బాలీవుడ్ చిత్రసీమపై తన యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది ఫైర్‌బ్రాండ్ కంగనారనౌత్. అక్కడి పురుషాధీక్యం, వారసుల అహంకారంపై గత కొన్నేళ్లుగా నిరసన గళం వినిపిస్తున్న ఈ భామ మరోమారు హిందీ హీరోలపై విరుచుకుపడింది. దక్షిణాది కథానాయకుల్ని పొగడ్తల్లో ముంచెత్తుతూ పరోక్షంగా హిందీ హీరోలపై విమర్శల్ని సంధించింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సౌత్‌హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, యష్ ఫొటోలను పంచుకుంది కంగనారనౌత్. ఇందులో రామ్‌చరణ్, ఎన్టీఆర్ మాల ధరించి కనిపించారు. యష్ కుటుంబంతో కలిసి పూజలో పాల్గొంటున్నారు. అల్లు అర్జున్ తన సోదరులతో కలిసి నుదిటిన పెద్ద బొట్టు పెట్టుకొని కనిపిస్తున్నారు. ఈ ఫొటోల్ని షేర్ చేసిన కంగనారనౌత్..‘దక్షిణాది సూపర్‌స్టార్స్ అందరూ నిరాడంబరంగా కనిపిస్తారు. వారు సంస్కృతి మూలాల్ని ఎంతగానో ప్రేమిస్తారు’ అని వ్యాఖ్యానించింది. అలాగే ‘కేజీఎఫ్’ హీరో యష్ ఫొటోను షేర్ చేస్తూ యాంగ్రీ యంగ్‌మెన్‌గా అమితాబ్‌బచ్చన్ స్థానాన్ని యష్ భర్తీ చేస్తాడు’ అని పేర్కొంది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్‌గా మారాయి. గతంలో కూడా బాలీవుడ్ హీరోలపై తనదైన శైలిలో విమర్శల్ని సంధించివార్తల్లో నిలిచింది కంగనారనౌత్.