భద్రాద్రి రాముడి కళ్యాణం నిర్వహించే మిథిలా మండపానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. దీనికి చెక్కిన శిల్పకళ భక్తులను ఆకట్టుకుంటోంది. మండపం ప్రారంభమై 2022 ఏప్రిల్ 06కి 58 వసంతాలు పూర్తీ కానున్నాయి. 1960 మే 30న అప్పటి దేవాదాయ శాఖ మంత్రి కల్లూరి చంద్రమౌళి శంఖుస్థాపన చేశారు. 1964 ఏఫ్రిల్ 6న ప్రారంభమైంది. దీని నిర్మాణానికి ముందు ఆలయ ప్రాంగణంలో వార్షిక కళ్యాణం నిర్వహించేవారు. ముక్కోటి వేళ రోజుకో రూపంలో స్వామివారు ఇదే మండపంలో దర్శనం ఇస్తారు. భగవంతుడికి భక్తులకు మధ్య వారధిగా పూజలు అందుకుంటోంది. తమిళనాడుకు చెందిన గణపతి స్థపతి దీని రూపకర్త తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో లభించే నాణ్యమైన రాయితోపాటు భద్రాచలం పరిసరాలలో లభించే శిలలు వాడి ఉంటారని భావిస్తున్నారు.
*మండపం స్తంభాలు , పైకప్పు , ప్రాకారాలకు రామాయణ ఘట్టాలు చెక్కారు.
* సింహం బొమ్మ.. దాని నోట్లో గుండ్రని రాయి .. చేతితో తిప్పితే తిరుగుతుంది. కానీ బయటకు రాదు. ఒకే రాతితో సింహం.. దాని నోట్ల బంతిలా చెక్కడం అద్భుతం.
* చూస్తే ఇనుప గొలుసులా కనిపిస్తుంది. కానీ ఇది ఒకే రాతితో చెక్కడం శిల్ప కళాకారుల నైపుణ్యాన్ని చాటుతోంది.
* ఒకే బొమ్మ ఓ వైపు నుంచి చూస్తే ఏనుగులా , మరోవైపు నుంచి చూస్తే ఎద్దులా కనబడుతుంది. శివ ధనస్సును రాముడు, పక్కనే పోకల దమ్మక్క, నృత్య భంగిమలు ఆకట్టుకుంటాయి.