* ఇద్దరు భారతీయులపై సింగపూర్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా భారీ మొత్తంలో జరిమానా విధిస్తూ షాకిచ్చింది. ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే అని స్పష్టం చేసింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..కొవిడ్ నేపథ్యంలో ప్రపంచ దేశాలు కఠిన నిబంధనలు అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సింగపూర్ ప్రభుత్వం కూడా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. వాటిని ప్రజలందరూ పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిబంధనలను శ్యామ్ కుమార్, అతీశ్ రావు అనే ఇద్దరు భారతీయులు ఉల్లఘించారు. గత ఏడాది న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని కొవిడ్ నియమాలను అతిక్రమించారు. దీంతో వేడుకల్లో పాల్గొన్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం.. శ్యామ్ కుమార్, అతీశ్ రావుతోపాటు ఇద్దరు విదేశీ యువకులకు జరిమాన విధించింది. ఒక్కొక్కరికి 1500 సింగపూర్ డాలర్ల (సుమారు రూ. 83వేల) ఫైన్ వేసింది. ప్రజా శ్రేయస్సు కోసం ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది
*భోలక్ పూర్ ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ ను పోలీసులు అరెస్టు చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ గౌసుద్దీన్‌ను ముషీరాబాద్ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. గౌసుద్దీన్‌పై 353, 506 IPC సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆ కార్పొరేటర్‌ను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసు స్టేషన్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.కార్పొరేటర్ వ్యవహార శైలిని ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి దృష్టికి ట్విట్టర్ ద్వారా తీసుకెళ్లారు. పోలీసులకు గౌరవం ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆ నెటిజన్ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి నిరక్షరాస్యుల ప్రవర్తనను సహించేది లేదని ఆ వ్యక్తి పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ సీరియస్‌గా స్పందిస్తూ.. ఆ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
*ఉంగుటూరు ఎంపీపీ పులపాక ప్రసన్నలక్ష్మీ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు నిన్న రాత్రి ఉంగుటూరు నుంచి స్వగ్రామం తేలప్రోలు వస్తుండుగా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. వైద్యం నిమిత్తం గన్నవరం మండలం చిన్న అవుటపల్లి పిన్నమనేని సిద్దార్ధ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అమె మృతి చెందారు.
*కర్ణాటక లో అరెస్ట్ అయిన ఏపికి చెందిన ఏడుగురు యువకులు. వారి నుంచి రూ.68 లక్షల విలువైన 30 ఎన్ఫీల్డ్ (బుల్లెట్) ద్విచక్రవాహనాలు స్వాధీనం. నిమాలు చూసి ప్రభావితమై విలాసవంతమైన జీవితం గడిపేందుకు అడ్డదారిని ఎంచుకున్న ఏపీ చెందిన ఏడుగురు యువకులు. నగరంలో ఖరీదైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను దొంగిలించడమే వృత్తిగా మార్చుకున్నారు. అలా వరుస దొంగతనాలు చేస్తూ మంగళవారం కర్ణాటకలోని బనశంకరి పోలీసులకు పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.68 లక్షలు విలువైన 30 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరూ ఆంధ్రప్రదేశ్కు చెందినవారిగా గుర్తించారు. వీరంతా ఎంబీఏ, ఇంజినీరింగ్ లాంటి ఉన్నత చదువులు చదువుకున్నవారని వెల్లడించారు.
*డ్రగ్స్‌కు బానిసైమాదక ద్రవ్యాలను అధిక మొత్తంలో తీసుకుని.. ఇటీవల నిమ్స్‌లో మృతి చెందిన బీటెక్ విద్యార్థి మృతి కేసులో కీలక సూత్రధారిడ్రగ్స్ స్మగ్లర్ లక్ష్మీపతిని హైదరాబాద్ సిటీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నాలుగు రోజులుగా పరారీలో ఉన్న అతడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలించి పట్టుకున్నారు. విచారణలో లక్ష్మీపతికి నగరంలో భారీ నెట్‌వర్క్ ఉన్నట్లు గుర్తించారు. ఇంజనీరింగ్ విద్యార్థులుసాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లే లక్ష్యంగా డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు. స్నాప్ చాట్‌టెలీగ్రామ్‌ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్‌ల ద్వారా పలువురిని సంప్రదించినట్లు తెలిసింది.
*నందికొట్కూరులో ఆత్మకూరు ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై ప్రయాణికులు దాడికి పాల్పడ్డారు. బస్సు ఆపనందుకు కండక్టర్‌పై ప్రయాణికులు దాడి చేశారు. ఆత్మకూరు నుంచి కర్నూలుకు గత రాత్రి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. దీంతో డ్రైవర్ బస్సును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. ప్రయాణికులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
*వైయస్సార్ జిల్లా.. మైదుకూరు మునిసిపల్ కమిషనర్ శ్రీనివాసులు, ఏఈ నరసింహులు అరెస్ట్.. కేసులో నిందితులుగా ఉన్న బద్వేల్ మునిసిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి , అప్పటి DE విశ్వనాథ్ పరారీ.. పరారీలో వున్నవారికోసం గాలింపు.. 2016-17 సంవత్సరంలో మునిసిపాలిటీ పరిధిలో రూ. 77 లక్షల నిధుల దుర్వినియోగం కేసులో కీలక పాత్ర..
*కడప నగరంలోని ఓల్డ్ రిమ్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 108 అంబులెన్స్ వాహనాలు దగ్దం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో రెండు 108 అంబులెన్స్ వాహనాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. మరో అంబులెన్స్ వాహనాన్ని కాలిపోకుండా మంటలను అదుపు చేసారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
*హైదరాబాద్ నగరంలో తుపాకీని అమ్మేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని మియపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న గౌతమ్ కుమార్ ఠాకూర్(24) అనే వ్యక్తి అక్రమంగా తుపాకీ కలిగి వుండి దాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్‌ఓటీ, మియపూర్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆటోలో వస్తున్న నిందితుడు గౌతమ్ కునర్ ఠాకూర్‌ను అపి చెక్ చేశారు. అందులో లైసెన్స్ లేని ఒక కంట్రీ మేడ్ 7.65 పిస్టల్ పోలీసులకు లభ్యమైంది. నిందితుడు అట్టి పిస్టల్‌ను అక్రమంగా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు విచారణలో వెల్లడయింది. నిందితుని వద్ద నుంచి ఒక కంట్రీ మేడ్ 7.65 పిస్టల్, 03 లైవ్ రౌండ్స్, రెండు మొబైల్ ఫోన్లు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని మియపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.