Kids

భలేభలే పీచుమిఠాయి

భలేభలే పీచుమిఠాయి

హాయ్ ఫ్రెండ్స్ …. మనందరికి పిచుమిఠాయి అంటే చాలా చాలా ఇష్టం కదూ ! తింటే భలే తియ్యగా ఉంటుంది కదా ! దాని విశేషాలు కూడా భలేగా ఉంటాయి . చాక్లెట్లూ , తీపి పదార్థాలూ ఎక్కువగా తింటే పళ్లు పాడవుతాయని మనకు డాక్టర్లు చెబుతుంటారు . కానీ విచిత్రంగా కాటన్క్యాండీని అదే ఫ్రెండ్స్ … ఈ పీచుమిఠాయిని ఓ డెంటిస్ట్ కనిపెట్టాడు . 1897 వ సంవత్సరంలో అమెరికాలోని నాష్విల్ నగరంలో డెంటిస్ట్ విలియం మోరిసన్ , జాన్ సి . వార్టన్ అనే ఇద్దరు కలిసి ఓ యంత్రాన్ని కనిపెట్టారు . ఈ యంత్రంలో చక్కెరను పోస్తే అది దారపు పోగుల్లా బయటకు వచ్చింది . ఈ మిఠాయిని చిన్న చిన్న చెక్క పెట్టెల్లో ప్యాక్ చేసి ప్రపంచానికి పరిచయం చేశారు . కానీ అప్పటికి ఈ మిఠాయికి కాటన్క్యాండీ అని పేరు పెట్టలేదు . ఈ కాటన్క్యాండీ యంత్రంలో 1921 లో జోసెఫ్ లాక్సోక్స్ మరికొన్ని మార్పులు చేశాడు . విచిత్రమైన విషయం ఏంటంటే ఈయన కూడా ఓ డెంటిస్టే . అప్పటి నుంచి ‘ కాటన్ క్యాండీ ‘ అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది . చాలా ఆహార పదార్థాలకన్నా ఈ కాటన్ క్యాండీనే

కాట్యండ్ యంత్రంలో 921 లో సెఫ్ లాక్సక్స్ మరికొన్ని మార్పులు చేశాడు . విచిత్రమైన విషయం ఏంటంటే ఈయన కూడా ఓ డెంటిస్టే . అప్పటి నుంచి ‘ కాటన్ క్యాండీ ‘ అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది . చాలా ఆహార పదార్థాలకన్నా ఈ కాటన్క్యాండీనే ఆరోగ్యకరమైనది . ఎందుకంటే కేవలం రంగు చక్కెర , గాలి సాయంతోనే ఈ మిఠాయి తయారవుతుంది మరి . ఈ కాటన్ క్యాండీ ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అమ్ముడవుతోంది . కానీ ఒక్కో దేశంలో దీన్ని ఒక్కో పేరుతో పిలుస్తారు . ఫ్రాన్స్లో ‘ డాడీస్ బియర్డ్ ‘ , ఆస్ట్రేలియాలో ‘ ఫెయిరా ఫ్లోప్స్ ‘ , చైనాలో ‘ డ్రాగన్స్ బియర్డ్ ‘ , నెదర్లాండ్స్ ‘ షుగర్ స్పైడర్ ‘ అనీ పిలుస్తారు . డిసెంబర్ 7 న అమెరికాలో ఏకంగా ‘ నేషనల్ కాటన్ క్యాండీ డేగా జరుపుకుంటారు . ఫ్రెండ్స్ …. మొత్తానికి ఇవీ పీచుమిఠాయి విశేషాలు