*పెద్దవడగూరు మండలం చిన్నవడగూరులో వైసీపీ కార్యకర్తల దౌర్జన్యానికి దిగారు. టీడీపీ కార్యకర్తలపై రాళ్లుకట్టెలతో వైసీపీ నేత చిరంజీవి రెడ్డి వర్గీయుల దాడికి దిగారు. ఉగాది సందర్భంగా తొలిసేద్యం చేసేందుకు ఎద్దులబండిలో టీడీపీ వర్గీయుడు వెళ్లాడు. అదే సమయంలో వైసీపీ వర్గీయులు టపాసులు పేల్చారు. ఎద్దులు బెదరడంతో వైసీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
* పంజాబ్ నుంచి రాష్ట్రానికి మాదకద్రవ్యాలను తీసుకొచ్చి విక్రయిస్తున్న ఇద్దరిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ శుక్రవారం వెల్లడించారు. పంజాబ్‌కు చెందిన జగ్తార్‌సింగ్ (58) లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. 12 ఏళ్ల క్రితం వలసొచ్చి మేడ్చల్ కండ్లకోయ టోల్‌ప్లాజా సమీపంలో పం జాబీ ధాబా నిర్వహిస్తున్నాడు.రంజిత్‌సింగ్ అనే లారీ డ్రైవర్‌తో ఏర్పడిన పరిచయంతో పంజాబ్ నుంచి డ్రగ్‌ను తెప్పించి ధాబాకు వచ్చేవారికి చిన్నచిన్న ప్యాకెట్ల రూపంలో విక్రయించేవాడు. మార్చి 31న రాత్రి 10 గంటలకు శామీర్‌పేట్ రోడ్డు వద్ద ఓ అనుమానితకారును ఎస్‌ఓటీ పోలీసులు తనిఖీ చేయగా జగ్తార్‌సింగ్, అతని అనుచరుడు జైమాల్‌సింగ్ 900 గ్రాముల మాదకద్రవ్యం ప్యాకెట్లతో పట్టుబడ్డారు. దీంతో వారిని అరెస్టు చేసి, మాదక ద్రవ్యం ప్యాకెట్లతోపాటు కారు, 3 సెల్‌ఫోన్లు చేసుకున్నారు. వాటి విలువ రూ. 15 లక్షలు. రంజిత్‌సింగ్ పరారీలో ఉన్నాడ
*ఐసిస్ పేరుతో చేస్తున్న ప్రచారం గుట్టురట్టయింది. సోషల్ మీడియాలో ఐసిస్ ఉగ్రవాదంపై సులేమాన్ అనే వ్యక్తి ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌లో సులేమాన్ ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పాతబస్తీ వాసి సులేమాన్‌ను పోలీసులు గుర్తించారు. ఐపీ అడ్రస్‌ల ఆధారంగా సులేమాన్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సులేమాన్‌ను శుక్రవారం అరెస్ట్‌చేసి రిమాండ్‌కి తరలించారు. 20 సోషల్ మీడియా అకౌంట్లతో ఉగ్రవాదంపై సులేమాన్ ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సులేమాన్ సోషల్ మీడియా అకౌంట్లను పోలీసులు తొలగించారు. సులేమాన్ కాల్ లిస్ట్‌లో ఉన్న వ్యక్తులపై సైబర్‌క్రైమ్ పోలీసులు నిఘాపెట్టారు. ఎవరితో కాంటాక్ట్‌లో ఉండి ఈ పోస్టులు పెడుతున్నారన్న వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
*నాగర్ జిల్లాలోని చారకొండ మండలం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండలంలోని తుర్కల పల్లి సమీపంలో ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జనుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో.. నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
*ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఓ ఏనుగు విద్యుదాఘాతానికి గురైంది. సదుం మండలం చెరుకువారిపాలెంలో ఓ రైతు పొలం వద్ద బోర్ మోటార్‌కు ఉన్న విద్యుత్ తగిలి మృతి చెందింది. ఏనుగు మృతి సమాచారంతో అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న ఏపీ మంత్రి పెద్దిరెడ్డి గ్రామానికి వెళ్లి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. స్థానికుల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.
*తమిళనాడులోని తిరుపత్తూర్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జవధుమలైలో మినీ వ్యాన్ ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొని బోల్తా పడటంతో ఏడుగురు మరణించారు.
*హైదరాబాద్ నగరంలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పండగ రోజు విషాదం చోటు చేసుకుంది. తను నడిపే లారీ క్రింద పడి దామోదర్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. లారీ సెల్ఫ్ మోటర్ పనిచేయకపోవడంతో దిగి చెక్ చేసే సమయంలో దామోదర్‌పై లారీ దూసుకుపోయింది. దీంతో అతడు అక్కడిక్కక్కడే మృతి చెందాడు. మృతుడి స్వస్థలం నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం గోపాలపెళ్లి విలేజ్. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
*కర్నూలు: జిల్లాలోని నందికొట్కూరు మండలం బొల్లవరం గ్రామ సమీపంలో కేజీ రోడ్డుపై లారికి ఉరి వేసుకుని లారీడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
*కామారెడ్డి: జిల్లాలోని సదాశివనగర్ మండలం అమర్లబండ గ్రామ సర్పంచ్ దంపతులపై కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. గ్రామ సర్పంచ్ లతపై రాళ్లతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో లత భర్త రాజేశ్వర్ కూడా గాయాలపాలయ్యారు. పాత కక్షలతో ఈ దాడికి పాల్పడ్డట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. దాడిలో కారు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి.
*అఫ్ఘానిస్థాన్ దేశంలోని హెరాత్ నగరంలో జరిగిన పేలుడులో 12మంది మరణించారు. పశ్చిమ ప్రావిన్స్ హెరాత్ నగరంలోని పీడీ 12 ప్రాంతంలో జరిగిన పేలుడులో 12 మంది మరణించగా, మరో 25 మంది గాయపడ్డారు.గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పేలుడు పదార్థాలను క్రీడామైదానంలో పాతిపెట్టడంతో దానిపై యువకులు ఆడుకుంటుండగా పేలిందని అప్ఘాన్ అధికారులు చెప్పారు. ఈ పేలుడుకు కారణం ఎవరనేది ఇంకా తేలలేదు. గత ఏడాది ఆగస్టులో అఫ్ఘానిస్థాన్ దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి దేశవ్యాప్తంగా దాడులు, పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడుల్లో కొన్నింటిని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చేశారు.హెరాత్ నగరంలో జనవరి నెలలోనూ పేలుడు జరిగింది. నాటి పేలుళ్లలో ఏడుగురు మరణించారు.
*తూర్పు గోదావరి (కాకినాడ): జిల్లాలోని కృష్ణవరం టోల్‌గేట్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భారీ మొత్తంలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.5.06 కోట్ల నగదు, 10 కిలోల బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. పద్మావతి ట్రావెల్స్ బస్సులో నగదు, బంగారం తరలిస్తున్నారు. పద్మావతి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నగదు, బంగారాన్ని తరలిస్తుండగా వ్యక్తి పట్టుబడ్డాడు. ఎక్కడి నుంచి ఎక్కడకు తరలిస్తున్నారో పోలీసులు ఆరా తీస్తున్నారు. స్వాధీనం చేసుకున్న డబ్బు, బంగారాన్ని మీడియా ముందు పెద్దాపురం సర్కిల్ పోలీసులు ప్రదర్శించారు. నగదును పట్టుకున్న జగ్గంపేట సీఐ సూర్యఅప్పారావు, కిర్లంపూడి ఎస్సై తిరుపతిరావుని పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు.
*నాగర్‌కర్నూల్: జిల్లాలోని చారకొండ మండలం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తుర్కల పల్లి సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న దిమ్మెను ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో నలుగులు అక్కడిక్కడే మృతిచెందారు. మరొకరు గాపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
*జస్ధాన్‌లో దారుణం వెలుగుచూసింది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లిన 16 ఏండ్ల బాలికను పొరుగున ఉండే వ్యక్తి అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటన భరత్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.