*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే కొత్త జిల్లాలు ఏరాటైన విషయం విదితమే. అయితే ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ (ఎల్‌జీడీ) కోడ్‌లు కేటాయించింది. పార్వతీపురం మన్యం జిల్లాకు 743, అనకాపల్లికి 744, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 745, కాకినాడకు 746, కోనసీమకు 747, ఏలూరుకు 748, ఎన్టీఆర్ జిల్లాకు 749, బాపట్లకు 750, పల్నాడుకు 751, తిరుపతికి 752, అన్నమయ్య జిల్లాకు 753, శ్రీ సత్యసాయి జిల్లాకు 754, నంద్యాలకు 755 కోడ్‌లను కేటాయించింది. ఇకపై ఈ కోడ్‌ల ఆధారంగానే పాలనాపరమైన వ్యవహారాలు నడుస్తాయి. ముఖ్యంగా పంచాయత్ ఈ-పంచాయత్ మిషన్ మోడ్ కింద ఎంటర్‌ప్రైజ్ సూటీ (పీఈఎస్) పేరుతో రూపొందించే అప్లికేషన్లలో వీటిని వినియోగిస్తారు.
*టీటీవీ దినకరన్‌కు ఈడీ నోటీసులు
మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపింది. వీకే శశికళ వర్గానికి ‘రెండు ఆకులు’ గుర్తు సంపాదించేందుకు ఎన్నికల కమిషన్ అధికారులకు లంచం ఇవ్వచూపారనే ఆరోపణలకు సంబంధించిన కేసు ఇది. ఇదే కేసులో అరెస్టు చేసిన సుఖేష్ చంద్రశేఖర్ అనే మరో వ్యక్తి స్టేట్‌మెంట్‌ను ఈడీ ఈ నెల మొదట్లోనే రికార్డు చేసింది. దర్యాప్తును మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు ఇప్పుడు దినకరన్‌ను కూడా ఈడీ ప్రశ్నించేందుకు నోటీసులిచ్చింది. ఈ నెల 8వ తేదీలోగా తమ ముందు హాజరు కావాలని దినకరన్‌కు ఇచ్చిన నోటీసులో ఈడీ పేర్కొంది. పీఎంఎల్ఏ కింద ఆయన స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డు చేయనుంది.
*ఉచిత మధ్యాహ్న భోజన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని
సమాజ సేవతోనే మానవ జీవితానికి సార్ధకత లభిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. అమీర్ పేట డివిజన్ లోని బికె గూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న మిత బోజన కేంద్రం, చలివేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మాట్లాడుతూ 2011 సంవత్సరంలో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం వేసవి కాలంలో 2 నెలల పాటు మధ్యాహ్నం భోజనం అందించడం ఎంతో సంతోషదాయకం అని నిర్వహకులను అభినందించారు. గత రెండు సంవత్సరాల నుండి కరోనా మహమ్మారి కారణంగా ఏర్పాటు చేయలేకపోయామని నిర్వహకులు పార్ధ సారధి మంత్రికి వివరించారు
*ఐఎన్ఎస్ విక్రాంత్ రక్షణ కోసం మహారాష్ట్ర ప్రజల నుంచి సేకరించిన రూ.50 కోట్లు ఏమయ్యాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బీజేపీ నేత కిరీట్ సోమయ్యను ప్రశ్నించారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ఈ నౌక సహా భారత నావికా దళం ప్రముఖ పాత్ర పోషించింది. ఈ నౌక దెబ్బతినడంతో, దానిని ప్రదర్శనశాలగా మార్చాలని డిమాండ్లు వచ్చాయి. దీని కోసం ప్రజల నుంచి విరాళాలను సేకరించారు.
*ధాన్యం సేకరణకు జాతీయ విధానం ఉండాలే..పార్లమెంట్ లో చర్చకు టీఆర్ఎస్ వాయిదా తీర్మానం తెలంగాణలో పండిన వరి ధాన్యం కొనే విషయంలో కేంద్రం మొండికేస్తున్న విషయం తెలిసిందే. అసలు వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పటి వరకు కేంద్రానికి ఓ విధానం అంటూనే లేదు.దీనికి కారణంగా చాలా రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో టీఆర్ఎస్ ఎంపీలు ఈ విషయం దృష్టి పెట్టారు. అసలు వరి ధాన్యం కొనుగోలు పై జాతీయ విధానం ఉండాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి లోక్ సభలో చర్చ జరగాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చారు.లోక్ సభలో టీఆర్ఎస్ పార్టీ పక్ష నేత నామా నాగేశ్వర్ రావు ధాన్యం సేకరణపై స్పీకర్ కు నోటీసులు ఇచ్చారు. తెలంగాణలో రైతాంగం ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎఫ్‌సీఐ సేకరించడం లేదని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారన్నారు. దేశంలో ఆహార ధాన్యాల సేకరణపై కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన జాతీయ విధానం అవలంభించాలని ఆయన కోరారు.
* జెనరిక్ మెడిసిన్ విభాగంలో ప్రఖ్యాతి చెందిన జాంప్ ఫార్మా తొలి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. జాంప్ ఫార్మా విస్తరణలో భాగంగా సుమారు రూ.250 కోట్లతో నిర్మించిన ఎక్స్‌లెన్సీ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. కెనడా వెలుపల జాంప్‌కి ఇదే తొలి సెంటర్. ఈ సెంటర్ ఆరంభం కావడంతో షార్మా రంగంలో కొత్తగా రెండు వందల మందికి ఉపాధి లభించనుంది.
* కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు హాజరయ్యారు. బుధవారం ఉదయం జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుల పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇక సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగియడంతో.. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఏపీకి తిరుగుపయనం అయ్యారు సీఎం జగన్.
* టీకాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్ ముగిసింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించేవరకు పోరాడుతామన్నారు. రైతులు పండించిన ప్రతి గింజ కొనేవరకు కాంగ్రెస్ పోరాడుతుందని పేర్కొన్నారు. రేపు విద్యుత్ సౌధ, సివిల్ సప్లై ఆఫీసులు కూడా ముట్టడిస్తామన్నారు. ఈ నెలాఖరున వరంగల్‌లో జరిగే సమావేశానికి.. రాహుల్ గాంధీ రావాలని ప్రతిపాదన పెట్టామన్నారు.
* గుంటూరు నగరంలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జెండాను జాతీయ నేత కన్నా లక్ష్మినారాయణ ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు వల్లూరి జయప్రకాశ్ నారాయణ, శనక్కాయల అరుణ, పాటిబండ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నేతలకు కన్నా లక్ష్మి నారాయణ సన్మానం చేశారు.
*వేసవి సందర్భంగా సికింద్రాబాద్-మదురై మధ్య వారాంతపు ప్రత్యేక రైళ్లను వేశారు. రైలు నం.07191 ఏప్రిల్ 11, 18, 25న.. మదురై-సికింద్రాబాద్ రైలు(07292) ఏప్రిల్ 13, 20, 27న నడుస్తాయి. ఈ రైళ్లు నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కట్పాడి, తిరువణ్ణమాలై, విల్లుపురం, శ్రీరంగం, తిరుచిరాపల్లి, దిండిగల్‌లో ఆగుతాయి
*భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈనెల 14న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలకు సెలవు ప్రకటిస్తూ భారత సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఉత్తర్వులు ఇచ్చింది.
*బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పీఈసెట్) పరీక్షకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 11 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుందని పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వి.సత్యనారాయణ తెలిపారు. దరఖాస్తు రుసుము ఎస్సీ, ఎస్టీలకు రూ. 400, ఇతరులకు రూ. 800గా నిర్ణయించామని చెప్పారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు
*బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పీఈసెట్) పరీక్షకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 11 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుందని పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వి.సత్యనారాయణ తెలిపారు. దరఖాస్తు రుసుము ఎస్సీ, ఎస్టీలకు రూ. 400, ఇతరులకు రూ. 800గా నిర్ణయించామని చెప్పారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు
*కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రేషన్ పంపిణీ ఆలస్యమైంది. ప్రతినెలా 4 నుంచి రేషన్ పంపిణీ ప్రారంభిస్తుండగా ఈనెలలో ఇంకా ప్రారంభం కాలేదు. జిల్లాల ఏర్పాటుతో సాంకేతికంగా స్టాకు జనరేట్ చేయడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయని, ఒకట్రెండు రోజుల్లో వాటిని పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. 8వ తేదీ నుంచి రేషన్ పంపిణీ చేపడతామని చెబుతున్నారు. కాగా ఉచిత రేషన్‌ను కేంద్రం మళ్లీ పొడిగించడంతో రెగ్యులర్ రేషన్ పంపిణీ పూర్తవ్వగానే ఉచిత కోటా మొదలుకావాల్సి ఉంది.
*రైతు లేకుంటే జీవితం లేదు. అందరికీ అన్నం పెట్టే రైతులు ఇప్పుడు బలవన్మరణం పాలవుతున్నారు. జనం కష్టాల నుంచి ఓట్లు ఎలా పొందాలో ఆలోచించే వ్యక్తిని కాదు. వారికి ఏం చేయగలనో ఆలోచిస్తాను’’ అని జనసేన అధినేత పవన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కౌలు రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలోనే 353 మంది చనిపోయారని… అనంతపురం జిల్లాలో 170 మంది, ఉభయ గోదావరి జిల్లాల్లో 81 మంది మరణించారని చెప్పారు. కొందరు రైతుల పేర్లు కూడా చదివి వినిపించారు. ‘‘షేక్ నబీ సాహెబ్, శీనా నాయక్, త్రిమూర్తులు, నంద్యాల విశ్వనాథ రెడ్డి, కురవ తిమ్మప్ప, పల్లా నరసింహమూర్తి, బోయ రామాంజనేయులు… ఇలా ఎంతో మంది! వైసీపీ ప్రభుత్వం అన్నం పెట్టే రైతులోనూ కులం చేస్తోంది. రైతుకు కులం లేదు. వారికి అండగా నిలవాలి’’ అని పవన్ పేర్కొన్నారు. ‘‘డబ్బు ఎంతిచ్చినా సరిపోదని నాకూ తెలుసు. మేం ఇచ్చే లక్షతో అద్భుతాలు జరగవనీ తెలుసు. కానీ… నా వంతుగా ఏదో చేయాలనుకున్నాను. ఒక్క కన్నీటి చుక్క తుడిసినా… జన్మ ధన్యమవుతుంది’’ అని పవన్ తెలిపారు. ఈనెల 12న అనంతపురంలో పర్యటిస్తానని చెప్పారు. దీనికి ‘జనసేన రైతు భరోసా యాత్ర’గా నామకరణం చేశారు
*తెలంగాణ వైద్యవిధాన పరిషత్(టీవీవీపీ) అదనపు ఇంచార్జి కమిషనర్ డాక్టర్ రమేశ్‌రెడ్డిని సర్కారు ఈ బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో డాక్టర్ జే.అజయ్‌కుమార్‌ను నియమించింది. అయితే.. ఇంకా రెండు కీలక పోస్టులు ఆయన చేతిలోనే ఉండడం గమనార్హం. వైద్యవిద్య సంచాలకుడు పోస్టుతోపాటు గాంధీ వైద్యవిద్య కళాశాల ప్రిన్సిపాల్‌గానూ ఆయన కొనసాగనున్నారు. టీవీవీపీ ఇంచార్జి కమిషనర్‌గా 2019 అక్టోబరులో బాధ్యతలు స్వీకరించిన రమేశ్.. ఇప్పటి వరకూ ఇంచార్జి కమిషనర్‌గా కొనసాగుతున్నారు. మూడు పోస్టు లు నిర్వహిస్తుండడం వల్ల.. ఆస్పత్రులు, బోధనాస్పత్రులపై దృష్టి సారించలేకపోతున్నారనే విమర్శలు వచ్చినా.. కుర్చీ వీడలేదు. ఇదే ఎంజీఎం ఆస్పత్రి ఘటనకు కారమణమనే ఆరోపణులాన్నా ఆయన పదవులకు మా త్రం భంగం కలగలేదు. కాగా.. డాక్టర్ అజయ్‌కుమార్ కామారెడ్డి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తూ ఇక్కడికి వచ్చారు
*ఉన్న ఊరికి కన్న తల్లికి ఏదైనా చేయాలంటారు. ఊరికి, తల్లికి పాఠశాల కూడా ఏమాత్రం తీసిపోదు. వ్యక్తులను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో పాఠశాలల పాత్ర ఎనలేనిది. అలాంటి పాఠశాలకు ఏదైనా చేయడం అంటే.. రాబోయే తరాలకు మేలు చేయడమే. ఇలాంటి ఆలోచనతోనే తాను చదువుకున్న కాలేజీని మరింత ఉన్నతంగా చూడాలనుకున్న ఇండిగో కో ఫౌండర్ రాకేశ్ గంగ్వాల్ ఏకంగా 100 కోట్ల రూపాయల విరాళంతో ముందుకు వచ్చారు. ఈ నిధులతో క్యాంపర్ ఆవరణలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించనున్నారు. దీనికి గంగ్వాల్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ అని పేరు పెట్టనున్నారట.
* రాష్ట్రంలో జాతీయ రహదారులపై టీఆర్ఎస్ పార్టీ రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టింది. తెలంగాణలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొని తీరాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు కార్యకర్తలు ధర్నాలకు దిగారు. పలు చోట్ల రహదారులపై నాయకులు బైఠాయించారు. నాగపూర్, ముంబై, బెంగళూరు, విజయవాడ జాతీయ రహదారులపై నిరసన తెలుపాలని టీఆ‌్బైఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
*రాజదాని ప్రాంతం నుంచి పెట్టే భేడా సర్దేస్తున్న మంత్రులుత 3 ఏళ్ళ నుంచి విజయవాడ, గుంటూరులలో నివాసముంటున్న మంత్రులుమంత్రి పదవులకు ఆఖరి రోజు కావడంతో నివాసగృహాలలోని సామాన్లను స్వస్ధలాలకు తరలిస్తున్న మంత్రులు
*ఉచిత మధ్యాహ్న భోజన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని
సమాజ సేవతోనే మానవ జీవితానికి సార్ధకత లభిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. అమీర్ పేట డివిజన్ లోని బికె గూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న మిత బోజన కేంద్రం, చలివేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మాట్లాడుతూ 2011 సంవత్సరంలో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం వేసవి కాలంలో 2 నెలల పాటు మధ్యాహ్నం భోజనం అందించడం ఎంతో సంతోషదాయకం అని నిర్వహకులను అభినందించారు. గత రెండు సంవత్సరాల నుండి కరోనా మహమ్మారి కారణంగా ఏర్పాటు చేయలేకపోయామని నిర్వహకులు పార్ధ సారధి మంత్రికి వివరించారు
*భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని సుజాతనగర్ మండలం సింగభూపాలెంలో కొత్త దేవత వెలిసింది. దేవత అవతారంలో సుజాతనగర్ ఎంపీపీ భూక్యా విజయలక్ష్మి ప్రత్యక్ష్యమయ్యారు. ప్రత్వంగిర మాత అనే కొత్త దేవత అవతారంలో ఎంపీపీ విజయలక్ష్మి దర్శనమిచ్చారు. దీంతో కొత్త దేవతకు ఎండు మిరపకాయలతో హోమాన్ని భక్తులు నిర్వహించారు. ఈ హోమంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడిల శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. కొత్త దేవత చుట్టూ ఎంపీటీసీలు, సామాన్య ప్రజలు ప్రదక్షిణలు చేస్తున్నారు.