Business

ప్రపంచంలో అత్యంత ఖరీదైన స్టాక్ ఇదే! – TNI వాణిజ్య వార్తలు

ప్రపంచంలో అత్యంత ఖరీదైన స్టాక్ ఇదే! – TNI వాణిజ్య వార్తలు

* స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు . భారతదేశంలో కూడా , స్టాక్ మార్కెట్ ( Stock Market ) లో పెట్టుబడులు పెట్టే ధోరణి వేగంగా పెరిగింది . ముఖ్యంగా గత రెండేళ్లలో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య వేగంగా పెరగడమే ఇందుకు కారణం . వాస్తవానికి , చిన్న మొత్తంతో పెట్టుబడి ( Investment ) పెట్టడం ప్రారంభించాలని పెట్టుబడిదారులకు ఎల్లప్పుడూ సలహా ఇస్తుంటారు . మంచి రాబడి కోసం ప్రజలు పెద్ద కంపెనీలలో పెట్టుబడి పెడుతుంటారు . అన్ని స్టాక్లు వేర్వేరు ధరలను కలిగి ఉంటాయి . చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు చౌక స్టాక్స్పై దృష్టి పెడతారు . అదే సమయంలో , ప్రపంచంలో ఒకటి కంటే ఎక్కువ ఖరీదైన స్టాక్లు ఉన్నాయని మీకు తెలుసా ? కొన్ని షేర్ల ధరలను వింటే మాత్రం మూర్చ పోవాల్సిందే . వాటిపై పెట్టుబడి పెట్టాలంటేనే దడపుట్టిస్తాయి .
*ప్రైవేటు బీమా కంపెనీల నుంచి పోటీ ఉన్నా భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) మార్కెట్లో దూసుకుపోతోంది. మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో నిమిషానికి 41 పాలసీల చొప్పున మొత్తం 2,17,18,695 పాలసీలను విక్రయించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో విక్రయించిన 2,09,75,439 పాలసీలతో పోలిస్తే ఇది 3.54 శాతం ఎక్కువ. కాగా 2021 -22లో ఎల్‌ఐసీ స్థూల ప్రీమియం ఆదాయం 12.66 శాతం పెరిగి రూ.1,43,938.59 కోట్లకు చేరింది.
*మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌నకు చెందిన స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ హార్టికల్చర్‌లో యంత్రీకరణను పెంచడానికి ‘కోడ్‌’ పేరుతో ట్రాక్టర్‌ తరహా కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. హార్టికల్చర్‌ రంగంలో వివిధ రకాల పనులకు ఉపయోగపడే విధంగా దీన్ని డిజైన్‌ చేశామని స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ సీఈఓ హరీష్‌ చవాన్‌ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ ఉత్పత్తిలో హార్టికల్చర్‌ ఉత్పత్తి 30 శాతం ఉంటే సాగు చేసే భూమిలో 17 శాతమే హార్టికల్చర్‌ ఉత్పత్తులను పండిస్తున్నారు. దేశం మొత్తంలో ఉత్పత్తి అవుతున్న కాయలు, పళ్లలో 12 శాతం ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణాల్లో హార్టికల్చర్‌ యంత్రీకరణపై స్వరాజ్‌ దృష్టి కేంద్రీకరిస్తోందని చెప్పారు. వచ్చే మూడేళ్లలో హార్టికల్చర్‌ కోసమే అభివృద్ధి చేసిన మరో రెండు, మూడు ఉత్పత్తులను మార్కెట్లోకి స్వరాజ్‌ విడుదల చేయనుందని చవాన్‌ చెప్పారు. ఏపీ, తెలంగాణల్లో కంపెనీకి మొత్తం 80 మంది డీలర్లు ఉండగా.. ముందుగా 10 మంది డీలర్ల వద్ద కోడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 500 కోడ్‌లు బుక్‌ అయ్యాయని చెప్పారు. దీని ధర రూ.2-2.5 లక్షలు ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కోడ్‌ను విడుదల చేశారు.
*పెన్నార్‌ ఇండస్ట్రీ్‌సకు గత రెండు నెలల్లో (ఫిబ్రవరి, మార్చి) రూ.498 కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయి. ఈ ఆర్డర్లను వచ్చే రెండు త్రైమాసికాల్లో పూర్తి చేయనున్నట్లు పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎంఎ్‌సఎన్‌ లేబొరేటరీస్‌, జేఎ్‌సడబ్ల్యూ కంపెనీల నుంచి ప్రీ ఇంజనీర్డ్‌ భవనాలను నిర్మించడానికి కంపెనీకి చెందిన పీఈబీ విభాగానికి ఆర్డర్లు వచ్చాయి.
*నష్టాల బాటలో పయనిస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేస్తున్నాయి. సూచీల వరుస 5 రోజుల పతనంతో ఏకంగా రూ.8 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు దేశీయ మార్కెట్ల క్షీణతకు దారితీస్తున్నాయి. నష్టాల కొనసాగింపుగా ఐదవ రోజయిన మంగళవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 703.59 పాయింట్లు లేదా 1.23 శాతం పతనమై 56,463.15 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో గత 5 సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 2,984.03 పాయింట్లు లేదా 5.01 శాతం మేర దిగజారినట్టయింది. దీంతో 5 రోజుల్లోనే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల క్యాపిటలైజేషన్ రూ.8,08,067.6 కోట్ల మేర క్షీణించి రూ.2,66,02,728.45 కోట్లకు పడిపోయింది. పెట్టుబడుల ఉపసంహరణకు విదేశీ మదుపర్లు మొగ్గుచూపుతుండడం, ద్రవ్యోల్బణం ఆందోళనలు, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు ఇన్వెస్టర్లను భయాలకు గురిచేస్తున్నాయి. ఈ కారణంగానే మార్కెట్లో అమ్మకాల జోరు కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
*తెలంగాణలో డీలర్ల నెట్‌వర్క్‌ను విస్తరించే వ్యూహంలో భాగంగా హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌) హైదరాబాద్‌లో 8 కొత్త డీలర్‌షి్‌పలను ప్రారంభించింది. అత్తాపూర్‌లో లక్ష్మీ హ్యుండ య్‌ డీలర్‌షి్‌పను హెచ్‌ఎంఐఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డీహెచ్‌ పార్క్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌ మార్కెట్‌ హ్యుండయ్‌కి కీలకంగా మారిందని, కొత్త డీలర్‌షి్‌పల ద్వారా నెట్‌వర్క్‌ను మరింత పటిష్ఠం చేసుకుంటున్నట్లు పార్క్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ హ్యుండయ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కంభంపాటి రామ్మోహన్‌ రావు పాల్గొన్నారు.
*జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ.. ఎక్స్‌4 మోడల్‌లో సిల్వర్‌ షాడో ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ కారు ధరలు రూ.71.9 లక్షలు- రూ.73.9 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌) ఉన్నాయి. 2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌, 3 లీటర్‌ డీజిల్‌ ఇంజన్‌ ఆప్షన్లతో అందుబాటులో ఉండనున్న ఈ మోడల్‌ను చెన్నైలోని ప్లాంట్‌లో స్థానికంగా ఉత్పత్తి చేసినట్లు తెలిపింది.
* అంతర్జాతీయ స్థాయిలో క్రిప్టో కరెన్సీలను నియంత్రించాలని భారత్‌ కోరింది. లేకపోతే ఈ నిధులు అక్రమార్కులు, ఉగ్రవాదుల చేతికి అందే ప్రమాదం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ హెచ్చరించారు. ఐఎంఎఫ్‌ నిర్వహించిన ఒక సమావేశంలో ఆమె ఈ విషయం సప్ష్టం చేశారు. క్రిప్టో కరెన్సీల నిర్వహణ, లావాదేవీలు ప్రభుత్వాల చేతుల్లో కాకుండా ప్రైవేటు వ్యక్తులు, సంస్థల చేతుల్లో ఉండడమే పెద్ద సమస్య అన్నారు. అయితే కేంద్ర బ్యాంకులు జారీ చేసే డిజిటల్‌ కరెన్సీలతో మాత్రం ఎలాంటి ముప్పు ఉండదన్నారు. అన్ని దేశాలు చేతులు కలిపితే తప్ప.. ఏదో ఒక దేశం మాత్రమే క్రిప్టోలను నియంత్రించలేదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఈ దిశగా ప్రయత్నాలు జరగకపోతే క్రిప్టోలు అక్రమ నగదు లావాదేవీల (మనీ లాండరింగ్‌)కుఉగ్రవాదుల నిధుల సమీకరణకూ సాధనంగా మారతాయని హెచ్చరించారు.
*సాస్‌ ప్లాట్‌ఫామ్‌పై సేవలందిస్తున్న హెచ్‌ఆర్‌ టెక్‌ కంపెనీ ఎక్స్‌పెర్షియా ఏఐలో హైదరాబాద్‌కు చెందిన ఎర్లీ స్టేజ్‌ వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ ఎండియా పార్ట్‌నర్స్‌ పెట్టుబడులు పెట్టింది. చిరాటే వెంచర్స్‌ తో కలిసి 12 లక్షల డాలర్ల (దాదాపు రూ.8.64 కోట్లు) పెట్టుబడులు పెట్టినట్లు ఎండియా వెల్లడించింది.
*క్రూడాయిల్‌, ఇతర కమోడిటీల ధరల పెరుగుదల ప్రభావంతో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) మార్చి నెలలో నాలుగు మాసాల గరిష్ఠ స్థాయి 14.55 శాతానికి దూసుకుపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇది 13.11 శాతం ఉండగా గత ఏడాది మార్చిలో 7.89 శాతం ఉంది. వరుసగా 12 నెలలుగా టోకు ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలో ఉంటూ వస్తోంది. గత ఏడాది నవంబరులో టోకు ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయి 14.87 శాతాన్ని తాకింది. టోకు ద్రవ్యోల్బణం పెరుగుదలలో అధిక వాటా క్రూడాయిల్‌ ధరలదేనని వాణిజ్య శాఖ గణాంకాలు తెలుపుతున్నాయి.