భారత సంతతికి చెందిన పౌర హక్కుల న్యాయవాది కల్పనా కోటగల్, సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ వినయ్ సింగ్‌లను కీలకమైన అడ్మినిస్ట్రేషన్ పదవులకు నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. కోటగల్ సమాన ఉపాధి అవకాశాల కమీషన్లో కమిషనర్‌గా నామినేట్ కాగా, వినయ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా నామినేట్ అయ్యారని శుక్రవారం వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. వినయ్ ప్రస్తుతం యూఎస్ స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్బీఏ)లో అడ్మినిస్ట్రేటర్‌కి సీనియర్ సలహాదారుగా ఉన్నారు. కమ్యూనిటీల చిన్న వ్యాపారాలకు మెరుగైన సేవలందించేందుకు సంస్థాగత సామర్థ్యాలను అందించడానికి ఏజెన్సీ బృందాలకు సహాయం చేస్తున్నారు. అతను ఫైనాన్స్, అనలిటిక్స్, వ్యూహంపై లోతైన అవగాహనతో ప్రైవేట్ రంగంలో 25 సంవత్సరాల నాయకత్వ అనుభవం ఉంది. అంతేగాక ఒబామా-బైడెన్ హయాంలో డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ (యూఎస్ ఫీల్డ్)గా కూడా పనిచేశారు. తమను బైడెన్ కీలక పదువులకు నామినేట్ చేయడం పట్ల ఈ సందర్భంగా కల్పనా, వినయ్ హర్షం వ్యక్తం చేశారు