తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఫౌండేషన్ ద్వారా ముగ్గురు దివ్యాంగులకు 3 లక్షల విలువైన మూడు చక్రాల అక్టీవా 125సీసీ వాహనాలను సోమవారం సామినేని నాగేశ్వరరావు గారు అందజేసారు. స్టేజి పినపాక వాసి రాజశేఖర్ రెడ్డి ఖమ్మంలో పీజీ చదువుతూ బస్సుల్లో వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి నివాసి సుధాకర్ , డిప్యూటీ డీఎం అండ్ హేచ్వో సీతారాం గారి ద్వారా, ఖమ్మంలో లో ఉంటున్న సంపూర్ణ ఖమ్మం నివాసి, తానా ట్రస్టీ సామినేని రవిని అంతర్జాల వేదికగా సహయంకోరకు అభ్యర్ధన చేశారు. తానా సభ్యుల, దాతలు సహకారంతో సోమావారం ఖమ్మంలో మంజీర అపార్ట్మెంట్ లో జరిగిన కార్యక్రమంలో వాటిని లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా సామినేని నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ తమ కుమారుడు తానా ట్రస్టీగా ఉన్నందున వసరమైన వారికి తమ సామినేని ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహింస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బగా పసుమర్తి రంగారావు మాట్లాడుతు సోషల్ మీడియాలో అడగగానే స్పందించిన తానా ఫౌండేషన్ వారికి,సామినేని ఫౌండేషన్ మరియు ముఖ్యంగా దాతలకు (Rajesh Atluri, Samba Aripaka,Mahesh Gudimella, Prakash Bhogula , Mouni Chowdary,Vijram Prabhala,Siva Chava,Revanth Tummala,Srini Lavu,Ram chowdary Upputuri,Shashank Yarlagadda,Sudheer Kopparam,Sudhakar Ganapathy, Naren Kodali , Shafi Mahmud,Kishore Kodali,Anjaiha chowdary Lavu,Viswa Thamatam) తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు గారికి, చైర్మన్ వెంకటరమణ యార్లగడ్ద గారికి, తానా ట్రస్టీ మరియు తానా ఆదరణ ప్రాజెక్ట్ కోర్దినేటర్ రవి సామినేని గారికి మనస్పూర్ఠిగా క్రుతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో బండి నాగేశ్వర్ రావు, అచుతారావు, వాసిరెడ్డి అర్జునరావు, శేషగిరి రావు పాల్గొన్నారు.