Movies

ఏమా వర్కవుట్లు

ఏమా వర్కవుట్లు

బహుళ భాషల్లో బిజీబిజీగా సాగుతున్న రష్మికా మండన్న వర్కవుట్ల విషయంలో అబ్బురపరుస్తున్నది. మెరుపువేగంతో ఆమె చేసే రకరకాల వర్క వుట్లు చూపరుల్ని చెమటలు పట్టేమాదిరి వున్నాయి. వర్కవుట్ల తాలూకు వీడియోలు చూసినవారు ‘ఔరా’ అనాల్సిందే. “శరీరం ఫిట్గా వుండాలంటే మనస్సు స్థిరంగా వుండాలి. ఫిట్గా వుండాలని నిర్ణయించుకున్నాక స్థిరత్వం వుండాలి . చేసే వ్యాయామాలు, ఫిజియోలు డైట్ , ఆలోచనలు అన్నీ స్థిరంగా వుండాలి . మొదట్లో వ్యాయామాలు కొంచెం కష్టంగానే వుంటాయి. అలవాటయ్యాక ఎంతో సరదాగా వుంటుంది. ఫిట్నెస్ గోల్స్ రీచ్ అయ్యేకొద్దీ ఉత్సా పెరుగుతుంది ” అంటున్నది.