Food

చేప అప్పడాలు.. చికెన్ వడియాలు

చేప అప్పడాలు.. చికెన్ వడియాలు

పప్పుచారులో నంజుకోవడానికి బియ్యం దగ్గర్నుంచీ సగ్గుబియ్యం వరకూ రకరకాల పదార్థాలతో బోలెడన్ని వెరైటీల్లో వడియాలూ , అప్పడాలూ చేసుకుంటుంటాం . ‘ అరె ఎప్పుడూ ఇవేనా … వీటిల్లోనూ కాస్త కొత్తరుచి ఉంటే బాగుంటుంది ‘ అనుకునే మాంసాహారుల కోసం ఇప్పుడు నాన్వెజ్ అప్పడాలు , వడియాలూ దొరుకుతున్నాయి . ఇదివరకు పచ్చళ్లలోకి వచ్చేసిన నాన్వెజ్ ఇప్పుడు వడియాల్లోకి చేరిపోయిందన్నమాట . ‘ చికెన్ క్రాకర్స్ , ఫిష్ పాపడ్స్ ‘ అంటూ మార్కెట్లో చాలా రకాల్లో ఈ మాంసాహార అప్పడాలు వచ్చేస్తున్నాయి . ఇవే కాదు … రొయ్యలూ , పీతలూ ఇష్టంగా తినేవారు ప్రాన్ , క్రాబ్ క్రాకర్సూ కొనుక్కోవచ్చు . మామూలు అప్పడాల్లానే వీటినీ నూనెలో వేయించుకుని తినేయొచ్చు . కావాలంటే యూట్యూబ్లో చూసి మీరూ ఈ వేసవిలో ఇంట్లోనే నాన్వెజ్ వడియాల్ని పెట్టుకోవచ్చు .