DailyDose

యూఎస్ పాఠశాలలో కాల్పుల కలకలం -TNI నేర వార్తలు

యూఎస్ పాఠశాలలో కాల్పుల కలకలం -TNI నేర వార్తలు

*సౌత్ కారోలీనా టాంగిల్ వుడ్ స్కూల్లో ఘటన తోటి విధ్యార్దులపై కాల్పులు జరిపిన ఏడవ తరగతి విధ్యార్ది. విధ్యార్ధి మృతి, కాల్పులు జరిపిన విధ్యార్ధిని అదుపులోకి తీసుకున్న గ్రీన్ విల్లే కౌంటీ పోలీసులు.కాల్పుల శబ్దం విన్న వెంటనే అప్రమత్తమైన స్కూలు సిబ్బంది.20 మంది విధ్యార్దులను కాపాడిన తెలుగు రాష్ట్రానికి చెందిన కోనేరు శ్రీధర్. మాథమ్యాటిక్స్ టీచర్ గా టాంగిల్ వుడ్ స్కూల్లో పని చేస్తున్న శ్రీధర్.ల్పులు జరిగిన వెంటనే తన క్లాసులో ఉన్న 20 మందిని బెంచిల కింద కూర్చోపెట్టి తలుపులు మూసివేసిన శ్రీధర్. కాసేపటికి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. విధ్యార్దులను, సిబ్బందిని సురక్షితంగా దగ్గరలోని చర్చిలోకి తరలింపు.శ్రీధర్ చర్యను అభినందించిన తోటి సిబ్బంది, విధ్యార్దుల తల్లితండ్రులు.గన్నవరం నియోజకవర్గం, విజయవాడ రూరల్ మండలం, ప్రసాదంపాడు, శ్రీధర్ స్వస్థలం.

*వేములవాడలోని తిప్పపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. చికెన్ కొనుగోలు విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ తలెత్తింది. చికెన్ సెంటర్ నిర్వహుకులపై యాసిడి దాడి జరిగింది. ఒకరి పరిస్థితి విషమంగా మారింది. కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చికెన్ బాగా లేదని కొనుగోలు దారుల మండిపడ్డారు. మాటా మాటా పెరిగి రెండు వర్గాలు కర్రలతో కొట్టుకున్నారు.

*కుటుంబ కలహాలతో లాడ్జిపై నుంచి దూకి తండ్రికూతురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. యాదాద్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తండ్రి చెరుకూరి సురేష్(40), కూతురు శ్రేష్ఠ(6) యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చి అక్కడే లాడ్జి అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య ఘర్షణతో సూసైడ్ నోట్ రాసి ఇరువురు లాడ్జిపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు హైదరాబాద్ లింగంపల్లికి చెందిన వారుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను భువనగిరి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*జగిత్యాల జిల్లా కోరుట్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం పట్టణ శివార్లలోని పూల్ వాగు బ్రిడ్జిపై వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతిచెందిన వ్యక్తిని కోరుట్లలోని అంబేద్కర్‌నగర్‌ కాలనీకి చెందిన గడ్డం మణిగా గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

*నకిరేకల్‌లో దారుణం జరిగింది. రెండు రోజుల క్రితం అనూష అనే బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు.గురువారం ఉదయం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనూష మృతి చెందడంతో బాలిక తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. మృతురాలు అనూష ఎలా చనిపోయిందంటూ తల్లిదండ్రులు ఆరా తీయగా పోస్టుమార్టం నివేదికలోని భయానక వాస్తవాలను తల్లిదండ్రులకు వైద్యులు తెలిపారు.అనూష ఐదు నెలల గర్భిణి అని, ఆమె పిండం కడుపులోనే చనిపోయిందని వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఐదు నెలల గర్భిణి అయిన అనూషకు ఆకు మార్పిడి చేసి పిండాన్ని తొలగించినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

*యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన ఆరేండ్ల కూతురుతో కలిసి యాదగిరిగుట్ట పట్టణంలోని ఓ ప్రైవేటు లాడ్జి పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన చెరుకూరి సురేష్(40) గురువారం ఉదయం స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మయూరి లాడ్జిలో అద్దెకు దిగాడు. అర్ధరాత్రి సమయంలో తన కూతురు శ్రీస్త(6) ను భవనంపై నుంచి తోసేసి తాను కూడా దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

*హిరంగ సభలో కత్తులు దూసిన మంత్రులపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. మహారాష్ట్ర మంత్రులు అస్లాం షేక్, వర్షా గైక్వాడ్ లు కాంగ్రెస్ మైనారిటీ సమావేశంలో కత్తులు దూశారు.మహారాష్ట్ర కాంగ్రెస్ మైనారిటీ సెల్ సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ మైనారిటీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి గత ఆదివారం ముంబైకి వచ్చారు.ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రులు అస్లాం షేక్, వర్షా గైక్వాడ్ లు పెద్ద కత్తులు చేతబట్టి వాటిని పైకెత్తి దూశారు. దీంతో బాంద్రా పోలీసులు రాష్ట్ర మంత్రులపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో తమపైనే కేసులు నమోదు చేస్తారా అని మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

*పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా వద్ద పద్మావతి ట్రావెల్స్ బస్సులో భారీగా నగదు పట్టుబడింది. టోల్‌ప్లాజా వద్ద బస్సును అడ్డగించిన పోలీసులు తనిఖీలు చేయగా… బస్సు లగేజ్ డిక్కీలలో, సీట్లు కింద నోట్ల కట్టలు ఉంచి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్క బాక్సులోనే రూ. 80 లక్షల వరకూ నగదు ఉన్నట్లు అంచనా. ఇలాంటివి అనేక బాక్సులు ఉండడంతో కోట్లలో నగదు ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు టోల్ ప్లాజా కార్యాలయంలో భద్రపరచి… ఉన్నతాధికారులు వచ్చాక లెక్కించనున్నారు. శ్రీకాకుళం నుండి గుంటూరు వెళ్తున్న AP39 TB 7555 బస్సుగా గుర్తించారు. డ్రైవర్, క్లీనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని నగదుపై ఆరా తీస్తున్నారు.

*పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా వద్ద పద్మావతి ట్రావెల్స్ బస్సులో భారీగా నగదు పట్టుబడింది. టోల్‌ప్లాజా వద్ద బస్సును అడ్డగించిన పోలీసులు తనిఖీలు చేయగా… బస్సు లగేజ్ డిక్కీలలో, సీట్లు కింద నోట్ల కట్టలు ఉంచి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్క బాక్సులోనే రూ. 80 లక్షల వరకూ నగదు ఉన్నట్లు అంచనా. ఇలాంటివి అనేక బాక్సులు ఉండడంతో కోట్లలో నగదు ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు టోల్ ప్లాజా కార్యాలయంలో భద్రపరచి… ఉన్నతాధికారులు వచ్చాక లెక్కించనున్నారు. శ్రీకాకుళం నుండి గుంటూరు వెళ్తున్న AP39 TB 7555 బస్సుగా గుర్తించారు. డ్రైవర్, క్లీనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని నగదుపై ఆరా తీస్తున్నారు.

*నేరేడ్‌మెట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఆర్‌కేపురం ఆఫీసర్స్‌కాలనీలోని మైసమ్మ జయదుర్గ ఆలయంలో చోరీ జరిగింది. మార్చి 29న తెల్లవారు జామున ఆలయ సేవకురాలు ఆలయానికి వచ్చి చూడగా గుడి తాళం పగల గొట్టి ఉంది. వెంటనే ఆలయ పూజారికి, స్థానికులకు సమాచారం అందించారు. పూజారి, స్థానికులు గుడి లోపలకి వెళ్లి చూడగా గుడిలోని హుండీ, 35 గ్రాముల అమ్మవారి వెండి ఆభరణాలు కనిపించలేదు.ఆలయంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా రాత్రి సమయంలో దొంగ హుండీని, అమ్మవారి ఆభరణాలు దొంగిలించన దృశ్యాలు ఉన్నాయి. హుండీలోని రూ. 12 వేలు, 35 గ్రాముల అమ్మవారి అభరణాలు చోరీ అయినట్లు బండారి శ్రీనివా్‌సయాదవ్‌ గురువారం నేరేడ్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరసింహస్వామి తెలిపారు.

*ఉంగుటూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చేబ్రోలు వద్ద బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించారు. మృతుడు జాన్ బాబు (20)గా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

*యాదగిరిగుట్టలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా.. ఓ లాడ్జి పైనుంచి దూకి తండ్రీకూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్ని హైదరాబాద్‌ లింగంపల్లికి చెందిన చెరకూరి సురేష్‌, శ్రేష్ఠగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను భువనగిరి ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. సూసైడ్‌ నోట్‌ ఆధారంగా.. భార్యభర్తల మధ్య గొడవ ఈ అఘాయిత్యానికి కారణమని తెలుస్తోంది.

*ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం (Anantapur) జిల్లా పెద్దమడుగూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మిడుతూరు-గుతి టోల్‌ ప్లాజా సమీపంలో బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఆగిఉన్న లారీని ఓ డీసీఎం ఢీకొట్టింది. అయితే దానివెనుక వస్తున్న మియాపూర్‌-1 డిపోకు చెందిన టీఎస్‌ఆర్టీసీ బస్సు డీసీఎంను బలంగా గుద్దింది. దీంతో డీసీఎం, ఆర్టీసీ బస్సు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

*భరత్‌నగర్‌ కాలనీ మహేశ్వరనగర్‌లో బుధవారం అర్ధరాత్రి ఓ ఇంట్లో చొరబడ్డ గుర్తుతెలియని వ్యక్తి మహిళను గాయపరిచి పారిపోయాడు. సనత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ ముత్తుయాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వేణుగోపాల్‌రావు, స్పందన(26) దంపతులు మహేశ్వరనగర్‌లో నివసిస్తూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి కుమార్తె రుతిక్ష ఏడుస్తుండడంతో వేణుగోపాల్‌ వరండాలో ఆడిస్తున్నాడు. ఆ సమయంలో ఇంట్లో నుంచి స్పందన కేకలు వినిపించాయి. అతడు వెంటనే లోపలికి వెళ్లి చూడగా ఆమె మెడ భాగంలో గాయమవడాన్ని గుర్తించాడు. గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమెను గాయపర్చినట్లు గ్రహించాడు. స్పందనను ఆస్పత్రిలో చేర్పించగా మెడపై మూడు కుట్లు వేశారు. వేణుగోపాల్‌రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన నారాయణపేట జిల్లా కోస్గి మండలం అమ్లీకుంట శివారులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మండలం హుసేన్‌పూర్‌నకు చెందిన వెంకటయ్య కుమారుడు శివకుమార్‌(21) హైదరాబాద్‌ సమీపంలోని గండిపేట్‌ మండలం నాగులపల్లి ప్రాంతంలో నివసిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన బూడల నిశిత(15)తో పరిచయడం ఏర్పడి ప్రేమించుకున్నారు. తమ వివాహం జరగదేమోనని అమ్లీకుంట శివారులోని మ్యాదరి వెంకటయ్య వ్యవసాయ పొలంలోని చెట్టుకు గురువారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనను గమనించిన ఆ పరిసర పొలాల రైతులు వెంకటయ్య సోదరుడు కేశవులకు సమాచారం ఇచ్చారు. ఆయన కోస్గి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేసుకొని మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. కేశవులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు.

*ఓర్వకల్లు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నన్నూరు వద్ద అదుపుతప్పి డివైడర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా..మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు.తిరుపతి నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

* బజాజ్‌ ఈఎంఐ కార్డు పై రుణం ఇస్తామని సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారు. ఉప్పల్‌కు చెందిన మహంకాళి జగదీష్‌ బంజారాహిల్స్‌ ఒమెగా ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఓ నంబర్‌ నుంచి అతడి ఫోన్‌కు బజాజ్‌ ఈఎంఐ కార్డుపై ఒక శాతం కమీషన్‌కు డబ్బు ఇస్తామని మెసేజ్‌ వచ్చింది. జగదీశ్‌ తనకు డబ్బు కావాలని అడివగాడు. ఈ మేరకు సైబర్‌ నేరగాళ్లు చెప్పినట్టు బజాజ్‌ ఈఎంఐ కార్డును వారికి వాట్సాప్‌ ద్వారా పంపించాడు. మరుసటి రోజు అతడి బజాజ్‌ కార్డు ద్వారా రూ. 35,098తో రెండు సెల్‌ఫోన్‌లు ఖరీదు చేసినట్టు ఫోన్‌కు సమాచారం వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

* పెద్దవడుగూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని ఐచర్ వాహనాన్ని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా..15 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మిడుతూరు గ్రామ శివారులో చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

* శ్రీశైలంలో కన్నడ భక్తులు బీభత్సం సృష్టించారు. మంచినీళ్ల బాటిల్‌ కోసం ఓ కన్నడ భక్తుడు, టీ దుకాణం యజమాని మధ్య చోటుచేసుకున్న గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దుకాణం యజమాని దాడి చేశాడని ఆగ్రహించిన కన్నడ భక్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. షాపులకు నిప్పు పెట్టారు. స్థానికులు కూడా ప్రతిదాడికి దిగి కర్ణాటక వాహనాలపై రాళ్లు రువ్వారు. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

*ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో నాటిన మొక్కలు కొందరి ని ర్లక్ష్యం మూలంగా అగ్నికి ఆహుతవుతున్నాయి. బషీరాబాద్‌-తాండూరు రోడ్డు మార్గంలో నవాల్గ గేటు నుంచి గొట్టిగఖుర్దు మధ్యలో అటవీశాఖ అధికారులు రోడ్డుకిరువైపులా ఐదేళ్ల కిందట నాటిన మొక్కలు గురువారం మధ్యాహ్నం మంటల్లో కాలిపోయాయి. పిచ్చిమొక్కలతో పాటు మొక్కలు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. రెండు కిలోమీటర్ల పొడవునా మొక్కలు దగ్ధమయాయి.

*బజాజ్‌ ఈఎంఐ కార్డు పై రుణం ఇస్తామని సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారు. ఉప్పల్‌కు చెందిన మహంకాళి జగదీష్‌ బంజారాహిల్స్‌ ఒమెగా ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఓ నంబర్‌ నుంచి అతడి ఫోన్‌కు బజాజ్‌ ఈఎంఐ కార్డుపై ఒక శాతం కమీషన్‌కు డబ్బు ఇస్తామని మెసేజ్‌ వచ్చింది. జగదీశ్‌ తనకు డబ్బు కావాలని అడివగాడు. ఈ మేరకు సైబర్‌ నేరగాళ్లు చెప్పినట్టు బజాజ్‌ ఈఎంఐ కార్డును వారికి వాట్సాప్‌ ద్వారా పంపించాడు. మరుసటి రోజు అతడి బజాజ్‌ కార్డు ద్వారా రూ. 35,098తో రెండు సెల్‌ఫోన్‌లు ఖరీదు చేసినట్టు ఫోన్‌కు సమాచారం వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

*చింత చెట్టుపైనుంచి పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలో గురువారం చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్కాన్‌పేటకు చెందిన బండ అంజయ్య(45) గ్రామంలో చింతచెట్టు కొట్టే కూలికి వెళ్లాడు. కొమ్మ విరిగి చెట్టుపైనుంచి పడడంతో తలకు గాయాలై అక్కడికకక్కడే మృతిచెందాడు. అంజయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.