Movies

సోనాల్‌ చౌహాన్‌కు బంపర్‌ ఆఫర్‌

సోనాల్‌ చౌహాన్‌కు బంపర్‌ ఆఫర్‌

నాయిక సోనాల్‌ చౌహాన్‌ మరో భారీ ఆఫర్‌ దకించుకుంది. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆదిపురుష్‌’ చిత్రంలో కీలక పాత్రకు ఎంపికైంది. ఈ విషయాన్ని ఆమె ఇటీవల ప్రకటించింది. సోనాల్‌ కెరీర్‌లో ఇది తొలి పౌరాణిక చిత్రం. బాలీవుడ్‌లో ‘బుడ్డా హోగా తేరా బాప్‌’,‘జన్నత్‌’ వంటి చిత్రాల్లో నటించిన సోనాల్‌…ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో ఎకువగా నటిస్తున్నది. ‘ఆదిపురుష్‌’ ఈ భామకు బాలీవుడ్‌లో గ్రాండ్‌ రీఎంట్రీ ఇవ్వనుంది. ఈ చిత్ర అవకాశం గురించి సోనాల్‌ చౌహాన్‌ మాట్లాడుతూ…‘నేను ఇప్పటిదాకా నటించిన సినిమాలతో చూస్తే ‘ఆదిపురుష్‌’ ప్రత్యేకమైనది. ఈ సెట్‌లో మరో ప్రపంచాన్ని చూస్తున్నా. నా తొలి పౌరాణిక చిత్రమిది. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమా మీకు సరికొత్త అనుభూతిని పంచుతుందని నమ్మకంగా చెప్పగలను’ అని అంది. సోనాల్‌ ప్రస్తుతం వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ల ‘ఎఫ్‌ 3’ చిత్రంతో పాటు నాగార్జున హీరోగా నటిస్తున్న ‘ఘోస్‌’్ట సినిమాలో నాయికగా కనిపించనుంది. ఈ సినిమాలో ఇంటర్‌ పోల్‌ అధికారిణిగా స్టంట్స్‌ చేస్తున్నదీ భామ.