Movies

‘నా భార్య రక్తం తాగుతోంది’.. సోనూసూద్‌‌ని సహాయం అడిగిన నెటిజన్..!

‘నా భార్య రక్తం తాగుతోంది’.. సోనూసూద్‌‌ని సహాయం అడిగిన నెటిజన్..!

సోనూసూద్ ప్రజలకు సహాయం చేయడంలో ఎంత సీరియస్‌గా ఉంటాడో, ప్రజలను అలరించడంలో కూడా అంతే ముందుంటాడు.. ఎవరైనా ఫన్నీగా ట్వీట్ చేస్తే దానికి అంతేఫన్నీగా రిప్లయ్ ఇస్తాడు సోనూసూద్.. తాజాగా ఓ వ్యక్తీ తన భార్య పై సోనూసూద్ కి ఫిర్యాదు చేస్తూ సహాయం అడిగాడు.తన రక్తాన్ని తన భార్య ఎక్కువ తాగుతోందని, దీనికి ఏమైనా చికిత్స ఉంటే సహయం చేయాలని అడిగాడు.. ఒక భార్యాబాధితుడిగా చేతులు జోడించి మిమ్మల్ని సహాయం అడుగుతున్నానని ఫన్నీ ట్వీట్ చేయగా.. దీనిపైన స్పందించిన సోనూసూద్.. అది ప్రతీ భార్య జన్మ హక్కు బ్రదర్.. మీరు కూడా నాలాగే అదే రక్తంతో బ్లడ్ బ్యాంక్ ప్రారంభించండి” అంటూ నవ్వుతున్న ఏమోజీని షేర్ చేశాడు.దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోనూసూద్‌ ఇచ్చిన రిప్లై చూసి ‘భలే ఇచ్చావ్‌ బ్రదర్‌’, ‘మీ సెన్సాఫ్‌ హ్యూమర్‌ సూపర్‌’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.