Movies

ఆ ప్రచారం అబద్ధం!

ఆ ప్రచారం అబద్ధం!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో తన పాత్రకు తక్కువ ప్రాధాన్యత దక్కడంతో కథానాయిక అలియాభట్‌ అసంతృప్తిగా ఉందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. వాటికి బలం చేకూర్చేలా ఇటీవల అలియాభట్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి సంబంధించిన కొన్ని పోస్ట్‌లను తొలగించింది. దర్శకుడు రాజమౌళి ఇన్‌స్టా ఖాతాను ఆమె అన్‌ఫాలో చేసిందనే పుకార్లు కూడా వినిపించాయి. ఈ వార్తలపై స్పందిస్తూ అలియాభట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేసింది. సోషల్‌మీడియాలో ప్రచారమవుతున్న వార్తలన్నీ నిరాధారమని స్పష్టం చేసింది.‘ఇన్‌స్టాగ్రామ్‌లో పాత పోస్ట్‌లను తొలగించడం రొటీన్‌లో భాగమే. ఫొటో గ్రిడ్‌లో ఎలాంటి గజిబిజికి అస్కారం ఉండొద్దని వీలైనంత వరకు పాత పోస్ట్‌లను తీసివేస్తుంటా. రాజమౌళిగారి దర్శకత్వంలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నా. అలాగే తారక్‌, రామ్‌చరణ్‌లతో ప్రయాణాన్ని ఆస్వాదించా. రాజమౌళిగారు కొన్నేళ్లపాటు శ్రమించి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రూపంలో ఒక అద్భుతాన్ని మన ముందుంచారు. ఇలాంటి కల్పిత వార్తలతో సినిమా ప్రతిష్టకు భంగం కలిగించవొద్దు’ అని అలియాభట్‌ కోరింది.