Business

యాపిల్‌కి షాక్‌! ఆ జాబితాలో చోటు గల్లంతు ?- TNI వాణిజ్య వార్తలు

యాపిల్‌కి షాక్‌! ఆ జాబితాలో చోటు గల్లంతు ?- TNI వాణిజ్య వార్తలు

* అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న హోమ్‌ ఇంప్రూవ్‌మెంట్, డెకరేటివ్‌ విభాగాలలో మరింత పట్టు సాధించేందుకు వీలుగా దేశీ దిగ్గజం ఏషియన్‌ పెయింట్స్‌ పావులు కదుపుతోంది. తాజాగా వైట్‌ టీక్, వెదర్‌సీల్‌ ఫెనస్ట్రేషన్‌ కంపెనీలలో వాటాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. వైట్‌ టీక్‌ బ్రాండ్‌ కంపెనీ ఆబ్జెనిక్స్‌ సాఫ్ట్‌ వేర్‌లో 100 శాతం వాటాను దశలవారీగా మూడేళ్లలో సొంతం చేసుకోనున్నట్లు ఏషియన్‌ పెయింట్స్‌ వెల్లడించింది. దీనిలో భాగంగా 49 శాతం వాటా కొనుగోలుకి ప్రమోటర్లతో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. ఇందుకు సుమారు రూ. 180 కోట్లు చెల్లించనున్నట్లు తెలియజేసింది. అయితే ఇందుకు ఇరువైపులా అంగీకరించిన ఆర్థిక లక్ష్యాలను చేరుకోవలసి ఉంటుందని వివరించింది. ఇదే పద్ధతిలో మరో 11 శాతం వాటాను రూ. 66 కోట్లకు చేజిక్కించుకోనుంది. ఇక 2025–26కల్లా మిగిలిన 40 శాతం వాటా కోసం ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా రూ. 360 కోట్లవరకూ చెల్లించనుంది. 2016లో ఏర్పాటైన వైట్‌ టీక్‌ 2020–21లో రూ. 37.7 కోట్ల టర్నోవర్‌ సాధించింది.రూ. 19 కోట్లకుఇంటీరియర్‌ డెకరేషన్, పీవీసీ కిటికీలు, ఫర్నీషింగ్‌ తదితరాల తయారీ కంపెనీ వెదర్‌సీల్‌ ఫెనస్ట్రేషన్‌లో 51 శాతం వాటాను రూ. 19 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ఏషియన్‌ పెయింట్స్‌ పేర్కొంది. ఇందుకు కంపెనీ ప్రమోటర్లతో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. కాగా.. మూడేళ్ల కాలంలో దశలవారీగా మరో 23.9 శాతం వాటాను సైతం సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. ఈ వార్తల నేపథ్యంలో ఏషియన్‌ పెయింట్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం బలపడి రూ. 3,112 వద్ద ముగిసింది
* కరోనా ఆర్థిక వ్యవస్థకు చేసిన గాయాలు, ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం ఎఫెక్ట్‌ వెరసి స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజ కంపెనీ యాపిల్‌కి ఇబ్బందులు తెచ్చి పెట్టాయి. స్మార్ట్‌ఫోన్‌ డిమాండ్‌ పడిపోతుండటంతో ఆ కంపెనీ లాభాలు పరిమితం కావచ్చంటూ ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ జేపీ మోర్గాన్‌ సూచించింది. అందుకు తగ్గట్టుగా మోస్ట్‌ ఫ్రిఫరెడ్‌ స్టాక్స్‌ జాబితా నుంచి యాపిల్‌ను తొలగించింది.మార్కెట్‌ కన్సల్టెన్సీ సంస్థ జేపీ మోర్గాన్‌ అనేక బడా కార్పోరేట్‌ కంపెనీలకు సేవలు అందిస్తోంది. అదే విధంగా స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లకు కూడా విలువైన సూచనలు చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆయా కంపెనీల లావాదేవీలు, మార్కెట్‌ ఎత్తుగడలు, ప్రపంచ పరిస్థితులను అంచనా వేస్తూ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు మోస్ట్‌ ఫ్రిఫరెడ్‌ స్టాక్స్‌ పేరుతో ఓ జాబితా రూపొందిస్తుంది. ఈ జాబితాలో యాపిల్‌ సంస్థ కొన్నేళ్లుగా సుస్థిర స్థానం సంపాదించుకుంది.అయితే కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించడం, ఆ వెంటనే సప్లై చెయిన్‌ దెబ్బతినడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మూలికే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇంతలో ఉక్రెయిన్‌, రష్యా వార్‌ వచ్చిపడింది. దీంతో ఆదాయ వనరులు తగ్గిపోయాయి. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు క్షీణిస్తున్నాయి. వీటిని నిలబెట్టుకునేందుకు అప్పటికీ యాపిల్‌ సంస్థ పలు మోడళ్ల ధరలకు కోత పెట్టింది. ఐనప్పటికీ అమ్మకాలు మెరుగుపడే అవకాశం లేకపోవడం. పైగా యాపిల్‌ ఫోన్లు ఎక్కువగా తయారయ్యే చైనాలో మరోసారి కరోనా విజృంభిస్తుండటంతో పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఫలితంగా యాపిల్‌ ఆశించిన మేరకు లాభాలు అందించలేకపోవచ్చని జేపీ మోర్గాన్‌ అంచనా వేస్తోంది. యాపిల్‌తో పాటు ప్రముఖ చిప్‌ మేకర్‌ కంపెనీ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ సైతం మోస్ట్‌ ప్రిఫరబుల్‌ స్టాక్స్‌ జాబితాలో చోటు కోల్పోయింది. ఈ రెండింటి స్థానంలో నెట్‌వర్క్‌ ఎక్వీప్‌మెంట్‌ కంపెనీలైన ఆరిస్టా నెట్‌వర్క్‌, సియన్నా కంపెనీలు చోటు దక్కించుకున్నాయి
*వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లలో సరికొత్త ఆల్‌టైం రికార్డు నమోదైంది. ఈ ఏడాది మార్చిలో జీఎస్‌టీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 15 శాతం వృద్ధితో రూ.1.42 లక్షల కోట్లు అధిగమించాయని కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం ప్రకటించింది. ఆర్థిక సంవత్సరాంతం కావడంతో పాటు కొవిడ్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం తో ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక కార్యకలాపాలు జోరందుకోవడం, పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేయ డం ఇందుకు దోహదపడింది. గత ఆల్‌టైం రికార్డు ఆదాయమైన రూ.1.40 లక్షల కోట్లు ఈ ఏడాది జనవరిలో నమోదైంది. 2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి (జనవరి-మార్చి) జీఎస్‌టీ స్థూల వసూళ్ల సగటు రూ.1.38 లక్షల కోట్లుగా ఉండగా.. మూడో త్రైమాసికానికి (అక్టోబరు-డిసెంబరు) రూ.1.30 లక్షల కోట్లు, రెండో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబరు) రూ.1.15 లక్షల కోట్లు, తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌) రూ.1.10 లక్షల కోట్లుగా నమోదైంది.
*మధుకాన్‌ ఇన్‌ఫ్రా అనుబంధ సంస్థ సింహపురి ఎనర్జీ లిమిటెడ్‌ విలువను తగ్గించి విక్రయించాలన్న ప్రతిపాదనపై హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. ఈ సంస్థ గతంలో ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణాలు పొందించింది. ఈ మొత్తం రుణాలను వన్‌ టైం సెటిల్‌మెంట్‌ కింద రూ. 800 కోట్లు చెల్లిస్తామని ప్రతిపాదించింది.
*మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (ఎంఈఐఎల్‌) హైడ్రోజన్‌ ఇంధన రంగంలోకి అడుగు పెడుతోంది. వ్యాపార విస్తరణలో భాగంగా పర్యావరణ అనుకూల రంగాల్లోకి ప్రవేశించాలని ఎంఈఐఎల్‌ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా గ్రూప్‌ కంపెనీ డ్రిల్‌మెక్‌ ఎస్‌పీఏ ద్వారా హైడ్రోజన్‌ ఇంధన ఉత్పత్తిలోకి అడుగు పెడుతున్నట్లు ఎంఈఐఎల్‌ తెలిపింది. హైడ్రోజన్‌ ఇంధన రంగంలో డ్రిల్‌మెక్‌ 3.5 కోట్ల యూరోల (దాదాపు రూ.300 కోట్లు) పెట్టుబడులు పెట్టనుంది. ఎలకా్ట్రలిసిస్‌, పైరోలిసిస్‌ వంటి అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీల ద్వారా హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త టెక్నాలజీల ద్వారా హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి ‘ఐడ్రోజనా’ పేరుతో స్టార్టప్‌ కంపెనీని డ్రిల్‌మెక్‌ ప్రారంభించిందని డ్రిల్‌మెక్‌ ఎస్‌పీఏ సీఈఓ సిమన్‌ ట్రెవిసాని తెలిపారు.
*ఎన్‌ఎండీసీ ఇనుప ఖనిజం ధరలను మళ్లీ పెంచింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. లంప్‌ రకం ఖనిజం ధరను టన్నుకు రూ.100, ఫైన్స్‌ రకం ధరను రూ.200 సవరించింది. దీంతో టన్ను లంప్‌ ఖనిజం ధర రూ.6,100కు, ఫైన్స్‌ ధర రూ.5,160 చేరుతుందని ఎన్‌ఎండీసీ వెల్లడించింది. దీనికి రాయల్టీ, సెస్‌, ఫారెస్ట్‌ పర్మిట్‌ ఫీజు అదనం. కాగా గత నెల 8న ఇనుప ఖనిజం ధరలను కంపెనీ పెంచింది.
*కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రింట్‌ మీడియా ఆదాయాలు 20 శాతం మేరకు పెరిగి రూ.27,000 కోట్లకు చేరుకోవచ్చని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ తన తాజా నివేదికలో వెల్లడించింది. బేస్‌ ఎఫెక్ట్‌ తో పాటు ప్రకటనలు, చందాల ఆదాయాలు పెరగడంతో ఈ వృద్ధి ఏర్పడనున్నట్టు తెలిపింది. అయితే పెరుగుతున్న న్యూస్‌ ప్రింట్‌ ధరలు నిర్వహణాపరమైన లాభదాయకతను 3 నుంచి 3.5% మేరకు తగ్గించవచ్చుని పేర్కొంది.
*విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధలను ఉల్లంఘించిన వ్యవహారంలో చెన్నై కేంద్రంగా ఉన్న సదరన్‌ అగ్రిఫ్యూరేన్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఏఐపీఎల్‌)కు చెందిన రూ.216.40 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం జప్తు చేసింది. సదరన్‌ అగ్రిప్యూరేన్‌తో పాటు ఆ సంస్థ డైరెక్టర్లు ఎంజీఎం మారన్‌, ఆనంద్‌ పేరున తమిళనాడు, తెలంగాణలో ఉన్న స్థిరాస్తులను అటాచ్‌ చేసినట్లు తెలిపింది. ఈ కేసులో గత ఏడాది డిసెంబరులో 293 కోట్లను జప్తు చేసింది.
*ప్రస్తుత ద్రవ్యోల్బణం రేట్లను దృష్టిలో ఉంచుకుని ఎన్‌ఎ్‌ససీ, పీపీఎఫ్‌ సహా చిన్న పొదుపు మొత్తాల వడ్డీరేట్ల ను 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి యథాతథంగా కొనసాగిస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచి ఈ రేట్లను సవరించలేదు. ఈ నిర్ణయం ప్రకారం ఎన్‌ఎ్‌ససీలపై వార్షిక వడ్డీరేటు 7.1ు, ఎన్‌ఎ్‌ససీలపై వడ్డీ రేటు 6.8 శాతం వద్ద యథాతథంగా ఉంటాయి. జూన్‌ 1వ తేదీ వరకు ఈ వడ్డీ రేట్లు అమలులో ఉంటాయి.