Politics

కోర్టులో చోరీ.. న్యాయవ్యవస్థపై దాడిగా గుర్తించాలి – TNI రాజకీయ వార్తలు

కోర్టులో చోరీ.. న్యాయవ్యవస్థపై దాడిగా గుర్తించాలి – TNI రాజకీయ వార్తలు

* నెల్లూరు కోర్టులో సాక్ష్యాధారాల దొంగతనంపై డీజీపి రాజేంద్రనాధ్‌ రెడ్డికి తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. ఈ కేసుపై ఎవరి ప్రభావం లేకుండా కేసును నిశితంగా పర్యవేక్షించి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేరపూరితమైన కుట్రలో భాగస్వామ్యులు అందరిని అరెస్ట్ చేసి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నెల్లూరు కోర్టులో సాక్ష్యాధారాల దొంగతనంపై డీజీపి రాజేంద్రనాధ్‌ రెడ్డికి తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. ఈ దొంగతనం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ఈ కుట్ర వెనుక ఉన్న పెద్ద మనుషులనూ బయటకు లాగాలని డిమాండ్‌ చేశారు. కాకాణి కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రెండు, మూడు రోజుల్లోనే కోర్టు లాకర్ రూం నుంచి సాక్ష్యాధారాలు దొంగిలించబడ్డాయని పేర్కొన్నారు. ఈ కుట్ర కేవలం మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడటానికే అమలు చేసినట్టుగా అనిపిస్తుందన్నారు.

*మతవిద్వేషాలతో బీజేపీ రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం : బీవీ రాఘవులు
మతవిద్వేషాల ద్వారా బీజేపీ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందువుల పవిత్ర పండుగలను ఆసరాగా చేసుకుని దేశంలో సంఘ్‌ పరివార్‌ శక్తులు రెచ్చిపోతున్నాయని విమర్శించారు. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ మతవైషమ్యాలు పెంచుతున్నారని తెలిపారు.బీజేపీ కుటిల నీతిపై ఇప్పటికే లౌకిక పార్టీలన్నీ ఏకమై ఆందోళన వ్యక్తం చేశాయని పేర్కొన్నారు. శ్రీరామ నవమి, హనుమజ్జయంతి ఉత్సవాలకు సంఘ్‌ పరివార్‌ శక్తులకు సాయుధులకు ఆయుధాలు ఇచ్చి మత ఘర్షణలు సృష్టించేందుకు పండుగలను వేదిక చేసుకుందని తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మత ఘర్షణలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో సైతం బీజేపీ మతవిధ్వేషాలు పెంచుతుందని ఆయన ఆరోపించారు. ఏపీలో అన్ని పార్టీలు బీజేపీకి వంతపాడుతున్నాయని అన్నారు. టీడీపీ మౌనంగా ఉంటుందని , జనసేన బీజేపీకి అనుయయంగా తయారైందని ఆరోపించారు.

*వడ్డీ లేని రుణాలు సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి ఎర్రబెల్లి
వడ్డీ లేని రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ సూచించారు. సంగారెడ్డి పట్టణంలో డ్వాక్రా మహిళలకు స్త్రీ నిధి రుణాలు, అభయహస్తం కార్పస్ ఫండ్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఏడేళ్ల కిందట మహిళల పరిస్థితి ఎలా ఉండేదో.. కేసీఆర్‌ పాలనలో ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలన్నారు.గుజరాత్‌లో రూ.500 పింఛన్‌ ఇస్తే.. తెలంగాణలో రూ.2016 ఇస్తున్నట్లు చెప్పారు. కరోనా వచ్చినా అప్పు తెచ్చి పింఛన్‌ ఇచ్చినట్లు గుర్తు చేశారు. మహిళకు ఆర్థిక శక్తిని ఇచ్చింది సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇప్పుడు మహిళల చేతిలో ఐకేపీ, స్త్రీ నిధి డబ్బులున్నాయన్నారు. అభయహస్తం కింద రాష్ట్రవ్యాప్తంగా 21లక్షల మంది రూ.545 కోట్లు అభయ హస్తం కింద చెల్లించారని, వారందరికీ వడ్డీతో కలిసి చెల్లిస్తున్నట్లు తెలిపారు. అలాగే స్త్రీ నిధి ద్వారా ష్యూరిటీ లేకుండా రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రమాదవశాత్తు మహిళ చనిపోతే రూ.3లక్షలు మాఫీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

*ప్రభుత్వ అసమర్థతతోనే హిందువులపై దాడులు: సోమువీర్రాజు
హనుమాన్‌ ర్యాలీలో దాడి ఘటనపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలకు రక్షణ కల్పించలేనివారు.. సమర్ధవంతమైన పాలకుడు ఎలా అవుతారు? అని బీజేపీ నేత సోమువీర్రాజు ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థతతోనే హిందువులపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంత మంది హిందువులు రక్తం చిందించాలన్నారు. ప్రతిపక్షాలను హౌస్ అరెస్టుల ద్వారా కట్టడి చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగడతామని హెచ్చరించారు. సోమువీర్రాజు

*రెండుసార్లు అధికారం ఇస్తే కేసీఆర్ ఏం చేశారు?: షర్మిల
వైఎస్‌ఆర్‌ హయాంలో వ్యవసాయం పండుగలా జరిగిందని, పెట్టుబడి తగ్గించి రాబడి పెంచిన ఘనత వైఎస్‌ఆర్‌దేనని షర్మిల అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటన చేస్తున్న ఆమె మాట్లాడుతూ రెండుసార్లు తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు అధికారం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేశానని సీఎం చెబుతున్నారని… మరి రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని నిలదీశారు. రూ.25 వేలు ఇచ్చే పథకాలు ఆపేసి రూ. 5 వేలు రైతుబంధు ఇస్తున్నారని విమర్శించారు. కౌలు రైతుకు రుణాలు, రైతుబంధు ఇవ్వడంలేదన్నారు. వరి పంట వేయొద్దని రైతులకు చెప్పి కేసీఆర్‌ మోసం చేశారని ఆరోపించారు. వరి వేయని రైతులకు ముఖ్యమంత్రి ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. రైతులు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకున్నారని, మద్దతుధరతో పాటు బోనస్ కలిపి రైతులకు చెల్లించాలన్నారు.టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌ను ఎవరైనా ఏమైనా అంటే వరి కంకులతో కొట్టాలంటూ.. రాజేశ్వరరెడ్డి చెప్పారని, మరి తప్పులు చేస్తున్న సీఎం కేసీఆర్‌ను దేనితో కొట్టాలని ప్రశ్నించారు. వరి వేయొద్దన్న కేసీఆర్‌ను ఏ చీపురుతో కొట్టాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే కొడుకు అరాచకాలతో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఎమ్మెల్యే, ఆయన కొడుకుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని షర్మిల ప్రశ్నించారు.

*బీజేపీ ఒక జూటా పార్టీ: హరీష్‌రావు
బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని యాత్ర చేస్తున్నారని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. ఆదివారం ఆయన తెలంగాణలోని సంక్షేమ పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు. బీజేపీ ఒక జూటా పార్టీ అని మండిపడ్డారు. బీజేపీ పాదయాత్ర ఎవరి కోసమో చెప్పాలి? అని ప్రశ్నించారు. దేశంలో పేదరికం పెరగడానికి కాంగ్రెస్, బీజేపీలే కారణమని ఆరోపించారు. తెలంగాణకు బీజేపీ, కాంగ్రెస్‌ ఏం చేశాయని నిలదీశారు. కేంద్రం పేదల ఉసురు పోసుకుంటుందని మండిపడ్డారు. దళితులను కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌గానే చూసిందన్నారు. ప్రధాని సొంత రాష్ట్రంలోనే కరెంట్‌ కోతలు విధిస్తున్నారని హరీష్‌రావు దుయ్యబట్టారు.

*మంత్రి పువ్వాడ అజయ్ ఓ సైకో: జగ్గారెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మంత్రి పువ్వాడ ఓ సైకో అన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ దగ్గర మార్కుల కోసమే పువ్వాడ ఓవరాక్షన్ చేస్తున్నారన్నారు. ఆ మంత్రికి కొందరు పోలీసులు చెంచాగిరి చేస్తున్నారని ఆరోపించారు. మూడేళ్లుగా ఖమ్మంలో పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని, పువ్వాడను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రిపై ఉన్న ఫిర్యాదులపై విచారణ జరిపించాలన్నారు. పోలీసులపై ప్రజలకు విశ్వాసం పోకుండా ఎస్పీ చూడాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు

*జగన్ .. ఆంధ్రప్రదేశ్ ను అడుక్కునే రాష్ట్రంగా మారుస్తావా?: పంచుమర్తి
జగన్ రెడ్డీ నీస్వార్థం, దోపిడీకోసం బహుళార్థసాధక ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని బ్యారేజీగా మార్చి, అన్నపూర్ణగా పిలిచే ఆంధ్రప్రదేశ్ ను అడుక్కునే రాష్ట్రంగా మారుస్తావా? అని టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. శనివారం అనురాధ మీడియాతో మాట్లాడుతూ.. ’’పోలవరం ఎత్తు తగ్గించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందో, నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రం నుంచి ఎందుకు తేలేకపోతున్నావో ప్రజలకు సమాధానం చెప్పు?కేంద్ర జలశక్తిశాఖ నివేదిక పోలవరం పనుల్లో జగన్మోహన్ రెడ్డి పనితనాన్ని ఎండగట్టింది.మూడేళ్లలో 10 శాతం పనులు కూడా చేయలేదని తేల్చింది. టీడీపీ హాయాంలో ఐదేళ్లలో 70 శాతం పనులు జరిగితే, జగన్ జమానాలో మూడేళ్లలో 7శాతం పనులు చేశారు’’ అని పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. ‘‘నిర్వాసితుల పరిహారంలో కూడా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడటం బాధాకరం.జగన్ అవినీతి, చేతగానితనం… కేసుల భయమే పోలవరానికి శాపాలుగా మారాయి.డయాఫ్రమ్ వాల్ ఎంతమేరకు దెబ్బతిన్నది, దాని నిర్మాణానికి ఏం చర్యలు తీసుకుంటున్నారన్న కేంద్ర జలశక్తి శాఖ ప్రశ్నలకు ముఖ్యమంత్రి వద్ద సమాధానం లేదు.అధికారాన్ని చేపట్టిన ఈ మూడేళ్లలో డయాఫ్రమ్ వాల్‌కు సంబంధించి ప్రాథమికమైన అధ్యయనం చేయకుండానే అది దెబ్బతిన్నదని ఎలా నిర్ధారించారు?కాఫర్‌ డ్యాం నిర్మించడం వల్లే డయాఫ్రమ్ వాల్‌ దెబ్బతిన్నదంటూ జగన్‌ అడ్డగోలుగా బుకాయిస్తూ తప్పించుకోవాలని చూస్తున్నాడు.దెబ్బతిన్న ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పూర్తిచేయడానికి, నిస్సిగ్గుగా మూడేళ్లు పడుతుందంటూ అంతిమంగా ప్రాజెక్ట్ నే పడుకోబెట్టాలని ముఖ్యమంత్రి చూస్తున్నాడు.రాష్ట్రంలోని ఇసుకరీచ్ లను గంపగుత్తగా దక్కించుకున్న సంస్థ, ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇసుక సరఫరా చేసేది లేదని తెగేసి చెప్పినా, ముఖ్యమంత్రి స్పందించలేదు.చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే 2020 మే నాటికి ప్రాజెక్ట్ ని పూర్తి చేసి, రాష్ట్రానికి తాగు, సాగునీరు అందించడంతో పాటు, విద్యుత్ కష్టాలు లేకుండా చేసేవారు. ఏపీకి సాగు, తాగునీరు అందించే ప్రాజెక్ట్ తో ఆటలాడుతూ, నన్నెవరూ ఏమీపీకలేరంటూ బీరాలుపోతున్న జగన్ రెడ్డి కోరలు పీకడానికి రాష్ట్ర రైతాంగం నాగళ్లు, గొర్రులు, చర్నాకోళ్లతో సిద్ధంగా ఉంది’’ అని పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు.

*వైసీపీ తుగ్లక్ చర్యలను అడ్డుకుంటాం: సోమువీర్రాజు
వైసీపీ తీసుకునే తుగ్లక్ చర్యలను అడ్డుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఈ మేరకు పార్టీ ఆఫీసు నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా కార్యాలయాల నిర్వహణకు ఆలయాల నిధులు ఇస్తే ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అమ్మవడి గత సంవత్సరం ఇవ్వలేదు..ఈ సంవత్సరం జూన్ లో ఇస్తామని చెప్పారన్నారు. జిల్లాల విభజన పూర్తి కాగానే నిబంధనలు ప్రకటించారని చెప్పారు.300 యూనిట్లు విద్యుత్ ప్రామీణకం పెడితే ఎలా అని ప్రశ్నించారు.ఆధార్ లో కొత్త జిల్లాల నమోదు వంటివి చాలా నిబంధనలు పెట్టారు.. ఈ కారణంగా 60 శాతం మందికి అమ్మవడి రాదన్నారు. అమ్మవడి తొలి సంవత్సరం ఏలా ఇచ్చారో అలాగే ఈ ఏడాది ఇవ్వాల్సిందేనన్నారు. జిల్లాల విస్తరణలో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు, ఆర్థిక బడ్జెట్ హిందూ దేవాలయాలు నుంచి సేకరించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని సోమువీర్రాజు తీవ్రంగా వ్యతిరేకించారు.

*సీఎం, మంత్రులకు ఆర్భాటాలు ఎక్కువయ్యాయి: తులసిరెడ్డి
సీఎం జగన్, మంత్రులకు ఆర్భాటాలు ఎక్కువయ్యాయని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. సీఎం ఒంటిమిట్టకు వస్తే 3,500 మంది పోలీసులతో బందోబస్తు అవసరమా? అని ప్రశ్నించారు. కల్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీచరణ్ ర్యాలీ కారణంగా.. సకాలంలో వైద్యం అందక చిన్నారి మృతి చెందడం విచారకరమన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో మంత్రి కొట్టు సత్యనారాయణ కోసం.. 3 గంటల పాటు భక్తులను క్యూలైన్లలో ఉంచడం ధర్మమా? అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో చివరకు కోర్టులకే రక్షణ లేదన్నారు. కుటుంబంలో ఒక్కరికే అమ్మఒడి అమలు చేయడం సమంజసం కాదని తులసిరెడ్డి పేర్కొన్నారు.

*రాజధానిని తరలించడం ఎవరివల్ల కాదు: ఉన్నం వెంకటేశ్వరరావు
రాజధానిని తరలించడం ఎవరివల్ల కాదని రాజధాని అమరావతి పుస్తక రచయిత ఉన్నం వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం ‘ఆంధ్రుల రాజధాని అమరావతి’ ద్వితీయ ముద్రణ ఆవిష్కరణ పుస్తకావిష్కరణలో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2016లో రాజధాని మొదటి ప్రచురణను చంద్రబాబు విడుదల చేశారన్నారు.అమరావతి రాజధాని కోసం 852 రోజులుగా ఉద్యమిస్తున్నామని చెప్పారు. అమరావతి రైతుల త్యాగాలను పుస్తకంలో రాసినట్లు తెలిపారు.అమరావతిలో ఒక సెంటు భూమి కూడా లేదన్నారు. ఒక సామాజికవర్గానికి మాత్రమే రాజధాని అన్నవారికి.. పుస్తకంలో పూర్తి విషయాలు వెల్లడించామని ఉన్నం వెంకటేశ్వరరావు తెలిపారు.

*అమ్మఒడి’ అమలులో మోసం: వంగలపూడి అనిత
ఎన్నికల వేళ అందరికీ ‘అమ్మ ఒడి’ అంటూ హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్న జగన్‌ అధికారంలోకి వచ్చాక ‘షరతులు వర్తిస్తాయి’ అంటూ కొందరికే అందిస్తున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. నిబంధనల పేరుతో ఎక్కువ మందికి ఎగ్గొడుతున్నారని ఆరోపించారు. ‘అమ్మఒడి’ విషయంలో లబ్ధిదారులను వైసీపీ మోసం చేస్తోందంటూ టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం చెవిలో పూలు పెట్టుకుని తెలుగు మహిళలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో చదువుకుంటున్న 80 లక్షల మంది పిల్లలందరికీ అమ్మఒడి ఇస్తామని సీఎం జగన్‌తోపాటు ఆయన సతీమణి భారతి కూడా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు 40 లక్షల మందికే ఇస్తున్నారన్నారు. ఇంట్లో చదువుకునే పిల్లలందరికీ ఇస్తామని చెప్పి కుటుంబంలో ఒకరికే ఇస్తామని షరతు పెట్టడం విడ్డూరమన్నారు. దీనిపై సీఎంతోపాటు భారతి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అలాగే 75 శాతం హాజరు ఉండాలన్న నిబంధన కరోనా కాలంలో ఎలా సాధ్యమని చెప్పారు. ఇక, విద్యుత్‌ వాడకం 300 యూనిట్లు దాటితే నిలిపి వేస్తామంటున్నారని, వేసవిలో ఇది సాధ్యమేనా అని వంగలపూడి అనిత ప్రశ్నించారు.

*పాపాలు చేయడంలో శిశుపాలుడిని మించిపోయిన జగన్: నారా లోకేష్
తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో వారంలో 14 మంది శిశువులు చనిపోతే వైసీపీ సర్కారు నిద్ర నటిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శనివారం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. రుయాలో పసిప్రాణాలు గాల్లో కలుస్తున్నా… గాలి మాటల సీఎం ఏం జరుగుతోందని ఆరా తీయలేదన్నారు. పాపాలు చేయడంలో శిశుపాలుడిని మించిపోయిన జగన్ నిర్లక్ష్య పాలన ఫలితమే ఈ శిశు మరణాలు అని చెప్పారు. ఆ తల్లిదండ్రుల గుండె కోతకి సమాధానం ఉందా జగన్ రెడ్డి గారూ? శిశు మరణాలు ప్రభుత్వ హత్యలే. మరణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నారా లోకేష్ తెలిపారు.

*యూనివర్సిటీల్లో వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగ మేళాలా?: టీడీపీ
వైసీపీ కార్యకర్తలకు ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఉద్యోగ మేళాలు నిర్వహించడంపై తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు శనివారం ఒక ప్రకటన చేశారు. ‘‘రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే వారిని గాలికి వదిలి కేవలం వైసీపీ కార్యకర్తలకు మాత్రమే ఉద్యోగ మేళాలు పెట్టడం ఏమిటి? మీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇప్పించుకోవాలని అనుకొంటే తాడేపల్లి ప్యాలె్‌స లో పెట్టుకోండి. ఇప్పటికే వలంటీర్‌ పేరుతో ప్రతి 50 ఇళ్లకో వైసీపీ కార్యకర్తను పెట్టారు. ఇప్పుడు మళ్లీ వాళ్లకు ఉద్యోగాల పేరుతో మేళాలు పెడుతున్నారు. ఒకపక్క ఉద్యోగాలు రాక 400 మంది నిరుద్యోగులు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకొన్నారు. ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాల భర్తీ లేదు. ప్రైవేటు ఉద్యోగాలు అసలు రావడం లేదు’’ అని విమర్శించారు. ఇప్పటికైనా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని, నిరుద్యోగ యువతను ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలని మంతెన డిమాండ్‌ చేశారు.

*జగన్‌ అసమర్థతకు పోలవరం నిలువెత్తు అద్దం: పంచుమర్తి
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అసమర్థతకు పోలవరం ప్రాజెక్టు నిలువెత్తు అద్దమని టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. శనివారం ఆమె ఒక ప్రకటన చేశారు. టీడీపీ ఐదేళ్ల హయాంలో 70 శాతం పనులు జరిగితే జగన్‌ రెడ్డి మూడేళ్ల పాలనలో అందులో పదో వంతు కూడా కాలేదన్నారు. ఇంత చేతగాని ముఖ్యమంత్రిని ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా చూడలేదని విమర్శించారు. పోలవరం పవర్‌ ప్రాజెక్టు కొట్టేయాలన్న దుర్భుద్దితో మొత్తం పోలవరం ప్రాజెక్టును జగన్‌రెడ్డి నాశనం చేశారని ఆరోపించారు. చివరకు ఏదీ పూర్తి చేయలేక చతికిలబడ్డారని, కనీసం పవర్‌ ప్రాజెక్టు పూర్తయి ఉన్నా ఇప్పుడు ఈ విద్యుత్‌ కోతలు ఉండేవి కావని చెప్పారు. చంద్రబాబు హయాంలో రూ.11,000 కోట్ల విలువైన పనులు జరిగితే వాటి కింద రూ.4,000 కోట్లను తెచ్చుకొన్న జగన్‌ ప్రభుత్వం ఆ డబ్బులను మద్యం తయారీ కంపెనీలకు ఇచ్చి చేతులు దులుపుకొందన్నారు. ఆ డబ్బును ప్రాజెక్టు నిర్మాణానికిగాని… నిర్వాసితులకుగాని ఇవ్వలేదని పంచుమర్తి విమర్శించారు.

*పీకే కుట్రలు మోదీ దగ్గర సాగవు: లంకాదినకర్నే
త లంకాదినకర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… దేశాన్ని పీలికల పాలన చెయ్యాలని కాంగ్రెస్ తో పీకే కుట్ర పన్నారన్నారు. ఇలాంటి కుట్రలు మోడీ దగ్గర ముందుకు సాగవని హెచ్చరించారు. కుటుంబ పాలన చేసే తల్లి కాంగ్రెస్ తో పిల్ల కాంగ్రెస్ పార్టీలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు కలసి దేశాన్ని నాశనం చేయాలని చూస్తే ప్రజలు బుద్ధి చెబుతారని లంకాదినకర్ అన్నారు.

*దేశవ్యాప్తంగా బీజేపీ క్రమ క్రమంగా బలహీన పడుతోంది: బీవీ రాఘవులు
దేశవ్యాప్తంగా బీజేపీ క్రమ క్రమంగా బలహీన పడుతోందని, మళ్ళీ బలపడటానికి మత ఘర్షణలు తెరపైకి తీసుకురావాలని చూస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడేకొద్ది బీజేపీ కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టె అవకాశాలు ఉన్నాయన్నారు. ఏపీలోని ప్రాంతీయ పార్టీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా బీజేపీకి, సంఘ్ పరివార్‌కు మద్దతు ఇస్తున్నాయని, మరీ ముఖ్యంగా వైసీపీ బీజేపీతో అంటకాగుతోందని ఆరోపించారు. చెత్త పన్ను, విద్యుత్ చార్జీలు పెంచమని కేంద్రం ఒత్తిడి తేవడంతోనే ఏపీ సర్కారు పెంచిందన్నారు. కేంద్రం ఒత్తిడి చేస్తే సీఎం జగన్ ఎందుకు తలొగ్గారని ప్రశ్నించారు. నెల్లూరు కోర్టులో ఆధారాలు దొంగిలిస్తే ప్రభుత్వం ఏమి చేస్తోందన్నారు. సీసీ కెమెరాల ద్వారా 5 నిమిషాల్లో దొంగలు దొరుకుతుంటే పోలీసు యంత్రాంగం ఏమి చేస్తుందని నిలదీశారు. ప్రభుత్వ పెద్దల అనుమతి లేనిదే కోర్టులో దొంగతనం జరుగుతుందా?.. నెల్లూరు కోర్టులో ఆధారాల మాయంపై సిట్ వేసి వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ముందుకు వస్తే టీడీపీతో కలిసి పోరాటం చేస్తామని బీవీ రాఘవులు స్పష్టం చేశారు.

*నేనేమైనా తక్కువ తిన్నానా అంటూ… విజయసాయి రెడ్డి…: అయ్యన్న
ఏ1 జగన్ రెడ్డి గారు వాలంటీర్ల ఉద్యోగాలు ఇస్తే నేనేమైనా తక్కువ తిన్నానా అంటూ… ఏ2 విజయసాయి రెడ్డి సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యోగాలు ఇప్పించాడట అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. జాబ్ మేళా అంటే ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, టెలికాం లాంటి రంగాల్లో ఉద్యోగాలు ఇస్తారేమో అనుకున్నానని, మీరు ఇచ్చేది సెక్యూరిటీ గార్డ్, హెల్పర్, సేల్స్ పోస్ట్‌లని ఇప్పుడు తెలిసిందన్నారు. (బ్లూ) మీడియా హడావుడి చూసి జగన్ రెడ్డి హామీ ఇచ్చిన 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎలాగో చెయ్యడం లేదుగా, కనీసం వీసా రెడ్డి సీమ ప్రాంత బిడ్డలకు నాలుగు ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తాడు అని ఆశపడ్డామన్నారు. ఫైనల్‌గా తేలింది ఏంటంటే….రెజ్యుమ్‌లు ఇచ్చి వెళ్ళమన్నారట అని ఎద్దేవా చేశారు. మీ ప్రచార యావ వల్ల రాను పోను ఛార్జీలు వృధా అయ్యాయని మండిపడ్డారు. మీ బ్రతుక్కి రూ.5 వేల జీతానికి మించి ఆశించి రావడం ముమ్మాటికీ తప్పేనన్నారు.

*ఉద్యోగాలు రిజర్వ్‌ చేసుకోండి: అయ్యన్న
విజయసాయిరెడ్డీ… నీ రాజ్యసభజగన్‌రెడ్డి సీఎం పదవి పోయే రోజు దగ్గర పడింది. కార్యకర్తల కోసం నిర్వహిస్తున్న జాబ్‌ మేళాలో మీరూ ఉద్యోగాలు రిజర్వ్‌ చేసుకోండిఅని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు శనివారం ట్విటర్‌లో ఎద్దేవా చేశారు. జగన్‌రెడ్డిని ఛీ కొట్టి తల్లిచెల్లిబావ పక్క రాష్ట్రానికి వెళ్లిపోవడం కంటే పెద్ద ఛీత్కారం ఏముంటుందిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారంలక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోతే మీకు బడిత పూజ ఖాయం. తిరుపతి ప్రసూతి ఆస్పత్రి(రుయా)లో మంది శిశువులు చనిపోతే జగన్‌రెడ్డి ఎలా నిద్రపోతున్నారుఅని నిలదీశారు.