DailyDose

జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభం- TNI తాజా వార్తలు

జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభం- TNI తాజా వార్తలు

* అనంతపురం జిల్లా కొత్త చెరువులో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా ఇటీవల సాగు నష్టం, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు సాకే రామకృష్ణ కుటుంబ సభ్యులను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. పార్టీ తరపున లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ఆయన భార్య సాకే సుజాతకు అందజేశారు. పార్టీ తరపున అన్ని రకాలుగా కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు నాగబాబు, చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు టి.సి. వరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

*తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ధాన్యం కొనుగోలుపై సాధ్యాసాధ్యాలపై కేబినెట్ భేటీలో చర్చించిన మంత్రులు.. చివరకు ప్రభుత్వమే కొనాలని నిర్ణయానికి వచ్చారు. కొంతకాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వరి వార్ కొనసాగుతోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మాటల యుద్ధం సాగింది. కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టి తెలంగాణ వడ్లు మొత్తం కేంద్రప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. ఇటు బీజేపీ నేతలు హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఆందోళనకు దిగారు. వడ్ల విషయంలో టీఆర్ఎస్ సర్కార్ డ్రామాలడుతోందని విమర్శలు చేశారు. రా రాయిస్ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

*ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్తను అందించనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌ తన ఉద్యోగులకు భారీగా వేతనాలను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

*బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, ఐ అండ్‌ పీఆర్‌ శాఖ మంత్రిగా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజల అనంతరం చెల్లుబోయిన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చీఫ్‌ విప్‌ ముదనూరి ప్రసాదరాజు, ఐ అండ్‌ పీఆర్‌ శాఖాధికారులు మంత్రికి అభినందనలు తెలిపారు.

*భారత్‌ బ్యాంకింగ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) పటిష్ట లాభాల బాటన పయనించనుందని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ నివేదిక ఒకటి తెలిపింది. మొండి బకాయిలు (ఎన్‌పీఏ) తగ్గడం, ప్రీ–పొవిజినింగ్‌ ఆదాయాల్లో (నష్టాన్ని భర్తీ చేసే విధంగా నికర వడ్డీ, వడ్డీయేతర ఆదాయాలు, తక్కువ వ్యయాలు నెలకొన్న పరిస్థితి) వృద్ధి దీనికి కారణంగా పేర్కొంది.

* ఈనెల 13 నుండి 24 వరకు ప్రాణహిత పుష్కరాలు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం లో జరుగుతున్న విషయం విదితమే.ఎక్కువగా పుష్కరాలకు వయసు మళ్ళిన వాళ్ళు వెళుతుంటారు. ప్రయాణం సాఫీగా సాగాలంటే సూపర్ లగ్జరీ బస్సులు పుష్ బ్యాక్ తో కొంచెం అనువుగా ఉంటాయి. కానీ సూర్యాపేట నుండి కాళేశ్వరం వెళ్లాలంటే సూర్యాపేట డిపో లో సూపర్ లగ్జరీ బస్సులు లేవు. కావాలంటే మిర్యాలగూడెం కోదాడ నల్గొండ నుండి తెచ్చుకోవాల్సిందే అంటున్నారు.ఆర్టీసీ అధికారులు.దీంతో భక్తులకు అదనపు భారం తప్పడం లేదు. సూర్యాపేట నుండి సూపర్ లగ్జరీ బస్సులు లేక పోవడం తో భక్తులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించడం తప్పడం లేదు. భక్తుల సౌకర్యార్థం మంత్రి జగదీష్ రెడ్డి చొరవ తీసుకొని పుష్కరాలకు వెళ్లే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

*ఆదిద్రావిడ, గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఐదు జిల్లాల్లో రూ.18.41 కోట్లతో కొత్తగా నిర్మించిన హాస్టల్‌ భవనాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోమవారం ఉదయం ప్రారంభించారు. చెంగల్పట్టు, నాగపట్టినం, నామక్కల్‌, రామనాధపురం, కల్లకురిచ్చి జిల్లాల్లో నిర్మించిన హాస్టల్‌ భవనాలు, ఐదు పాఠశాల భవనాలకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. చెంగల్పట్టులో కిలాంబాక్కంలో రూ.2.80 కోట్లతో, నాగల్‌కేనిలో రూ.2.44 కోట్లతో, నామక్కల్‌ జిల్లా కలాంకానిలో రూ.2.26 కోట్లతో, రామనాధపురం జిల్లా కాట్టుపరమకుడిలో రూ.1.01 కోట్లతో నిర్మించిన నాలుగు ఆదిద్రావిడ పాఠశాల తరగతి భవనాలను, నామక్కల్‌ జిల్లా సెంగరై, కల్లకురిచ్చి జిల్లా గోముఖిఅనైలో హాస్టల్‌ భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కయల్‌విళి సెల్వరాజ్‌, ఆదిద్రావిడుల గృహనిర్మాణ సంస్థ అధ్యక్షుడు మదివానన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు తదితరులు పాల్గొన్నారు.

*ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం మంగళవారం నుంచి నెల రోజుల వేసవి కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. ఏప్రిల్ 15వతేదీ నుంచి రోడ్లపై దుమ్ము కాలుష్యాన్ని అరికట్టడానికి డ్రైవ్ చేపట్టనుంది.దేశ రాజధానిని కాలుష్య రహితంగా మార్చేందుకు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ సమ్మర్ యాక్షన్ ప్లాన్ ను రూపొందించారు. యాంటీ ఓపెన్ బర్నింగ్ పేరిట తక్షణ ప్రణాళికను మంగళవారం నుంచి చేపట్టారు.మరోవైపు యాంటీ రోడ్ డస్ట్ క్యాంపెయిన్ ను ఏప్రిల్ 15వతేదీ నుంచి ప్రారంభిస్తామని రాయ్ చెప్పారు.‘‘ఢిల్లీని కాలుష్య రహితంగా మార్చడానికి వేసవి యాక్షన్ ప్లాన్ ను చేపట్టాం, మెగా ట్రీ ప్లాంటేషన్,సరస్సుల అభివృద్ధి, ఉద్యానవనాల అభివృద్ధి చేస్తున్నాం’’ అని మంత్రి రాయ్ ట్వీట్‌ చేశారు.

*ఏపీ కేబినెట్ కూర్పుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మంత్రి వర్గం ఛాయ్, బిస్కెట్ కేబినెట్ అంటూ ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గత మంత్రి వర్గం పప్పెట్ కేబినెట్ అయితే.. ఇప్పుడు ఛాయ్బిస్కెట్ కేబినెట్ అన్నారు. జగన్ కేబినెట్‌లో మంత్రులకు స్వేచ్ఛ లేదని విమర్శించారు. సీఎం కిచెన్ కేబినెట్‌లోనూసలహదారుల బృందంలోనూ బీసీలు ఎందుకు లేరని ప్రశ్నించారు. నిర్ణయాలు తీసుకునే కోర్ కమిటీ.. కిచెన్ కేబినెట్‌లో బీసీలకు ప్రాధాన్యత లేదని ఆరోపించారు. ప్రాధాన్యతపెత్తనంలేని పదవులిచ్చి.. ప్రాతినిధ్యం కల్పించామని ఎలా చెబుతారన్నారు.

*వైసీపీ నేతల వ్యాఖ్యలకు పవన్‌ కౌంటర్‌ ఇచ్చారు. మమ్మల్ని టీడీపీ బీ టీమ్‌ అంటే.. మిమ్మల్ని చర్లపల్లి జైలు షటిల్‌ టీమ్‌ అనాల్సి వస్తుందని పవన్‌ మండిపడ్డారు. మీరు ఆర్థికనేరాలు చేసి జైల్లో కూర్చున్నవాళ్లనినీతులు చెప్పే హక్కుస్థాయి వైసీపీ నేతలకు లేదని పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

*సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోగంజాయి ముఠాను అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ తెలిపారు. ఒరిస్సా రాష్ట్రం, బలిమేల నుండి హైద్రాబాద్కు తరలిస్తున్న 81 కేజీల గంజాయిని స్వాదీనం చేసుకున్నామని వెల్లడించారు. నల్లగండ్ల వద్ద వాహన తనిఖీల్లో గంజాయిని గుర్తించామని చెప్పారు. ఒక్కో ప్యాకెట్‌లో 2.2 కేజీలు పెట్టి…37 ప్యాకేట్స్‌లో తరలిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పాస్తం రాజు, ఎడ్ల వెంకట్ రెడ్డి, గంజి ప్రవీణ్ రెడ్డి అనే ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ చేశామన్నారు. ఈజీ మనీ టార్గెట్‌గా గంజాయి సప్లై దందా ఈ ముఠా ఎంచుకుందన్నారు. 81 కేజీల గంజాయితో పాటు , 2 ఫోర్ వీలర్లు, 3 మొబైల్ ఫోన్స్ స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి రవాణా‌పై నిరంతర నిఘా ఉందన్నారు.

* పీడీపీ అధ్యక్షురాలు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని శ్రీనగర్‌ సిటీలో మంగళవారంనాడు అధికారులు గృహనిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఒక ట్వీట్‌లో ముఫ్తీ తెలిపారు. షోపియాన్ జిల్లాలో ఈనెల 6న దాడికి గురైన కశ్మీర్ పండిట్ కుటుంబాన్ని పరామర్శించేందుకు తాను వెళ్లాలనుకున్నానని, దీంతో తనను గృహనిర్బంధంలోకి తీసుకున్నారని అన్నారు. కశ్మీర్ ప్రజలు లోయను విడిచిపెట్టడానికి అక్కడి ప్రజల పైన, ముస్లింలపైన భారత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం సాగిస్తోందని ఆమె ఆరోపించారు. ఈ తప్పుడు ప్రచారం బయటపడకుండా కట్టడి చేస్తోందని తప్పుపట్టారు. కాగా, సెక్యూరిటీ కారణాల వల్లే అనంతనాగ్ జిల్లాకు వెళ్లకుండా మెహబూబా ముఫ్తీని అదుపులోనికి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

* ఆంధ్రప్రదేశ్‌ నూతన చీఫ్‌విప్‌గా ముదునూరి ప్రసాదరాజును ఎంపిక చేయడం వ్యక్తిగతంగా, పార్టీపరంగా ఎంతో సంతోషాన్నిచ్చిందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్యచౌదరి అన్నారు. సోమవారం తాడేపల్లిలో ఏపీ చీఫ్‌విప్‌ చాంబర్‌లో ప్రసాదరాజును కలిశారు. శాలువా, బొకేతో సత్కరించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట వైఎస్సార్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి జానంపేట బాబు, దెందులూరు మండల పార్టీ కన్వీనర్‌ కామిరెడ్డి నాని, పోతునూరు మాజీ సొసైటీ చైర్మన్‌ గూడపాటి పవన్‌కుమార్‌ ఉన్నారు.

* కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు రద్దు చేయాలని సీపీఐ ఆధ్వర్యంలో విన్నూత్న రీతిలో ఇంటింటి ప్రచారం జరిగింది. గ్యాస్ సిలెండర్కట్టెలు స్వయంగా మోసి సీపీఐ నేత రామకృష్ణ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం హద్దూ అదుపూ లేకుండా పెట్రోలుడీజిల్వంటగ్యాస్ ధరలు పెంచుతోందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. జగన్ ప్రభుత్వం పెంచిన ఆస్థి పన్నుచత్త పన్నువిద్యుత్తు ఛార్జీలు రద్దు చేయాలన్నారు. లేనిపక్షంలో తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని రామకృష్ణ హెచ్చరించారు.

* కడప జిల్లాలోని ప్రొద్దుటూరు దొరసానిపల్లెలో బండలాగుడు పోటీలలో అపశృతి చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బండలాగుడు పోటీలను ప్రారంభించారు. అయితే పోటీని ప్రారంభించే సమయంలోఎద్దులు ఒక్కసారిగా వేగంగా కదలడంతో ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి కిందపడ్డారు. దీంతో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా 10 రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపారు.

*చిత్తూరు గంగమ్మ జాతరను వైభవంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు వంశ పారంపర్యం ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులు తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… కరోనా కారణంగా రెండేళ్లు జాతర నిర్వహించలేక పోయామని అన్నారు. ఈ సారి ఘనంగా జాతరను నిర్వహిస్తామని… అందుకు అందరూ సహకరించాలిని విజ్ఞప్తి చేశారు. అలాగే రాజకీయాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు గంగమ్మ జాతర తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తామని తెలిపారు. కార్యకర్తలు, అభిమానుల నిర్ణయం మేరకు రాజకీయ భవిష్యత్తు నిర్ణయిస్తామన్నారు. రెండేళ్ల తర్వాత మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఉత్సాహంగా కనిపించారు.

*ఏపీలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లికి వైసీపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. పిన్నెల్లితో మాట్లాడాలని మంత్రి పెద్దిరెడ్డికి సీఎం జగన్ సూచించినట్టు తెలుస్తోంది. సచివాలయంలోని పెద్దిరెడ్డి ఛాంబర్‌కు పిన్నెల్లి చేరుకున్నారు. మంత్రి మీటింగ్‌లో ఉండడంతో పిన్నెల్లి ఛాంబర్‌లో ఎదురుచూస్తున్నారు.

* ఐపీఎల్‌ కామెంట్రీ సందర్భంగా ప్రఖ్యాత కోహినూర్‌ వజ్రం ప్రస్తావనకు వచ్చింది. రాజస్థాన్‌-లఖ్‌నవూ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌ బ్రేక్‌లో బ్రాడ్‌కాస్టర్‌ ముంబై బీచ్‌.. మెరెన్‌ డ్రైవ్‌ను చూపించాడు. 3 కి.మీ. పొడవైన ఈ బీచ్‌.. రాత్రిళ్లు లైట్ల ధగధగల నడుమ నెక్లె్‌సలోని ముత్యాల్లా మెరిసిపోతుంటుంది. దాంతో ఈ బీచ్‌ను ముద్దుగా ‘క్వీన్స్‌ నెక్లెస్‌’ అని పిలుస్తారు. ఇక..ప్రఖ్యాత కోహినూర్‌ వజ్రం ఇప్పటికీ బ్రిటన్‌ ప్రభుత్వం వద్దనే ఉన్న నేపథ్యంలో..మెరెన్‌ డ్రైవ్‌ను చూపిస్తున్నప్పుడు ‘కోహినూర్‌ వజ్రంకోసం భారత్‌ ఇంకా ఎదురు చూస్తోంది’ అని సహచర కామెంటేటర్‌, అలెన్‌ విల్కిన్స్‌ (బ్రిటన్‌)నుద్దేశించి గవాస్కర్‌ సరదాగా అన్నాడు. అంతేకాదు ‘బ్రిటన్‌ ప్రభుత్వం వద్ద నీ ఇన్‌ఫ్లుయెన్స్‌ ఉపయోగించి ఆ వజ్రం భారత్‌ వచ్చేలా చూస్తావా’ అని మరింత హాస్యంగా అనడంతో..అలన్‌ ముసిముసినవ్వులు చిందించాడు.

*ఆంధ్ర టీ20 లీగ్‌ రెండో సీజన్‌ను జూన్‌లో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) అధ్యక్షుడు పి.శరత్‌చంద్రారెడ్డి వెల్లడించారు. తిరుపతిలో జరిగిన ఏసీఏ ప్రత్యేక వార్షిక సమావేశంలో టీ20 నిర్వాహక కమిటీ అధ్యక్షుడిగా కూడా శరత్‌చంద్రనే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా ఈ మ్యాచ్‌లన్నింటినీ ప్రత్యక్షప్రసారం చేయనున్నారు.

* ప్రభుత్వంలో విలీన మైన ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు ట్రెజరీ నుంచే జీతాలు చెల్లించనున్నారు. ఈ మేరకు ఇక నుంచి ప్రభుత్వ ట్రెజరీ నుంచే జీతాలు చెల్లించేలా ప్రాథమిక విద్య కమిషనర్‌ సురేశ్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

*ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీసెట్‌-2022 షెడ్యూల్‌ ఖరారైంది. నోటిఫికేషన్‌ వివరాలను సోమవారం అనంతపురంలోని జేఎన్‌టీయూ పరిపాలన భవనంలో ఈఏపీసెట్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ రంగజనార్దన వెల్లడించారు. జేఎన్‌టీయూ అనంతపురం ఆధ్వర్యంలో ఏపీఈఏపీసెట్‌ నిర్వహిస్తున్నారు. ఈ నెల 11నుంచి మే 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆలస్యంగా దరఖాస్తు చేసుకునేవారు జూన్‌ 20 వరకు రూ.500, జూలై 1 వరకు రూ.1,000, 3వ తేదీ వరకు రూ.10వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుందన్నారు. జూలై 4 నుంచి 8 వరకు ఇంజనీరింగ్‌, 11, 12 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 44 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. సాంకేతిక కారణాలతో అల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయడంలేదని, ఆ ప్రాంత విద్యార్థులకు సమీపంలోని కేంద్రాలను కేటాయిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో మరో 3 కేంద్రాలు ఉంటాయన్నారు. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు రూ.500, ఓసీలు రూ.600 చొప్పున, రెండింటికీ దరఖాస్తు చేసుకొనేవారు రెండింతల మొత్తం రిజిస్ర్టేషన్‌ ఫీజు చెల్లించాలన్నారు.

*బీసీ కులాల జనగణన తేల్చే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు హెచ్చరించారు. మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి పురస్కరించుకొని గుంటూరులో ఏపీ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. బీసీల కులాల జనగణన చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి బుద్ధి ప్రసాదించాలని అంబేద్కర్‌, పూలే విగ్రహాలకు వినతిపత్రం అందజేశారు.

*ఈ నెల 14న ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) నిర్వహించనున్న మహాపాదయాత్రకు అనుమతి కోరుతూ పోలీస్‌ శాఖకు ఆ పార్టీ దరఖాస్తు చేసింది. ఈ మేరకు డీజీపి మహేందర్‌రెడ్డికి ఆప్‌ నేతఇందిరాశోభన్‌ ఆ దరఖాస్తును సమర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన వినతిపట్ల డీజీపీ సానుకూలంగా స్పందించారన్నారు.

* త్తూరు గంగమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తాం చిత్తూరు గంగమ్మ జాతరను వైభవంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు వంశ పారంపర్యం ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులు తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… కరోనా కారణంగా రెండేళ్లు జాతర నిర్వహించలేక పోయామని అన్నారు. ఈ సారి ఘనంగా జాతరను నిర్వహిస్తామని… అందుకు అందరూ సహకరించాలిని విజ్ఞప్తి చేశారు. అలాగే రాజకీయాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు గంగమ్మ జాతర తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తామని తెలిపారు. కార్యకర్తలు, అభిమానుల నిర్ణయం మేరకు రాజకీయ భవిష్యత్తు నిర్ణయిస్తామన్నారు. రెండేళ్ల తర్వాత మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఉత్సాహంగా కనిపించారు