Business

నెలకు 40 బిలియన్‌ డాలర్లకుపైగా ఎగుమతులు – TNI వాణిజ్య వార్తలు

నెలకు 40 బిలియన్‌ డాలర్లకుపైగా ఎగుమతులు – TNI వాణిజ్య వార్తలు

*భారత్‌ ఎగుమతులు మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా సగటును 40 బిలియన్‌ డాలర్లు దాటి చరిత్ర సృష్టించాయి. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం ఈ మేరకు తాజాగా గత ఆర్థిక సంవత్సరం గణాంకాలను విడుదల చేసింది. ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాల మేరకు భారత్‌ 420 బిలియన్‌ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించింది. మొత్తం ఎగుమతులు 419.65 బిలియన్‌ డాలర్లు కాగా, దిగుమతుల విలువ 611.89 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 192.24 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యలోటు 102.63 బిలియన్‌ డాలర్లే కావడం గమనార్హం. ఇక ఒక్క సేవల రంగాన్ని చూస్తే, 2021–22లో ఎగుమతుల విలువ చరిత్రాత్మక గరిష్ట స్థాయి 249.24 బిలియన్‌ డాలర్లకు చేరింది. 2020–21 ఇదే కాలంతో పోల్చి చూస్తే (206.09 బిలియన్‌ డాలర్లు) విలువ 21 శాతం పెరిగింది. ఇక సేవల దిగుమతులు ఇదే కాలంలో 23.20% పెరిగి 144.70 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. 2020–21లో ఈ విలువ 117.52 బిలియన్‌ డాలర్లు. వెరసి ఒక్క సేవల రంగంలో వాణిజ్య మిగులు 2021–22 ఆర్థిక సంవత్సరంలో 17.94 శాతం పెరిగి 88.57 బిలియన్‌ డాలర్ల నుంచి 104.45 బిలియన్‌ డాలర్లకు చేరింది.

*అమెరికా ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) కంపెనీ ఫిస్కర్‌ హైదరాబాద్‌ కేంద్రంగా దేశంలో కార్యకలాపాలను ప్రారంభించనుంది. హైదరబాద్‌ కేంద్రం సాఫ్ట్‌వేర్‌, వర్చువల్‌ వెహికల్‌ డెవల్‌పమెంట్‌, ఎంబెడెడ్‌ ఎలకా్ట్రనిక్స్‌ వంటి కార్యకలాపాలను నిర్వహించనుంది. ఈ కేంద్రంలో పని చేయడానికి అవసరమైన నిపుణుల నియామకాన్ని ప్రారంభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. భారత కార్యకలాపాల ద్వారా దాదాపు 200 మంది నిపుణులకు ఇక్కడ ఉద్యోగాలు లభించే వీలుంది.

*విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసులో చైనా మొబైల్‌ తయారీ కంపెనీ షామీ గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మనుకుమార్‌ జైన్‌ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), బెంగళూరు జోన్‌ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గడిచిన కొన్నేళ్లలో కంపెనీతోపాటు దాని ఉన్నతాధికారులకు సంబంధించిన కోట్ల రూపాయల విదేశీ మారక రెమిటెన్స్‌ లావాదేవీలపై ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ఇందులో భాగంగా విచారణకు హాజరుకావాల్సిందిగా జైన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఎందుకంటే, గ్లోబల్‌ వీపీగా పదోన్నతి లభించకముందు షామీ ఇండియా విభాగ అధిపతిగా జైన్‌ బాధ్యతలు నిర్వహించారు. భారత్‌లో షామీ కార్యకలాపాలపై జైన్‌ను ప్రశ్నించడంతోపాటు ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేసిన అధికార వర్గాలు తెలిపాయి.

*మార్చి నెలలో ఎగుమతుల రంగం 4000 కోట్ల డాలర్ల మైలురాయిని దాటింది. ఒక నెలలో ఎగుమతులు ఈ మైలురాయి దాటడం ఇదే ప్రథమం. పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్‌, లెదర్‌ విభాగాలు ప్రదర్శించిన పనితీరుతో మార్చిలో ఎగుమతులు 20 శాతం వృద్ధితో 4222 కోట్ల డాల ర్లుగా (రూ.3.21 లక్షల కోట్లు) నమోదయ్యాయి. దిగు మతులు కూడా 24.21 శాతం పెరిగి 6074 కోట్ల డాల ర్లకు (రూ.4.62 లక్షల కోట్లు) చేరాయి.

*సెమీ కండక్టర్ల కొరత, భారీగా పెరిగిన ముడిసరకు ధరలు ఆటోమొబైల్‌ రంగాన్ని కుంగదీస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2021-22) మొ త్తం మీద వాహన టోకు విక్రయాలు 6 శాతం మేర కు తగ్గాయి. ప్రధానంగా టూవీలర్ల రంగం పదేళ్లలో కనివిని ఎరుగని విధంగా దెబ్బ తింది. ఏడాది మొత్తం మీద టూవీలర్‌ హోల్‌సేల్‌ విక్రయాలు 1,34,66,412. ముందు ఏడాది ఈ సంఖ్య 1,51,20,783 ఉంది. అన్ని విభాగాల్లోనూ వాహన టోకు విక్రయాలు గత ఏడాదితో పోల్చితే 1,86,20,233 నుంచి 1,75,13.596 యూనిట్లకు తగ్గాయి. కమోడిటీ ధరలు ప్రత్యేకించి వాహనాల తయారీలో ఉపయోగించే మెటల్స్‌ ధర లు, రవాణా ధరలు గణనీయంగా పెరగడం సరఫరా వ్యవస్థ పైన, కంపెనీల లాభదాయకత పైన ఒత్తిడిని పెంచినట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆటోమొబైల్‌ పరిశ్రమ ఐదేళ్ల క్రితం ఎలా ఉందో అలాగే ఉన్నదన్నారు. గత ఏడాది పరిశ్రమ ఊహించని సవాళ్లను ఎదుర్కొన్నదని చెప్పారు. ఎంట్రీ లెవెల్‌ కార్లు, టూవీలర్లపై కొన్ని పన్ను ప్రయోజనాలు అందించడం పరిశ్రమకు తోడ్పాటుగా ఉంటుందని అయుకవా ప్రభుత్వానికి సూచించారు.

*భారత్‌లో కోవిడ్- 19, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నుండి లేబర్ మార్కెట్ అసంపూర్తిగా మాత్రమే కోలుకున్న నేపథ్యంలో… గృహ వినియోగం పరిమితం కానున్నట్లు ప్రపంచ బ్యాంర్ పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో… సరఫరా అడ్డంకులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం తదితర ప్రమాదాలను పేర్కొంటూ ప్రపంచ బ్యాంక్… 2023 సంవత్సరానికి భారత్ జీడీపీ అంచనాను ముందుగా అంచనా వేసిన 8.7% నుండి 8%కు తగ్గించింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌కు… ప్రపంచ బ్యాంక్ బుధవారం తన వృద్ధి అంచనాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.7 % నుండి మార్చి 2023 వరకు 8 % కు తగ్గించింది. అంతేకాకుండా… ఆఫ్ఘనిస్తాన్ మినహా దక్షిణాసియాలో వృద్ధి అంచనాను భారీగా తగ్గించింది.

*కష్ట కాలంలోనూ కేంద్రప్రభుత్వ పన్ను వసూళ్లు హోరెత్తాయి. మార్చి 31వ తేదీతో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్రప్రభుత్వ ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.27.07 లక్షల కోట్లకు చేరాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 34 శాతం ఎక్కువ. అలాగే ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌ అంచనాల కన్నా రూ.5 లక్షల కోట్లు అధికం. ఈ మొత్తంలో ప్రత్యక్ష పన్నులు రూ.14.10 లక్షల కోట్లు కాగా, పరోక్ష పన్నుల రాబడి రూ.12.90 లక్షల కోట్టని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 49 శాతం, పరోక్ష పన్నుల వసూళ్లు 20 శాతం పెరిగాయి.

*విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసులో చైనా మొబైల్‌ తయారీ కంపెనీ షామీ గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మనుకుమార్‌ జైన్‌ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), బెంగళూరు జోన్‌ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గడిచిన కొన్నేళ్లలో కంపెనీతోపాటు దాని ఉన్నతాధికారులకు సంబంధించిన కోట్ల రూపాయల విదేశీ మారక రెమిటెన్స్‌ లావాదేవీలపై ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ఇందులో భాగంగా విచారణకు హాజరుకావాల్సిందిగా జైన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఎందుకంటే, గ్లోబల్‌ వీపీగా పదోన్నతి లభించకముందు షామీ ఇండియా విభాగ అధిపతిగా జైన్‌ బాధ్యతలు నిర్వహించారు. భారత్‌లో షామీ కార్యకలాపాలపై జైన్‌ను ప్రశ్నించడంతోపాటు ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేసిన అధికార వర్గాలు తెలిపాయి

*అమెరికా ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) కంపెనీ ఫిస్కర్‌ హైదరాబాద్‌ కేంద్రంగా దేశంలో కార్యకలాపాలను ప్రారంభించనుంది. హైదరబాద్‌ కేంద్రం సాఫ్ట్‌వేర్‌, వర్చువల్‌ వెహికల్‌ డెవల్‌పమెంట్‌, ఎంబెడెడ్‌ ఎలకా్ట్రనిక్స్‌ వంటి కార్యకలాపాలను నిర్వహించనుంది. ఈ కేంద్రంలో పని చేయడానికి అవసరమైన నిపుణుల నియామకాన్ని ప్రారంభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. భారత కార్యకలాపాల ద్వారా దాదాపు 200 మంది నిపుణులకు ఇక్కడ ఉద్యోగాలు లభించే వీలుంది.

*మార్చి నెలలో ఎగుమతుల రంగం 4000 కోట్ల డాలర్ల మైలురాయిని దాటింది. ఒక నెలలో ఎగుమతులు ఈ మైలురాయి దాటడం ఇదే ప్రథమం. పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్‌, లెదర్‌ విభాగాలు ప్రదర్శించిన పనితీరుతో మార్చిలో ఎగుమతులు 20 శాతం వృద్ధితో 4222 కోట్ల డాల ర్లుగా (రూ.3.21 లక్షల కోట్లు) నమోదయ్యాయి. దిగు మతులు కూడా 24.21 శాతం పెరిగి 6074 కోట్ల డాల ర్లకు (రూ.4.62 లక్షల కోట్లు) చేరాయి.

*భారత్‌లో కోవిడ్- 19, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నుండి లేబర్ మార్కెట్ అసంపూర్తిగా మాత్రమే కోలుకున్న నేపథ్యంలో… గృహ వినియోగం పరిమితం కానున్నట్లు ప్రపంచ బ్యాంర్ పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో… సరఫరా అడ్డంకులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం తదితర ప్రమాదాలను పేర్కొంటూ ప్రపంచ బ్యాంక్… 2023 సంవత్సరానికి భారత్ జీడీపీ అంచనాను ముందుగా అంచనా వేసిన 8.7% నుండి 8%కు తగ్గించింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌కు… ప్రపంచ బ్యాంక్ బుధవారం తన వృద్ధి అంచనాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.7 % నుండి మార్చి 2023 వరకు 8 % కు తగ్గించింది. అంతేకాకుండా… ఆఫ్ఘనిస్తాన్ మినహా దక్షిణాసియాలో వృద్ధి అంచనాను భారీగా తగ్గించింది.

*సెమీ కండక్టర్ల కొరత, భారీగా పెరిగిన ముడిసరకు ధరలు ఆటోమొబైల్‌ రంగాన్ని కుంగదీస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2021-22) మొ త్తం మీద వాహన టోకు విక్రయాలు 6 శాతం మేర కు తగ్గాయి. ప్రధానంగా టూవీలర్ల రంగం పదేళ్లలో కనివిని ఎరుగని విధంగా దెబ్బ తింది. ఏడాది మొత్తం మీద టూవీలర్‌ హోల్‌సేల్‌ విక్రయాలు 1,34,66,412. ముందు ఏడాది ఈ సంఖ్య 1,51,20,783 ఉంది. అన్ని విభాగాల్లోనూ వాహన టోకు విక్రయాలు గత ఏడాదితో పోల్చితే 1,86,20,233 నుంచి 1,75,13.596 యూనిట్లకు తగ్గాయి. కమోడిటీ ధరలు ప్రత్యేకించి వాహనాల తయారీలో ఉపయోగించే మెటల్స్‌ ధర లు, రవాణా ధరలు గణనీయంగా పెరగడం సరఫరా వ్యవస్థ పైన, కంపెనీల లాభదాయకత పైన ఒత్తిడిని పెంచినట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆటోమొబైల్‌ పరిశ్రమ ఐదేళ్ల క్రితం ఎలా ఉందో అలాగే ఉన్నదన్నారు. గత ఏడాది పరిశ్రమ ఊహించని సవాళ్లను ఎదుర్కొన్నదని చెప్పారు. ఎంట్రీ లెవెల్‌ కార్లు, టూవీలర్లపై కొన్ని పన్ను ప్రయోజనాలు అందించడం పరిశ్రమకు తోడ్పాటుగా ఉంటుందని అయుకవా ప్రభుత్వానికి సూచించారు.

* బయోఫార్మాస్యూటికల్‌ కంపెనీ భారత్‌ సీరమ్స్‌ అండ్‌ వ్యాక్సిన్స్‌ లిమిటెడ్‌ హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్‌, వ్యాక్సిన్ల తయారీ యూనిట్‌ను ఏర్పా టు చేయనుంది. దాదాపు రూ.200 కోట్లతో ఈ యూనిట్‌ను నెలకొల్పనుంది. ఈ యూనిట్‌లో మహిళ ఆరోగ్య ఉత్పత్తులు, రేబిస్‌ వ్యాక్సిన్‌, హార్మోన్లు తదితరాలను ఉత్పత్తి చేయనున్నట్లు భారత్‌ సీరమ్స్‌ ఎండీ, సీఈఓ సంజీవ్‌ నవంగుల్‌ తెలిపారు. మంగళవారం నాడు తెలంగాణ పరిశ్రమల మంత్రి కే తారక రామారావును సంజీవ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. భారత్‌ సీరమ్స్‌ హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో యూనిట్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని.. వ్యాక్సిన్‌ హబ్‌గా హైదరాబాద్‌ మరింత సుస్థిరం అయ్యేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు.

*దేశీయ ఐటీ సర్వీసుల దిగ్గజం ఇన్ఫోసిస్ మార్చితో ముగిసిన 2022 నాలుగో త్రైమాసిక ఫలితాలను బుధవారం వెల్లడించింది. వార్షికపరంగా 12 శాతం వృద్ధి రేటుతో రూ.5,686 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.5,076 కోట్ల లాభాన్ని పొందినట్టు ప్రస్తావించింది. అయితే త్రైమాసికంపరంగా 2022క్యు3తో పోల్చితే లాభం స్వల్పంగా 2.1 శాతం మేర క్షీణించింది. 2022క్యు4 ఆదాయం దాదాపు 23 శాతం మేర పెరిగి రూ.32,276 కోట్లుగా మోదయ్యిందని తెలిపింది. మార్చి 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.16 తుది డివిడెండ్‌ అందించేందుకు కంపెనీ బోర్డ్ సిఫార్సు చేసిందని పేర్కొంది. ఇదివరకే ప్రకటించిన మధ్యంతర డివిడెండ్‌తో కలిపి ఈ ఏడాదిలో మొత్తం రూ.31 డివిడెండ్ ప్రకటించినట్టయిందని తెలిపింది. కంపెనీ ప్రదర్శనపై ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ దశాబ్దంలోనే అత్యధిక వార్షిక వృద్ధి నమోదయ్యిందని చెప్పారు. డిజిటల్, ఇన్ఫోసిస్ కోబాల్ట్ నేతృత్వంలోని వన్ ఇన్ఫోసిస్ విధానంతో ఈ వృద్ధి సాధ్యమయిందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు నాలుగో త్రైమాసికంలో కొత్తగా 22 వేల మందిని నియమించామని కంపెనీ తెలిపింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 50 వేల మందిని రిక్రూట్ చేసుకోబోతున్నట్టుగా కంపెనీ ప్రకటించింది.

*హైదరాబాద్‌లో రిజిస్ర్టేషన్‌, మార్కెట్‌ విలువల పెరుగుదలతో మార్చిలో 50 లక్షల లోపు విలువైన రెసిడెన్షియల్‌ ఫాట్ల విక్రయాలే 75 శాతం ఉన్నట్లు నైట్‌ఫ్రాంక్‌ ఇండియా వెల్లడించింది. ఒక్క మార్చి నెలలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 5,707 ఫాట్ల విక్రయాలతో రూ.2,583 కోట్ల విలువ గల నివాస గృహాల రిజిస్ర్టేషన్లు జరిగాయని నైట్‌ఫ్రాంక్‌ తెలిపింది. గత ఏడాది మార్చితో పోల్చితే రిజిస్ర్టేషన్లు 31 శాతం తగ్గినట్లు పేర్కొంది. కాగా గత ఏడాది ఇదే కాలంలో ఫ్లాట్ల విక్రయాలు 8,260 గా ఉన్నాయి. మరోవైపు మార్చిలో జరిగిన రిజిస్ర్టేషన్లలో అత్యధికంగా 75 శాతం రిజిస్ర్టేషన్లు రూ.50 లక్షల లోపు ధర కలిగినవి కావటం విశేషం. మార్చి నెలలో జరిగిన రిజిస్ర్టేషన్లలో రూ. 25 లక్షల లోపు ఫ్లాట్ల రిజిస్ర్టేషన్లు 20ు, 25-50 లక్షల లోపు 55ు, 50-75 లక్షలలోపు 13ు, 75-కోటి వరకు 6 శాతంగా ఉన్నట్లు నైట్‌ఫ్రాంక్‌ తెలిపింది.

* భారత్‌లో భారీ ఎలకో్ట్రలైజర్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి గ్రీన్‌కో గ్రూప్‌, బెల్జియంకు చెందిన జాన్‌ కాక్రిల్‌ చేతులు కలిపాయి. సంయుక్త సంస్థ ద్వారా 2 గిగావాట్ల ఎలకో్ట్రలైజర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తాయి. ఇందుకు దాదాపు రూ.3,750 కోట్ల పెట్టుబడులు పెట్టే వీలుంది. చైనా వెలుపల ఇదే అతిపెద్ద ఎలకో్ట్రలైజర్‌ ఫ్యాక్టరీ అవుతుంది. ఈ భాగస్వామ్యం భారత ఇంధన దిగుమతులను తగ్గించటంతో పాటు పర్యావరణ అనుకూల హైడ్రోజన్‌ ఇంధన లక్ష్యాలను చేరడానికి దోహదం చేయగలదని గ్రీన్‌కో ఎండీ, సీఈఓ అనిల్‌ చలమలశెట్టి తెలిపారు.