DailyDose

నీతా అంబానీ ఆర్థిక పాఠాలు

నీతా అంబానీ ఆర్థిక పాఠాలు

ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందటారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ, నీతా దంపతుల విషయంలో అది నూటికి నూరుపాళ్లు నిజం అనిపిస్తుంది. ముకేశ్‌ అంబానీకి సహకారం అందిస్తూనే రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌ పర్సన్‌గా అనేక సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు నీతా అంబానీ. కుటుంబంలో ఎప్పటి నుంచో ఉంటున్న ఆమె వ్యాపారంలో ఎదురయ్యే అనేక ఒడిదుడుకులు, వాటిని ఎదుర్కొనే తీరును దగ్గరగా చూసి ఉంటారు. అలా వచ్చిన అనుభంతో ఆమె ఇటీవల ట్విటర్‌ వేదికగా సక్సెస్‌ సీక్రెట్స్‌ని వరుసగా పంచుకుంటున్నారు.

– చదువుకు జ్ఞానం తోడైనప్పుడు జీవిత గమనంలో సరైన మార్గంలో ప్రయాణిస్తాం
– లక్ష్యాలను ఎప్పుడూ మార్చుకోకండి. లక్ష్యాలను చేరుకునే స్ట్రాటజీలను మార్చండి
– ఒకరి కోసం నీ జీవితాన్ని మార్చుకోవద్దు
– ఆదాయాన్ని మించి ఖర్చులు చేయోద్దు. అవసరం అనుకున్నప్పుడే డబ్బు ఖర్చు చేయండి
– వ్యాపారంలో వచ్చిన నష్టాల గురించి బయటి వ్యక్తుల ముందు మాట్లాడకండి
– బద్దకస్తులు, నిరక్ష్యంగా ఉండే వారే అదృష్టంపై ఆధారపడతారు
– విజయం అనేది మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. సంతోషాన్ని ఇస్తుంది. నలుగురిలో గుర్తింపును కూడా తీసుకొస్తుంది
– మథుమరైన సంభాషన విజయానికి రాచబాట పరుస్తుంది
– సాకులు చెప్పడం మాని కష్టపడి పని చేస్తేనే విజయం వరిస్తుంది
– మీకు నచ్చని వ్యక్తుల నుంచి సలహాలు తీసుకోకండి
– సమయం విలువ తెలియని వారు తరుచుగా అపజయం పాలవుతుంటారు
– ప్రతీ రోజు హ్యాపీ మూడ్‌లో నిద్ర లేవడం అనేది విజయానికి ఒక కొలమానం
– మన కాళ్ల మీద మనం నిలబడాలి అనుకున్నప్పుడు ఇతరులపై ఆధారడకూడదు. ఇతరల మీద ఆధారపడి ప్రణాళికలు వేసే వాళ్లు ఎన్నటికీ స్థిరత్వం సాధించలేరు