DailyDose

చేనేత కళాకారుడి ప్రతిభ… పట్టు వస్త్రంపై రామాయణ ఘట్టాలు

చేనేత కళాకారుడి ప్రతిభ… పట్టు వస్త్రంపై రామాయణ ఘట్టాలు

సత్యసాయి జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు పట్టు వస్త్రంపై రామాయణ ఘట్టాలను రూపొందించి అబ్బురపరిచారు. 60 మీటర్ల పట్టువస్త్రంపై పలుభాషల్లో శ్రీరామ నామాలు డిజైన్ చేశారు. శ్రీ రామ కోటి పట్టువస్త్రాన్ని అయోధ్య రామ మందిరానికి సమర్పించనున్నట్లు నాగరాజు తెలిపారు. శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరానికి చెందిన చేనేత కళాకారుడు నాగరాజు… రామ కోటి పట్టువస్త్రాన్ని చేనేత మగ్గంపై రూపొందించి అబ్బురపరిచారు. శ్రీరాముని జీవిత చరిత్ర తెలిపే చిత్రాలను… పట్టు వస్త్రం అంచుల మీద రెండు వైపులా రూపొందించారు. 60 మీటర్ల పట్టువస్త్రం మధ్యలో…. జై శ్రీరామ్ అక్షరమాలను తెలుగుతో పాటు పలు భాషల్లో కలిపి 32,200 అక్షరాలను డిజైన్ చేశారు.

*చేనేత కళాకారుడి ప్రతిభ…
పట్టు వస్త్రంపై రామాయణ ఘట్టాలు16 కిలోల బరువు కలిగిన వస్త్రాన్ని తయారు చేసేందుకు నాలుగు నెలల సమయం పట్టిందని నాగరాజు పేర్కొన్నారు. శ్రీ రామ కోటి పట్టువస్త్రాన్ని అయోధ్య రామ మందిరానికి సమర్పించనున్నట్లు తెలిపారు.