టిన ఈ పాలసీల విక్రయానికి ఐఆర్‌డీఏఐ తొలుత 2021 మార్చి 31 వరకు గడువును నిర్దేశించింది. అయితే, వైరస్‌ పలు దశల్లో విజృంభించిన నేపథ్యంలో గడువును పలుమార్లు పొడిగించింది