Health

చలవతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ముంజలు

చలవతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే  ముంజలు

వేస‌విలో లభ్యమయ్యే మామిడి సీజనల్ ఫ్రూట్. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీంతోపాటు ఇంకోటి కూడా వేసవిలో మ‌నంద‌రి దృష్టి ఆక‌ర్షిస్తుంది. అవే తాటి ముంజ‌ెలు.వేస‌విలో లభ్యమయ్యే మామిడి సీజనల్ ఫ్రూట్. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీంతోపాటు ఇంకోటి కూడా వేసవిలో మ‌నంద‌రి దృష్టి ఆక‌ర్షిస్తుంది. అవే తాటి ముంజ‌ెలు. మండే ఎండ‌ల్లో తాజా ముంజ‌ెల‌ను తింటే ఆ మజాయే వేరు. వీటి వల్ల శ‌రీరానికి చ‌ల్ల‌దనమే కాదు, కీల‌కమైన పోష‌కాలు కూడా అందుతాయి.

*ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా దూరమ‌వుతాయి. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నా, ప్రస్తుతం నగరాల్లోనూ లభ్యమవుతున్నాయి. వేసవి కాలంలో తాటి ముంజ‌ెల‌ను తింటే ప్రయోజనాలు పొటాషియం అర‌టి పండ్ల‌లో ఎంత మొత్తంలో ఉంటుందో అంతే స్థాయిలో తాటి ముంజ‌ల్లోనూ ఉంటుంది. పొటాషియం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ర‌క్తపోటు అదుపులో ఉంటుంది. రక్త ప్రసరణ సక్రమంగా సాగుతుంది శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ బయటకుపోయి, మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. అధిక బ‌రువును నియంత్రిస్తుంది.
వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలోని నీరు ఎక్కువ ఖ‌ర్చ‌వుతుంది. దీంతో డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌తాం. అలాంటి పరిస్థితిలో తాటి ముంజ‌ెల‌ను తీసుకుంటే శ‌రీరంలోకి ద్ర‌వాలు చేరి డీహైడ్రేషన్ బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. దీని వల్ల జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు తొలగిపోతాయి. అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

శ‌రీరం వేడిగా ఉండే వ్యక్తులు వేసవిలో తాటి ముంజ‌ెల‌ను తింటె ఫలితం ఉంటుంది. శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, బి , సి ఐరన్ , జింక్ , పాస్ఫరస్ , పొటాషియం లాంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. ఇవి శ‌రీర బ‌రువును అదుపులో ఉంచుతాయి. తాటి ముంజ‌ెల‌లో పొటాషియం శ‌రీరంలోని విషతుల్యాలను బ‌య‌టకు పంపుతుంది. దీంతో శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్ర‌మ‌వుతుంది.

ఎండల కార‌ణంగా వాంతులు, విరేచ‌నాలు బారినపడే వారికి తాటి ముంజ‌ెల‌ను తినిపిస్తే ఆ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. వీటిని తింటే శ‌క్తిగా వ‌స్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల‌కు ఇవి మేలు చేస్తాయి. రొమ్ము కేన్స‌ర్‌తోపాటు ఇత‌ర కేన్స‌ర్ల‌ను కూడా అడ్డుకునే గుణాలు తాటి ముంజ‌ెల్లో ఉన్నాయి.
గుండె స‌మ‌స్య‌లు ఉన్న వారు, అధిక బ‌రువు ఉన్న వారు, షుగ‌ర్ ఉన్న‌వారు నిర‌భ్యంత‌రంగా వీటిని తీసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు..