అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూమార్తె ఇవాంకా ట్రంప్‌ను హౌజ్ కమిటీ 8 గంటల పాటు విచారణ జరిపింది. 2021 జనవరి ఆరవ తేదీన క్యాపిటల్ హిల్‌పై జరిగిన దాడి కేసులో ఈ దర్యాప్తు సాగింది. క్యాపిటల్ హిల్ దాడి కేసులో ఇప్పటికే హౌజ్ కమిటీ సుమారు 800 మంది సాక్ష్యుల్ని విచారించింది. అమెరికా అధ్యక్ష ఫలితాల తర్వాత ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్‌పై ముట్టడి చేశారు. అయితే ఆ సమయంలో భారీ హింస చెలరేగింది. దాడిని అడ్డుకోవాలంటూ ఇవాంకా తన తండ్రి డోనాల్డ్ ట్రంప్‌ను కోరినట్లు సాక్ష్యాదారాలు ఉన్నాయని, అందుకే స్వచ్ఛంధకు విచారణకు హాజరుకావాలని హౌజ్ కమిటీ ఆదేశించింది. వైట్‌హౌజ్ మాజీ అడ్వైజర్‌గా పనిచేసిన ఇవాంకా.. దాడి ఘటనను ఖండించాలని డోనాల్డ్‌ను కోరినట్లు తెలుస్తోంది. కమిటీ అడిగిన ప్రశ్నలకు ఇవాంకా సమాధానం ఇచ్చినట్లు కాంగ్రెస్ సభ్యుడు బెన్నీ థాంప్సన్ తెలిపారు.