Politics

రాష్ట్రంలో నేటి ఈ చీకట్లకు కారణం ఎవరు? – TNI రాజకీయ వార్తలు

రాష్ట్రంలో నేటి ఈ చీకట్లకు కారణం ఎవరు? – TNI రాజకీయ వార్తలు

*మన రాష్ట్రంలో నేటి ఈ చీకట్లకు కారణం ఎవరు? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీలో విద్యుత్‌ కోతలు, ప్రజల వెతలపై చంద్రబాబు ట్వీట్‌ చేశారు. ఏపీ చీకట్లోకి వెళ్లిపోయిందంటూ వాపోయారు. విద్యుత్ కోతలతో ప్రసూతి ఆసుపత్రిలో బాలింతల పరిస్థితి వివరిస్తూ చంద్రబాబు వీడియోను జత చేశారు. తీవ్ర విద్యుత్ కోతలతో జనం నరకం చూస్తున్నారని, గ్రామాల్లో అనధికార పవర్ కట్‌లతో అల్లాడుతున్నారని తెలిపారు. కరెంట్‌ లేక ప్రజలు రోడ్డెక్కుతుంటే.. వాలంటీర్లకు సన్మానం అంటూ రూ.233 కోట్లు తగలేస్తున్నారని తప్పుబట్టారు. ఈ సీఎంను నీరో కాక ఇంకేమనాలి? అని చంద్రబాబు ప్రశ్నించారు.

*ఆ దమ్ము మోదీకి ఉంది: సోము వీర్రాజు
బీజేపీ జలం కోసం జన పోరు యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పురందేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ… సాగు, తాగు నీరు లేక ఉత్తరాంధ్ర ప్రజలు వలసలు వెళ్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మూడేళ్ళలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని.. ఆ దమ్ము ప్రధాని నరేంద్ర మోదీకి ఉందని సోము వీర్రాజు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. ఉత్తరాంధ్ర, సీమ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని సోము వీర్రాజు పేర్కొన్నారు

*రాష్ట్రంలో కోకాకోలా సంస్థ రూ. 1,000 కోట్ల పెట్టుబడులు : మంత్రి కేటీఆర్
కాకోలా సంస్థ గురించి కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేద‌ని, 25 ఏండ్లుగా మంచి సేవ‌లందిస్తోంద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్‌లో రూ. 600 కోట్ల పెట్టుబ‌డులు పెట్టడం సంతోషంగా ఉంద‌ని కేటీఆర్ తెలిపారు. నూత‌న ప‌రిశ్ర‌మ కోసం ఇక్క‌డ 48.53 ఎక‌రాల స్థలాన్ని ప్ర‌భుత్వం కేటాయించింది. మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో హిందుస్థాన్ కోకాకోలా బేవ‌రేజ‌స్ సంస్థ‌తో తెలంగాణ ప్ర‌భుత్వం గురువారం నాలుగు ఒప్పందాల‌ను కుదుర్చుకుంది.ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తిమ్మాపూర్‌లో ఏర్పాటు చేయ‌బోయే కొత్త ప‌రిశ్ర‌మ ద్వారా 10 వేల మందికి ఉపాధి ల‌భిస్తుంద‌న్నారు. కోకాకోలా కంపెనీ భ‌విష్య‌త్‌లో మ‌రో రూ. 400 కోట్ల పెట్టుబడులు పెట్ట‌నుంద‌ని తెలిపారు. కంపెనీ మ‌హిళ‌ల‌కు 50 శాతానికి పైగా ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తుంద‌న్నారు. స్థానికంగా దొరికే వ‌నరులు వాడుకోవాల‌ని కంపెనీకి సూచిస్తున్నాం. ప్ర‌స్తుతం ప్లాస్టిక్ వ్య‌ర్థాలు స‌మ‌స్య‌గా మారాయ‌న్నారు. ప‌ర్యావ‌ర‌ణ‌హిత‌మైన వాటిని వినియోగించాల‌ని సంస్థ‌ను కోరుతున్నామ‌ని చెప్పారు. ప్యాకేజింగ్ రంగంలోనూ హైద‌రాబాద్‌లో విస్తృత అవ‌కాశాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలకు తెలంగాణ కేంద్రం అవుతోందని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

*గోయ‌ల్‌కు ఎంత బ‌లుపు.. బీజేపీని త‌రిమికొట్ట‌డం ఖాయం : మంత్రి కేటీఆర్
తెలంగాణ ప్ర‌జ‌ల‌ను, రైతుల‌ను అవ‌మానించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌పై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. చాయ్ పే చ‌ర్చ అని అధికారంలోకి వ‌చ్చిన బీజేపీని త‌రిమికొట్ట‌డం ఖాయ‌మ‌ని కేటీఆర్ తేల్చిచెప్పారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు నూక‌లు తిన‌డం అల‌వాటు చేయాల‌ని నోరు పారేసుకున్న‌ గోయ‌ల్‌కు ఎంత బ‌లుపు, కండ‌కావ‌రం అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.ధాన్యం సేక‌ర‌ణ విష‌యంలో కేంద్ర నిర్ల‌క్ష్య‌పూరిత వైఖ‌రిని నిర‌సిస్తూ రాజ‌న్న సిరిసిల్ల కేంద్రంలో టీఆర్ఎస్ చేప‌ట్టిన నిర‌స‌న దీక్ష‌లో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. బీజేపీ పార్టీకి చెందిన గ‌ల్లీ నాయ‌కులు ఒక మాట‌, ఢిల్లీ నాయ‌కులు ఒక మాట మాట్లాడి రైతుల్లో అయోమ‌యాన్ని సృష్టించారు. ధాన్యం సేక‌ర‌ణ విష‌యంలో ఎవ‌రిది తెలివి త‌క్కువ‌త‌నం.. మీ కేంద్రానిదా? తెలంగాణ రైతుల‌దా? అని కేటీఆర్ నిల‌దీశారు. బీజేపీ ప్ర‌భుత్వాన్ని త‌రిమికొట్ట‌డం ఖాయమ‌న్నారు. నూక‌లు తిన‌మ‌ని చెప్పిన పార్టీకి తోక‌లు క‌త్తిరించాల‌ని కేటీఆర్ పిలుపునిచ్చారు

*అంధకారంలోకి ఆంధ్రప్రదేశ్‌ : ట్విటర్‌లో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్‌ కోతలతో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యుత్‌ కోతల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ట్విటర్‌ వేదిక ద్వారా వీడియోను రిలీజ్‌ చేశారు. విద్యుత్‌ కోతలతో ప్రసూతి ఆస్పత్రిలో బాలింతలు నరకం అనుభవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాలింతలు, రోగులు పడుతున్న ఇబ్బందులకు సీఎం ఏం సమాదానం చెప్తారని పేర్కొన్నారు.రాష్ట్రం చీకట్లోకు కారణం ఎవరని ప్రశ్నించారు. పెరిగిన విద్యుత్‌ బిల్లులను అష్టకష్టాలు పడి ప్రజలు కడుతున్నా ఇంకా విద్యుత్‌ కోతలెందుకని నిలదీశారు. విద్యుత్‌ లేక గ్రామగ్రామాన ప్రజలు రోడ్డెక్కుతున్నారని ఆయన అన్నారు. వాలంటీర్లకు సన్మానం పేరిట రూ. 233 కోట్లు ఖర్చుచేశారని విమర్శించారు. విద్యుత్‌ కోతలపై ప్రశ్నిస్తే బెదిరించడం మాని సమస్య పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించారు.

*మంత్రి పదవి కావాలని ఏనాడు అడుగలేదు: ఛీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి
తనకు మంత్రి పదవి కావాలని సీఎం జగన్ రెడ్డిని ఏనాడు తాను అడుగలేదని, అలాగే కోరలేదని ప్రభుత్వ ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కేబినెట్‌ విస్తరణపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ABNతో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ తనకు పదవి అవసరం లేదన్నారు. ప్రభుత్వ ఛీఫ్ విప్ పదవిని కూడా తాను అడగకుండా జగన్ ఇచ్చారన్నారు. పదవి లేకున్నా కూడా ప్రజాసేవ చేసినప్పుడే ప్రజాభిమానం పొందుతామన్నారు. మంత్రి పదవుల విషయంలో అందరికి అవకాశం కల్పించాలనేదే జగన్ రెడ్డి ఉద్దేశమన్నారు. జరగబోయే కేబినెట్‌ మంత్రివర్గ విస్తరణలో అన్ని సామాజిక వర్గాలకు జగన్ సమన్యాయం చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. పదవులకన్నా పార్టీ ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. మంత్రి పదవులు రానివారు సంతృప్తి చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

*చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఓ దొంగల ముఠా: సీఎం జగన్‌ పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. జిల్లా ఆవిర్భావం అనంతరం తొలిసారి సీఎం నరసరావుపేటకు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఓ దొంగల ముఠా అని, దొంగల ముఠా హైదరాబాద్‌లో ఉంటూ వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్లంతా మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలని, గతంలో ఏపీని దోచుకుని అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ తనకు క్లాస్‌ ఇచ్చారని ప్రచారం చేస్తున్నారని, తాను మోదీ మాత్రమే ఆ రూమ్‌లో ఉన్నామని, వీళ్లు రూమ్‌లో సోఫా కింద ఉండి విన్నారా? అని ప్రశ్నించారు. మారీచులు, రాక్షసులతో యుద్ధం చేస్తున్నామని, ఎల్లో మీడియా ముసుగులో ఉన్నవారంతా దొంగల ముఠానే అని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు.

*వాలంటీర్ల మహా సైన్యానికి సెల్యూట్: సీఎం వైఎస్ జగన్
రాష్ట్రంలోని వలంటీర్‌ వ్యవస్థ వైపు.. ఇప్పుడు దేశం మొత్తం చూడడం గర్వంగా ఉందని అన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. గురువారం పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన వలంటీర్లకు వందనం కార్యక్రమ సభలో పాల్గొని.. వలంటీర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కొత్తగా ఏర్పాటైన పల్నాడు జిల్లా.. అందునా జిల్లా కేంద్రం నరసరావుపేట నుంచి వలంటీర్‌ వ్యవస్థ అనే సేవా భావానికి సెల్యూట్‌ చేస్తున్నామని చెప్పారు సీఎం వైఎస్‌ జగన్‌. వివక్ష, లంచం, అవినీతిలకు తావులేకుండా, కులమతరాజకీయాలను పట్టించుకోకుండా ఒక వ్యవస్థ కోసం కల గన్నామని, వలంటీర్‌ వ్యవస్థ ద్వారా ఆ కల సాకారమైందని ప్రశంసించారు సీఎం జగన్‌. వలంటీర్‌ వ్యవస్థ దేశంలోనే గొప్ప వ్యవస్థగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. లాభాన్ని పట్టించుకోకుండా.. సేవే పరమావధిగా వలంటీర్లు ముందుకు సాగుతున్నారంటూ గుర్తు చేశారు

*నేను ఏది మాట్లాడినా తెలంగాణ ప్రజల కోసమే: తమిళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసై గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్‌ ప్రభుత్వంతో ప్రొటోకాల్‌ వివాదంతో పాటు.. పలు అంశాలను అమిత్‌షాకు వివరించినట్లు చెప్పారు. తానేప్పుడూ నిర్మాణాత్మకంగా ఆలోచిస్తానన్నారు. తాను ఏది మాట్లాడినా తెలంగాణ ప్రజల కోసమేనని తెలిపారు. తెలంగాణలో గవర్నర్‌ ప్రయాణించాలంటే రోడ్డుమార్గమే దిక్కని, గవర్నర్‌ను ఎందుకు అవమానిస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలన్నారు. తాను ఏమైనా బీజేపీ జెండా పట్టుకున్నానా? బీజేపీ కార్యకర్తలను వెంటేసుకొని వెళ్లానా? అని ప్రశ్నించారు.సీఎస్‌ వచ్చి సమస్య ఏంటో తనతో మాట్లాడాలని తమిళిసై అన్నారు. తనను బీజేపీ కార్యకర్త అని ఎలా అంటారని తమిళి సై ప్రశ్నించారు. తాను అన్నిపార్టీల నేతలను కలిశానని, ఏదైనా ఉంటే.. అడిగితే.. సమాధానం చెబుతానన్నారు. గణతంత్ర, ఉగాది వేడుకలకు వారు ఎందుకు రాలేదని నిలదీశారు. ఇదేనా వారు ఇచ్చే మర్యాద?.. సీఎం కేసీఆర్ సహా అందరినీ ఆహ్వానించానని.. ఆధారాలు కూడా చూపిస్తానన్నారు. ఇది తమిళిసై సమస్య కాదని.. గవర్నర్ ఆఫీస్‌కు జరుగుతున్న అవమానమని అన్నారు. ఈ నెల 11వ తేదీన భద్రాచలంకు రోడ్డు మార్గంలోనే వెళ్తానని తమిళి సై పేర్కొన్నారు

*సబ్ కా సాత్… సబ్ కా వికాస్ మా నినాదం: పురందేశ్వరి
శ్రీకాకుళం జిల్లాలో జలం కోసం గురువారం బీజేపీ ఉత్తరాంధ్ర జనపోరు యాత్ర ప్రారంభించింది. ఈ సందర్బంగా హిరమండలంలో ఏర్పాటు చేసిన బీజేపీ జనపోరు యాత్ర సభలో పురందేశ్వరి మాట్లాడుతూ బీజేపీ ప్రజలకు సేవ చేయటం కోసమే అధికారంలోకి రావాలని భావిస్తుందన్నారు. మిగతా పార్టీలకు బీజేపీకి చాలా వ్యత్యాసం ఉందన్నారు. ‘సబ్ కా సాత్… సబ్ కా వికాస్’ తమ నినాదమని, ప్రజలు మోదీ నాయకత్వాన్ని విశ్వసించారన్నారు.ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీకి అధికారాన్ని ఇచ్చారని పురందేశ్వరి అన్నారు. వైసీపీ ప్రభుత్వం వంశధార నిర్వాసితులను పట్టించుకోవటం లేదని విమర్శించారు. నిర్వాసితులకు న్యాయం చేస్తామని జగన్ పాదయాత్రలో చెప్పారని, అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాయని, ఏం న్యాయం చేశారని ఆమె ప్రశ్నించారు. వంశధార ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చిన రైతులు వలస వెళ్తున్నారని, మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించకపోయినా ప్రజల పక్షాన పోరాడుతామని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా కేంద్ర ప్రభత్వ చలవేనన్నారు. కేంద్రం సహకరించకపోతే ఈ సంక్షేమ పథకాలు ఎలా కొనసాగుతాయని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పేదల ఇళ్లు నిర్మించి వైసీపీ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటోందని పురందేశ్వరి విమర్శించారు

*వారి వల్లే తెలంగాణ రైతులకు ఈ దుస్థితి : మంత్రి వేముల
రాష్ట్రంలోని బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే తెలంగాణ రైతులు రోడ్లపై వచ్చి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరం ఎన్టీఆర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్‌ చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొని. ఆయన మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి చూసి బీజేపీ ప్రభుత్వ రైతులను ఇబ్బంది పెడుతుందని విమర్శించారు.కేంద్రం తమ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ మంత్రుల బృందంపై కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిస్తే అవమానకరంగా మాట్లాడారు. బండి సంజయ్ అన్న మాటలు, బీజేపీ ఎంపీలు వరి వేయమని చెప్పిన మాటలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. నూకల బియ్యాన్ని మీ ప్రజలకు అలవాటు చేయమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దారుణంగా అవమానించారన్నారు.కాంగ్రెస్ పార్టీ కేంద్రం పై ఎందుకు విమర్శలు చేయడం లేదో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం మెడలు వంచుతాం. తెలంగాణ రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయిస్తామన్నారు. రైతుల పక్షాన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు

*ప్రజలకు నాణ్యమైన చౌక ధరలకే ఆరోగ్య సంరక్షణ: ప్రధాని
నేడు ప్రపంచ ఆరోగ్య దినం (ఏప్రిల్ 7) ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్విట్టర్లో స్పందించారు. ”ప్రపంచ ఆరోగ్యదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యంతో, శ్రేయస్సుతో ఆశీర్వదించబడాలి. ఆరోగ్య రంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపే రోజు కూడా. భారత ప్రభుత్వం ఆరోగ్య సదుపాయాల విస్తరణకు ఎంతో కష్టించి పనిచేస్తోంది. ప్రజలకు నాణ్యమైన, చౌక ధరలకే ఆరోగ్య సంరక్షణ అందించడంపై దృష్టి పెట్టాం. ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ కేర్ పథకం ‘ఆయుష్మాన్ భారత్’కు మన దేశం కేంద్రంగా ఉంది. ప్రతి భారతీయుడు గర్వపడే విషయం ఇది. పీఎం జన ఔషధి తదితర పథకాల లబ్ధిదారులతో మాట్లాడిన సందర్భంలో నాకు ఎంతో సంతోషం కలిగింది. అందుబాటు ధరలకే ఆరోగ్య సేవలు అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు నేడు ఎంతో ఆదా అవుతోంది”అని ప్రధాని పేర్కొన్నారు.అదే సమయంలో ఆయుష్ నెట్ వర్క్ విస్తరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో మరింత శ్రేయస్సుకు దారితీస్తుందన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో వైద్యవిద్యలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు చోటు చేసుకున్నాయని చెబుతూ.. ఎన్నో వైద్య కళాశాలలు కొత్తగా అందుబాటులోకి వచ్చిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. దమోడీలో ఆరోగ్య సదుపాయాలను బలోపేతం చేయడానికి తాము విరామం లేకుండా ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. నాణ్యమైన, అందుబాటు ధరలకే ఆరోగ్య సంరక్షణ, వైద్య సదుపాయాలను ప్రజలకు అందించడమే తమ ధ్యేయమని ప్రకటించారు.

*ధాన్యం కొనిపించాల్సిన బాధ్యత బండి సంజయ్‌దే: కొప్పుల
ధాన్యం కొనిపించాల్సిన బాధ్యత బండి సంజయ్‌దేనని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంపై ఎందుకు కక్ష కట్టారు? అని ఆయన ప్రశ్నించారు. రైతులను గోస పెడుతున్న బీజేపీ ప్రభుత్వం బాగుపడదన్నారు.

*నా తల్లి చనిపోయినా కేసీఆర్ పరామర్శించలేదు: తమిళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసై భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లి రాజ్ భవన్‌లో చనిపోయినప్పుడు సీఎం కేసీఆర్‌ చూడడానికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యవహారాలపై ప్రదాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. తెలంగాణలో డ్రగ్స్ కేసు, అవినీతిపై మోదీ, అమిత్‌షాలకు నివేదిక ఇచ్చానని తెలిపారు. డ్రగ్స్‌తో యువత నాశనం అవుతున్నారని, ఓ తల్లిగా బాధపడుతూ మోదీకి నివేదిక ఇచ్చానని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ని ఒక అన్నగా భావించానని తెలిపారు. గవర్నర్లతో విభేదించిన ముఖ్యమంత్రులుగా పనిచేసిన కరుణానిధి, జయలలిత, మమత ఆయా రాష్ట్రాలు నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమాలకు పిలిచే వారని గుర్తుచేశారు. తెలంగాణలో ఆస్పత్రుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. యూనివర్సిటీలో 60 శాతం ఖాళీలు ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నారని తమిళిసై తప్పుబట్టారు. ‘‘ప్రొటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకునే అధికారం… గవర్నర్‌గా నాకుంది. నేను ఆపని చేయను. తెలంగాణ ప్రభుత్వంపై నాకు ఎలాంటి కోపం లేదు’’ అని తమిళిసై ప్రకటించారు.

*అందుకే గుంత‌లో త‌ట్టెడు మ‌ట్టి క‌ప్పడానికి ముందుకు రావడం లేదు: లోకేష్జ‌
గ‌న్‌రెడ్డి చేత‌కాని తనం, అవినీతి, బంధుప్రీతి వ‌ల్ల ఆ పార్టీ నేత‌లు బ‌ల‌వుతున్నారని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. ఆర్అండ్‌బీ రోడ్ల మ‌ర‌మ్మతుల బిల్లులు కాంట్రాక్టర్లకి చెల్లించ‌క‌పోవ‌డంతో ఎవ‌రూ క‌నీసం గుంత‌లో త‌ట్టెడు మ‌ట్టి క‌ప్పడానికి ముందుకు రావ‌డంలేదన్నారు. అలా ప‌డిన గుంతే వైసీపీకి చెందిన కృష్ణా జిల్లా ఉంగుటూరు ఎంపీపీ ప్రస‌న్నల‌క్ష్మి ప్రాణం తీసిందన్నారు. జ‌గ‌న్‌రెడ్డి అవినీతి దాహం-బంధుప్రీతి మృత్యువులా వ‌చ్చాయన్నారు. అంబులెన్సుల్లో వంద‌ల‌కోట్లు దోచేందుకు విజ‌య‌సాయిరెడ్డి అల్లుడికి క‌ట్నంగా ఇచ్చేశాడన్నారు. ప్రమాదం జ‌రిగింద‌ని అంబులెన్స్‌కి ఫోన్ చేస్తే సాయిరెడ్డి అల్లుడి అంబులెన్స్ రాలేదన్నారు. దీంతో ప్రస్తన్నలక్ష్మీ చనిపోయిందనా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

*రాష్ట్రంలో నేటి ఈ చీకట్లకు కారణం ఎవరు?: చంద్రబాబు
మన రాష్ట్రంలో నేటి ఈ చీకట్లకు కారణం ఎవరు? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీలో విద్యుత్‌ కోతలు, ప్రజల వెతలపై చంద్రబాబు ట్వీట్‌ చేశారు. ఏపీ చీకట్లోకి వెళ్లిపోయిందంటూ వాపోయారు. విద్యుత్ కోతలతో ప్రసూతి ఆసుపత్రిలో బాలింతల పరిస్థితి వివరిస్తూ చంద్రబాబు వీడియోను జత చేశారు. తీవ్ర విద్యుత్ కోతలతో జనం నరకం చూస్తున్నారని, గ్రామాల్లో అనధికార పవర్ కట్‌లతో అల్లాడుతున్నారని తెలిపారు. కరెంట్‌ లేక ప్రజలు రోడ్డెక్కుతుంటే.. వాలంటీర్లకు సన్మానం అంటూ రూ.233 కోట్లు తగలేస్తున్నారని తప్పుబట్టారు. ఈ సీఎంను నీరో కాక ఇంకేమనాలి? అని చంద్రబాబు ప్రశ్నించారు.

**ఏం ఘనకార్యాలు చేశారని సత్కారాలు: వర్ల రామయ్య
రాష్ట్రంలో ఏం ఘనకార్యాలు చేశారని వలంటీర్లకు సేవా సత్కారాలు చేస్తున్నారని ప్రభుత్వాన్ని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. అధికార పార్టీకి సేవలందించినందుకు ప్రజల సొమ్ము దోచిపెడతారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తల సన్మానానికి ఫుల్ పేజి అడ్వర్టయిజ్ మెంటు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. అడ్డగోలు దోపిడీకి సహకరించినందుకు, దొంగమద్యం అమ్మినందుకు సన్మానిస్తున్నారా అని ఆయన నిలదీశారు.

*చంద్రబాబు, పవన్ విశాల దృక్పధంతో ఆలోచించాలి: రామకృష్ణ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రజలు భరించలేని విధంగా భారాలు మోపుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 16 రోజుల వ్యవధిలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ పోతున్నారని మండిపడ్డారు. మోదీ ప్రధానిగా వచ్చే ముందు గ్యాస్ 460 రూపాయలు, పెట్రోల్ టీటరు 64 రుపాయలు ఉండేవన్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి సిమెంట్, పెట్రోల్, పన్నులు, విద్యుత్ చార్జీలు అన్ని పెంచుతున్నారని ఆరోపించారు. ట్రూ అప్ చార్జీలు పేరుతో మళ్ళీ భారం మోపేందుకు సిద్ధమవుతున్నారని, ఎన్నికల ముందు బాదుడే బాదుడు అన్నారు, ఇసుక, సిమెంట్, మద్యం అన్నిటిపై జె టాక్స్ వేస్తున్నారని, ఆదానికి లబ్ది చేకూర్చేలా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారన్నారు. బాదుడుకి వ్యతిరేకంగా ఈనెల 11, 12 తేదీల్లో అన్ని సచివాలయాల వద్ద నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విశాల దృక్పధంతో ఆలోచించాలని కోరారు. కేంద్రం ధరలు పెంచుతుంటే రాష్ట్రం మాత్రమే పెంచుతున్నట్లు మాట్లాడటం సరికాదన్నారు.

*బీజేపీ నేతలు దద్దమ్మలు: మంత్రి తలసాని
బీజేపీ నేతలు దద్దమ్మలని, గవర్నర్‌ను వివాదంలోకి లాగుతున్నారని మంత్రి తలసాని మండిపడ్డారు. ఎవరైనా రాజ్యాంగం పరిధిలో పని చేయాలని చెప్పారు. వడ్లను కొనే బాధ్యత కేంద్రానికి కాదా?, తెలంగాణ దేశంలో లేదా? అని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమని హెచ్చరించారు.

*పిల్లిని చూసి ఎలుక దాక్కొన్నట్టు.. మోదీని చూసి కేసీఆర్ దాక్కొన్నాడు: షర్మిల
రైతుల కోసం కొట్లాడుతున్నానన్న సీఎం కేసీఆర్ కేంద్రం వద్ద ఎందుకు సంతకం పెట్టాడని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల ప్రశ్నించారు. రైతు సంక్షేమమే ముఖ్యమైతే ఆరోజు సంతకం పెట్టకుండా ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదని నిలదీశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ రైతు వేదిక వద్ద ధర్నాలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ‘‘పిల్లిని చూసి ఎలుక దాక్కున్నట్లు ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రం వస్తే కేసీఆర్ ఎదురుపడకుండా దాక్కున్నాడు. ఆనాడు సంతకం పెట్టి రైతులను బావిలో తోసి నిండా ముంచిన కేసీఆర్.. ఈ రోజు ఢిల్లీలో రక్షించండంటూ డ్రామాలు ఆడుతున్నాడు. ఖమ్మం జిల్లా మంత్రి ఎవరి మీద.. ఎందుకోసం ధర్నా చేస్తున్నారు? పరిపాలన చేతకాక, వడ్లు కొనడం చేతకాక TRS పార్టీ ధర్నాలు చేస్తోంది. ప్రజలు ఎన్నుకుంది ప్రజల సమస్యలు పరిష్కరించాలని కానీ ధర్నాలు చేయడానికి కాదు. రైతు పండించిన పంట ఎందుకు కొనడం లేదని.. ధర్నాలు చేస్తే కేసీఆర్ మీద చేయాలి. తెలంగాణలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి పక్షాలు లేవు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పడింది’’ అని పేర్కొన్నారు.

*విద్యుత్‌ చార్జీలు తగ్గించేదాకా ఉద్యమం: శైలజానాథ్‌
విద్యుత్‌ చార్జీలు తగ్గించేదాకా పోరాటం సాగిస్తామని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురంలో కాంగ్రెస్‌ పార్టీ బుధవారం నిరసన తెలిపింది. ఈ సందర్భంగా శైలజానాథ్‌ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఏపీ ప్రజలను లూఠీ చేస్తోందని విమర్శించారు. విద్యుత్‌ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని కోరారు. రైతుల కోసం, ప్రజల కోసం ఉద్యమం చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం తగదన్నారు. అతిపెద్ద విద్యుత్‌ ఉద్యమం నడిపిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీకి ఉందని గుర్తు చేశారు. అరెస్టులు తమ పార్టీకి కొత్త కాదని, చార్జీలను తగ్గించేదాకా పోరాటం చేస్తామని శైలజానాథ్‌ హెచ్చరించారు.

*భారత్‌ ఎప్పుడూ శాంతివైపే: జైశంకర్‌
రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి భారత్‌ వ్యతిరేకమని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్పష్టం చేశా రు. ఉక్రెయిన్‌ సంక్షోభంపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభంలో ఎవరి పక్షాన నిలబడాలన్న ప్రశ్న వస్తే.. భారత్‌ ఎప్పుడూ శాంతివైపే ఉం టుందని చెప్పారు. హింసకు తక్షణమే ముగిం పు పలకాలనే కోరుకుంటామన్నారు. ఉక్రెయిన్‌ నుంచి పౌరులను వెనక్కి రప్పించిన తొలి దేశం మనదేనని, ఈ విషయంలో ఇతరులకు స్ఫూర్తిగా నిలిచామని జైశంకర్‌ చెప్పారు. బుచాలో మారణహోమం అత్యంత బాధాకరమని వ్యాఖ్యానించారు. హత్యలపై స్వతంత్ర విచారణ జరపాలన్న డిమాండ్‌కు భారత్‌ మద్దతిస్తుందన్నారు. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య చర్చ లు జరగాలనే కోరుకుంటున్నామని, ఈ విషయంలో సాయం చేయమంటే సంతోషంగా చేస్తామని వెల్లడించారు.
*రైతులకు చేరువగా జిల్లాల పాలన: కన్నబాబు
జిల్లాల పునర్విభజన ద్వారా రైతాంగానికి ప్రభుత్వ పాలన మరింత చేరువవుతుందని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అన్నారు. జిల్లాల పునర్విభజన సందర్భంగా బుధవారం 26 జిల్లాల వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాల పునర్విభజన ద్వారా రైతులకు మరింత నాణ్యమైన సేవలందించాలని అధికారులకు నిర్దేశించారు. ఆర్బీకేల ద్వారా రైతుల అవసరాలను తీరుస్తున్నామని చెప్పారు. మూడేళ్లలో అనేక సంస్కరణలతో వ్యవసాయ రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చినట్టు తెలిపారు. సమీక్షలో వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఉద్యాన వర్సిటీ వీసీ జానకీరామ్‌ పాల్గొన్నారు.
*వినతిపత్రాలు బయటపెట్టే ధైర్యం లేదా?: రామ్మోహన్‌
ప్రధానితోపాటు కేంద్ర మంత్రులకు సీఎం జగన్‌ ఇచ్చిన వినతిపత్రాలను బయటపెట్టే ధైర్యం లేదా? అని వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు. ప్రధాని వద్ద ప్రత్యేక హోదా, వి శాఖ ఉక్కు ప్రస్తావన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో కుటుంబ సభ్యులను కాపాడుకోవడం కోసం ప్రధానిని, హోంమంత్రిని కలిశారని ఆరోపించారు.

*కేసీఆర్‌కు ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా ఆగదు: హరగోపాల్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా హద్దులుండవని, గవర్నరు తమిళిసై పట్ల ఆయన వ్యవహరిస్తున్న తీరే అందుకు నిదర్శనమని సామాజికవేత్త ప్రొఫెసర్‌ హరగోపాల్‌ వ్యాఖ్యానించారు. ఆయన గౌరవించినా అతిగానే ఉంటుందని, కోపం వచ్చినా అతిగానే ఉంటుందని చెప్పారు. నిజానికి ఇది గవర్నరుకు, ముఖ్యమంత్రికి మధ్య తలెత్తిన ఘర్షణ కాదని, దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మొదలైన వివాదంగా చూడాలన్నారు. ఆయన మాట్లాడారు. తాను ఒక సందర్భంలో తమిళిసైని కలిసినప్పుడు, చాలా హుందాగా రిసీవ్‌ చేసుకున్నారన్నారు.

*జెన్‌కో థర్మల్‌ను ప్రైవేటీకరిస్తే ఊరుకోం: సోమిరెడ్డి
అత్యంత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించిన దామోద రం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని ప్రైవేటుపరం చేయాలని చూస్తే ఊరుకోబోమని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హెచ్చరించారు. నేలటూరులోని జెన్‌కో థర్మల్‌ కేంద్రం వద్ద ఉద్యోగులు, కార్మికుల ఉద్యమానికి మద్దతుగా బుధవారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. సోమిరెడ్డి మాట్లాడుతూ తండ్రి వైఎస్‌ ఈ కేంద్రం నిర్మిస్తే.. కొడుకు జగన్‌ అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడని దుయ్యబట్టారు.

*రౌత్‌పై ఈడీ చర్యను మోదీ దృష్టికి తెచ్చా: పవార్
వసేన ఎంపీ సంజయ్ రౌత్‌‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీసుకున్న చర్య ‘అన్యాయం’ అని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. సంజయ్ రౌత్, ఆయన కుటుంబానికి చెందిన ఆస్తుల జప్తు అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువచ్చినట్టు ఆయన చెప్పారు. ప్రధానితో పవార్ బుధవారంనాడు సుమారు 25 నిమిషాల పాటు సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇలాంటి చర్యకు ఒక కేంద్ర సంస్థ తీసుకుంటే, దానికి వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే రౌత్‌పై ఈడీ చర్య తీసుకుందని పవార్ ఆరోపించారు. రౌత్‌పై ఈడీ చర్యను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదని పవార్ తెలిపారు.