DailyDose

రష్యాలో దుకాణం మూసివేసిన ఇన్ఫోసిస్

రష్యాలో దుకాణం మూసివేసిన ఇన్ఫోసిస్

ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడుతున్న రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షల పర్వాలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో 6 వేల ఆంక్షలతో రికార్డు సృష్టించింది రష్యా. అయితే వెస్ట్రన్‌ కంట్రీస్‌తో పాటు ప‌లు వాణిజ్య సంస్థ‌లు కూడా ర‌ష్యాపై ఆంక్ష‌లు విధించాయి. తాజాగా భార‌త్‌కు చెందిన ఐటీ దిగ్గ‌జం ఇన్ఫోసిస్ కూడా ఇదే బాట‌లో న‌డిచింది.ర‌ష్యాలో త‌న ఐటీ కార్య‌కలాపాల‌ను నిలిపివేస్తున్న‌ట్లుగా ఇన్ఫోసిస్ బుధవారం సాయంత్రం ఒక కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధం కార‌ణంగానే ర‌ష్యాలో ఐటీ కార్య‌క‌లాపాల‌ను నిలిపివేస్తున్న‌ట్లుగా ఇన్ఫోసిస్ ప్ర‌క‌ట‌న చేసింది. సంస్థ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో ర‌ష్యాలో ఇన్ఫోసిస్ కార్య‌క‌లాపాలు నిలిచిపోనున్నాయి.ఇక ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషణ చేస్తున్నట్లు ఇన్ఫోసిస్‌ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ తెలిపారు. రష్యాలోని ఇన్ఫోసిస్‌ బ్రాంచ్‌లలో పని చేసిన ఉద్యోగులకు తగ్గట్లు వేరే ప్రాంతాల్లో రీ లొకేట్‌ చేయనున్నట్లు ఆయన తెలిపారు. అయితే రష్యన్‌ ఉద్యోగుల పరిస్థితి ఏంటన్నదానిపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.