అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం చోటుచేసుకుంది. తుపాకుల వినియోగంపై నియంత్రణకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటన చేసిన మర్నాడే ఈ ఘటన జరగడం గమనార్హం. న్యూయార్క్ పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని బ్రూక్లిన్ ప్రాంతంలోని స్ట్రీట్‌సబ్‌వేలో మంగళవారం ఉదయం 8.30 సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 8 మందికి తూటా గాయాలయ్యాయని, మరో 8 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. అనుమానితుడు తొలుత పొగబాంబులు వేసి.. కాల్పులకు పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు.
*న్యూయార్క్ కాల్పులపై స్పందించిన వైట్ హౌస్
కలకలం సృష్టించిన న్యూయార్క్ కాల్పుల నేపథ్యంలో అమెరికా అంతటా నేషనల్ ఏజన్సీ హై అలెర్ట్ ప్రకటించింది. మరోవైపు న్యూయార్క్ కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ స్పందించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అధ్యక్షుడు జో బైడెన్ కు న్యూయార్క్ అధికారులు తెలియజేశారని పేర్కొంది. న్యూయార్క్ అధికారులకు బైడెన్ అందుబాటులో ఉన్నారని వివరించింది. అమెరికాలో గన్ కల్చర్ నియంత్రణ కోసం అధ్యక్షుడు జో బైడెన్ నూతన తుపాకీ నియంత్రణ చర్యలను ప్రకటించిన మరుసటి రోజే ఈ పరిమాణం చోటుచేసుకోవడం గమనార్హం. దాడికి పాల్పడిన వారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది.