Movies

ఓ కన్ను వేయాల్సిందే!

Auto Draft

‘‘చిత్రసీమలో ఎవ్వరినీ తక్కువ అంచనా వేయొద్దు. ప్రతీ ఒక్కరికీ ఓ రోజుంటూ వస్తుంది. ఆ రోజున వాళ్ల ముందు తల దించుకోకూడదు’’ అంటూ తనదైన ఓ ఫిలాసఫీని చెప్పుకొచ్చారు సమంత. ప్రస్తుతం  వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారామె. బాలీవుడ్‌లోనూ జెండా పాతడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ‘‘ఎంతో కొంత ప్రతిభ, బోలెడంత ప్యాషన్‌ ఉంటేనే తప్ప చిత్రసీమలోకి ఎవ్వరూ అడుగుపెట్టరు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో సాధించాలన్న కసి ఉంటుంది. అయితే.. అదృష్టం కలసిరాక కొంతమంది వెలుగులోకి రాలేరు.   ఒక్క సినిమా చాలు. రాతలు మారిపోతాయి. జాతకాలు తిరగబడిపోతాయి. అలాంటి సినిమా ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలీదు. స్టార్‌ డమ్‌ ఉన్నవారే.. గొప్పవాళ్లు కాదు. ఫ్లాపుల్లో ముగినివాళ్లకు ప్రతిభ లేదని కాదు. ఇటు ఉన్నవాళ్లు అటు.. అటు ఉన్నవాళ్లు ఇటు మారిపోవడానికి ఎంతో సేపు పట్టదు. అందుకే అందరినీ ఓ కంట గమనిస్తూనే ఉండాలి’’ అని చెప్పుకొచ్చారు సమంత.