Movies

సహనమే విజయ సోపానం

Auto Draft

నిదానమే ప్రదానం అనే మాటని కొత్తగా రాసుకుంటోంది ఈతరం. అన్నిటా వేగం ఉండాల్సిందే అన్నది వారి మాట. టక టకా సినిమాలు చేయడం, చక చకా పేరు తెచ్చేసుకోవడంపైనే వాళ్ల ఫోకస్‌ ఉంటుంది. కానీ తాను ఆ టైపు కాదంటున్నారు నిధి అగర్వాల్‌. ఈ సంక్రాంతికి ‘హీరో’తో ప్రేక్షకుల్ని పలకరించిన నిధి… ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌తో ‘హరి హర వీరమల్లు’ కోసం జట్టుకట్టారు. నిధి మాట్లాడుతూ ‘‘ఫేమ్‌ ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా పోయే ప్రమాదం ఉంది. మెల్లమెల్లగా ఒక్కో మెట్టూ ఎక్కుకుంటూ వెళ్తే.. పునాది బలంగా ఉంటుంది. నేను దీర్ఘకాలం చిత్రసీమలో ఉందామనుకుంటున్నాను. ఇప్పటికిప్పుడే నా ప్రతిభనంతా చూపించేయాలన్న ఆత్రుత లేదు. ఒక్కో సినిమాతో ఒక్కో రకంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వెళ్తే చాలు. ఇక్కడ సహనం, నిదానం రెండూ విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎప్పుడు ఎలాంటి అవకాశం వస్తుందో తెలీదు కాబట్టి, ఆ అవకాశం కోసం ఓపిగ్గా ఎదురు చూడాలి’’ అని చెప్పారామె.