* సుప్రీంకోర్టులో రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్ కొనసాగడానికి వీల్లేదని సుప్రీం తెలిపింది. సస్పెన్షన్ కాలం రెండేళ్లు పూర్తైనందున దానంతట అదే ముగిసినట్టేనని స్పష్టం చేసింది. సెంట్రల్ మినిస్ట్రీ రివ్యూ కమిటీకి.. రెండేళ్ల తర్వాత రికమండేషన్ కోసం పంపినా చెల్లదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఏబీవీ సస్పెన్షన్‌ను ఇకపై కొనసాగించడం చట్టవిరుద్ధమని సుప్రీం తేల్చి చెప్పింది.
*తెలంగాణలో ఫోర్త్ వేవ్ కు అవకాశం లేదని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. రోజుకు 20-25 కేసులు నమోదవుతున్నాయన్నారు. ప్రజల్లో 97శాతం యాంటీబాడీస్ గుర్తించామన్నారు. థర్డ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. మాస్క్ తప్పనిసరి అని, మాస్క్ లేకుంటే రూ. వెయ్యి ఫైన్ ఉంటుందన్నారు. ఫంక్షన్లు, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
*డిప్యూటేషన్‌పై హైకోర్టులో పనిచేస్తున్న అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ ఉద్యోగులను..GADకి కేటాయించేందుకు ప్రభుత్వం యత్నించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తమను సంప్రదించకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ప్రక్రియపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
*ఒంగోలులో సీఎం జగన్ పర్యటన సందర్భంగా ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం గంటల తరబడి వాహనాలను నిలిపివేశారు. తాజాగా సీఎం ఒంగోలు పర్యటన క్రమంలో అధికారుల అత్యుత్సాహం వివాదాస్పదమవుతోంది.ఒంగోలులో శుక్రవారం సీఎం జగన్ పర్యటన.. చిరు వ్యాపారులకు సంకటంగా మారింది. ముఖ్యమంత్రి పర్యటించే రోడ్డు మార్గంలో రెండు కి.మీ. మేర చిరు వ్యాపారుల షాపులను అధికారులు తొలగించడం దుమారం రేపుతోంది. గంట పర్యటన కోసం తమ పొట్ట కొడుతారా? అంటూ చిరు వ్యాపారులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మూడో విడత వైఎస్సార్ సున్న వడ్డీ పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం ఒంగోలు రానున్నారు. దీంతో అధికారుల ఉత్యుత్సాహం వివాదాస్పమవుతోంది. చిరు వ్యాపారుల షాపులనే కాదు.. ఇళ్లముందు ఉన్న అరుగులు, రేకులను సయితం ప్రొక్లెన్లతొ తొలగించారు. సీఎం జగన్ పర్యటనలో సెక్యూరిటీ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే తొలగించామంటూ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు.
* తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదుకు ఎలాంటి ఇబ్బంది లేదని టీ-టీడీపీ అధ్యక్షులు బక్కని నర్శింహులు తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… అన్ని రకాలుగా పదవులు అనుభవించిన తెలంగాణ నేతలు.. కాళ్లకు బుద్ధి చెప్పి వెళ్లిపోయారని విమర్శించారు. టీటీడీపీలో ఉన్న నేతలందరం.. బుర్రకు బుద్ధి చెప్పి సభ్యత్వం చేపడతామని తెలిపారు. తెలంగాణలో ఎక్కడ చూసినా చంద్రబాబు చేసిన అభివృద్ధే కనిపిస్తోందన్నారు. తెలంగాణలో ఎంత మంది టీడీపీ నేతలు అధికారంలోకి వస్తారనే ఆలోచనతో కాకుండా ప్రజలకు ఎంత సేవ చేస్తామనే భావనతో పార్టీ కోసం పని చేస్తామని బక్కని నర్సింహులు పేర్కొన్నారు
*శ్రీవారి దర్శనానికి వినుకొండ నుంచి కుటుంబంతో కారులో వెళుతుంటే ఒంగోలులో పోలీసులు తన కారును ఆపారని శ్రీనివాస్ అనే వ్యక్తి మీడియాకు చెప్పారు. సీఎం పర్యటన పేరుతో తన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారన్నారు. రాత్రి సమయం కావడంతో భద్రత కోసం ఆర్టీసీ డిపోలో తలదాచుకున్నామని, మరో వాహనం ఏర్పాటు చేసుకుని తిరుమలకు వచ్చామని శ్రీనివాస్ తెలిపారు.
* ఒంగోలులో సీఎం జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ముఖ్యమంత్రి కాన్వాయి కోసం రోడ్డుపై వెళ్తున్న కార్లను పోలీసులు బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారు. వినుకొండ నుంచి తిరుమల దర్శనానికి వెళ్తున్న శ్రీనివాస్ కారుని పోలీసులు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. అర్థరాత్రి పిల్లలతో ఇబ్బంది పడతామని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో అర్థరాత్రి రోడ్డుపై శ్రీనివాస్ కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంది. పోలీసుల తీరుతో చేసేది లేక శ్రీనివాస్ కుటుంబం వెనక్కి వెళ్లిపోయింది.
*హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో వర్షం పడింది. వనస్థలిపురంహయత్‌నగర్‌లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. యూసఫ్‌గూడపంజాగుట్టజూబ్లీహిల్స్‌ఫిల్మినగర్‌మాదాపూర్‌కొండాపూర్‌హైటెక్‌సిటీ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. పగటిపూట వేసవి తీవ్రత దారుణంగా ఉంటుండగా… సాయంత్రం వేళ వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉదయమంతా ఉష్ణోగ్రతల ప్రభావంతో… ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సాయంత్రం పూట గాలీవాన బీభత్సంతో ఇబ్బందులు పడుతున్నారు.
* నీటిపారుదలశాఖలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పదవీ విరమణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ విభాగాల్లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల వయసు 61 ఏళ్లు నిండితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించరాదని నిర్ణయించింది. ఇందుకు ఉద్యోగుల జనన ధ్రువీకరణ పత్రాలనే ప్రామాణికంగా తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు జనన ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టాలని ఏజెన్సీలను ఆదేశిస్తూ ఈఎన్‌సీ (అడ్మిన్) జి.అనిల్‌కుమార్ బుధవారం నీటి పారుదల శాఖ విభాగాలకు లేఖ రాశారు. కాగా, టెండర్ల ధరలను ఖరారు చేయడానికి వీలుగా అందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే అందజేయాలని నీఈఎన్‌సీ (అడ్మిన్) జి.అనిల్‌కుమార్.. క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు.
*గణేశ్ విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ) వినియోగాన్ని పూర్తిగా నిషేధించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పీవోపీ అసలు వాడకపోతే వ్యాపారం చేయలేమని, తమ హక్కులను రక్షించాలని పేర్కొంటూ తెలంగాణ గణేశ్ విగ్రహ కళాకారుల సంక్షేమ సంఘం, మరికొన్ని సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినందన్‌కుమార్ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. పీవోపీ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయని తెలిపింది. దీనిపై తాము ఉపశమనం ఇవ్వలేమని పేర్కొంది.
*పాతబస్తీలో విద్యుత్తు బకాయిలు వసూలు చేసే దమ్ము టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఉందా? అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే.లక్ష్మణ్ ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీ అనుమతిస్తేగానీ పాతబస్తీలో అడుగు పెట్టలేని పరిస్థితి టీఆర్‌ఎ్‌సదని ఆయన విమర్శించారు. దారుస్సలాం ఆదేశాలను పాటించే టీఆర్‌ఎ్‌సకు బీజేపీని విమర్శించే స్థాయి లేదన్నారు. ఓల్డ్ సిటీలో కనీసం తనిఖీలు చేపట్టే దమ్మువారికి లేదన్నారు. పోలీసులు, అధికారులపై ఎంఐఎం దాడులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ‘‘భద్రాద్రి రాముడి పేరు పెట్టుకున్న కేటీఆర్.. ఏనాడైనా స్వామి వారికి పట్టు వస్ర్తాలు సమర్పించారా?.. చార్మినార్ వద్ద ఉన్న మసీదుకు వెళ్లిన ఆయన.. ఏనాడైనా అక్కడే ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారా?.. భైంసాలో జరిగిన దాడులపైన సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడరు?’’ అని లక్ష్మణ్ మండిపడ్డారు.
* రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు మాయమవుతున్నాయని, కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను సకాలంలో ఇవ్వకుండా.. రైతుల ధాన్యంతో మిల్లర్లు వ్యాపారం చేస్తున్నారని వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. తెలంగాణలోని రైస్ మిల్లుల్లో ఎఫ్‌సీఐ ద్వారా విస్తృతంగా తనిఖీలు జరుపుతోంది. ఇందులో భాగంగా మార్చి 22 నుంచి 30 వరకు రాష్ట్రంలోని 3278 మిల్లుల్లో 2020-21 వానాకాలం, యాసంగి సీజన్ల నిల్వలపై ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇప్పటికి 958 మిల్లుల్లో తనిఖీలు పూర్తి కాగా, 883 మిల్లుల్లో నిల్వలు సరిగ్గానే ఉన్నాయని తేలింది. 40 మిల్లుల్లో మాత్రం నిల్వలు తక్కువగా ఉన్నాయని, 35 మిల్లుల్లో ఎక్కువగా ఉన్నాయని తనిఖీ బృందాలు తేల్చాయి. 40 మిల్లుల్లో కలిపి మొత్తం 4,53,896 బస్తాల ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించామని మార్చి 31న ఎఫ్‌సీఐ.. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
*సోనియా, రాహుల్ గాంధీలు తెలంగాణ రాష్ట్రాన్ని బహుమతిగా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రాష్ట్రం నుంచి 15 ఎంపీ సీట్లను తిరిగి గిఫ్టుగా ఇద్దాం. ఇందుకోసం రాష్ట్ర ప్రజలు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కష్టపడాలి’’ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. మే 6న వరంగల్‌లో జరిగే రాహుల్‌గాంధీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సుమారు 5 లక్షల మందితో సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గాంధీభవన్‌లో బుధవారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పనికిమాలిన మాటలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజల్ని రెచ్చగొడుతుంటే.. కేసీఆరేమో తియ్యటి మాటలతో ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, టీఆర్‌ఎ్‌సలు కలిసి రైతుల పొట్ట కొట్టాయని ధ్వజమెత్తారు.
*ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూముల సమస్యలను పరిష్కరించిన ఘనత కేవలందివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం పేర్కొన్నారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం 61వ రోజుకు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర పరిఽధిలోని లక్ష్వీదేవిపల్లిలో ప్రారంభమైన యాత్ర, ఉయ్యాలబాడవ, జోగ్యాతండా, గేట్‌తండా మీదుగా కరకవాగుకు చేరకుంది. అక్కడ జరిగిన రైతుగోస దీక్షలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 1.90 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు. ‘‘ఆయన తర్వాత మరే ముఖ్యమంత్రీ ఒక్క ఎకరాకు కూడా పట్టా ఇవ్వలేకపోయారు.
*ఇనిస్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా(ఐటీపీఐ) తెలంగాణ చాప్టర్ చైర్మన్‌గా కొమ్ము విద్యాధర్ రెండోసారి ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం డీటీసీపీ విభాగానికి సంచాలకుడిగా, రేరా అథారిటీ సభ్యకార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఐటీపీఐ సెక్రటరీగా కృష్ణ ప్రసాద్, ట్రెజరర్‌గా నర్సింహా రాములు, బిల్డింగ్ కమిటీ చైర్మన్‌గా సత్యనారాయణమూర్తి ఎన్నికయ్యారు.
* కింగ్‌కోఠి నజ్రీబాగ్ ప్యాలెస్ వ్యక్తులకు సంబంధించినదికాదని, అది యావత్ తెలంగాణ ప్రజల ఆస్తి అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంఆర్‌జీ.వినోద్‌రెడ్డి చెప్పారు. హిమాయత్‌నగర్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేట్ వ్యక్తులు దీనిని కొనుగోలు చేసినట్లు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. తెలంగాణ వారసత్వ ఆస్తి అయిన కింగ్‌కోఠి ప్యాలె్‌సను ప్రజల ఆస్తిగా ప్రభుత్వం గుర్తించాలన్నారు.
*వివిధ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షల్లో అభ్యర్థులు నింపే ఓఎంఆర్ షీట్లను ఆన్‌లైన్‌లో ఉంచాలని తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎ్‌సపిఎ్‌ససీ) నిర్ణయించింది. గ్రూపు-1తో పాటు గ్రూపు-2, 3, 4 వంటి ఉద్యోగాల భర్తీలో కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు. ప్రశ్నపత్రాలకు సంబంధించిన కీతో పాటు, అభ్యర్థులు నింపే ఓఎంఆర్ షీట్లను ఆన్‌లైన్‌లో ఉంచడం ద్వారా నియామకాలను మరింత పారదర్శకంగా నిర్వహించడానికి వీలుంటుందని భావిస్తున్నారు. దాంతోపాటు అభ్యర్థుల నుంచి వచ్చే వివిధ అభ్యంతరాలను కూడా ముందుగానే పరిష్కరించినట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు వివిధ పోస్టులను భర్తీ చేయడానికి టీఎ్‌సపీఎస్సీ కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 503 గ్రూపు-1 పోస్టులకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. తర్వాత మిగిలిన పోస్టుల భర్తీ కోసం వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేస్తారు.
*ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో బుధవారం ఈ పోటీలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్న 700ల టీమ్‌లకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించి అందులో 40టీంలను ప్రత్యక్ష క్విజ్‌కు ఎంపికచేశామన్నారు. వీరిలో కొందరు క్వార్టర్ ఫైనల్స్‌కు ఎంపికయ్యారు. 22వ తేదీన ఫైనల్ పోటీలు జరుగుతాయని, విజేతల్లో తొలి నాలుగు జట్లకు వరుసగా.. రూ.లక్ష రూ.60వేలు, రూ.30వేలు, రూ.10వేల చొప్పున నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు ఇస్తామన్నారు. మరోవైపు ఇన్నోవేషన్‌లో బహుమతులు, సామాజిక సేవలోనూ బహుమతులు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు.
*వ్యక్తిగత బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు వినియోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి సవరణ చేసింది. ఇప్పటికే పేద రైతుల భూముల అభివృద్ధి, ఇంటి నిర్మాణాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పండ్లతోటల పెంపకం తదితర పలు రకాల పనులకు ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధులు వినియోగించుకునే అవకాశముంది. తాజాగా పేద మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించే బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి కూడా ఈ నిధులు వాడుకోవచ్చని పేర్కొంది. అదే విధంగా ఏదైనా ఉమ్మడి అవసరాల కోసం వేతనాల(వేజ్ కాంపోనెంట్)ను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
*60 కిలోమీటర్ల పరిధిలో ఒకటికి మించి టోల్ గేట్లు ఉంటే.. అదనంగా ఉన్న వాటిని ఎత్తివేస్తామన్న కేంద్రం ప్రకటనతో ఒనగూరేదేమీ లేదని తేలిపోయింది. ఎన్‌హెచ్ అధికారులకు కేంద్రం నుంచి తాజాగా వచ్చిన మౌఖిక ఆదేశాల ప్రకారం 60 కిలోమీటర్ల పరిధిలో రెండు టోల్‌గేట్లు ఉంటే ఒకటి ఎత్తివేసి.. రెండింటి చార్జీలను ఉన్న ఒక్క టోల్‌ప్లాజా నుంచే వసూలు చేయాలని నిర్దేశించడం గమనార్హం. ఎన్టీఆర్ జిల్లాలో ఎన్‌హెచ్-65, కృష్ణా జిల్లాలో ఎన్‌హెచ్ 16పై 60 కిలోమీటర్ల పరిధిలో రెండేసి టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఎన్‌హెచ్-65పై కీసర వద్ద స్వర్ణ, చిల్లకల్లు దగ్గర జీఎంఆర్ టోల్‌ప్లాజాలు నడుస్తున్నాయి. విజయవాడ నగరం నుంచి కీసర టోల్‌ప్లాజా 46.3 కిలోమీటర్లు, చిల్లకల్లు టోల్ ప్లాజా 78.1 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
*ఎయిడెడ్ కళాశాలల లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు, బోధనేతర సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసుకునేందుకు వీలుగా విద్యాశాఖలో సూపర్ న్యూమరరీ పోస్టులను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల విలీనం, ఆయా కళాశాలల్లోని సిబ్బంది విలీనానికి గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీనిపై వ్యతిరేకత రావడంతో ఇష్టం ఉన్న విద్యాసంస్థలు, సిబ్బందే విలీనం కావొచ్చంటూ సవరణ ఉత్తర్వులు జారీచేసింది. దీనిలో భాగంగా 125 ఎయిడెడ్ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలు తమ దగ్గర పనిచేస్తున్న 895 మంది బోధన సిబ్బంది, 1,120 బోధనేతర సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అంగీకరించాయి. దీంతో వారంతా ప్రభుత్వానికి జాయినింగ్ లేఖలు ఇచ్చారు. అయితే, ఇలా విలీనమైన సిబ్బందికి ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న ఖాళీల మేరకు పోస్టింగ్‌లు కల్పించారు.
* ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రానున్న ఐదేళ్లలో రూ.350 కోట్ల పెట్టుబడులతో వంట గ్యాస్, నేచురల్ గ్యాస్ సరఫరా ప్రాజెక్టులు స్థాపించేందుకు అదానీ గ్యాస్ అండ్ ప్రథమ్ (ఏజీ అండ్ పీ) సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో ప్రతి ఇంటికీ గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటు చేయడంతోపాటు జిల్లాలోని వాహనాలకు సరిపడా గ్యాస్ స్టేషన్లను ఏర్పాటు చేసి 400 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఏజీ అండ్ పీ కంపెనీ నెల్లూరు జిల్లా ప్రాంతీయ అధికారి చిరాగ్ భన్వాడియా తెలిపారు.
* రాష్ట్రంలో ద ళితులపై దాడులు అధికమయ్యాయని, దాడులు చేసిన వారిని అరెస్టు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం.విక్టర్ ప్రసాద్ విమర్శించారు. కాకినాడలో బుధవారం ఆయన మాట్లాడారు. దాడులు జరిగిన వెంటనే నిందితులను అరెస్టు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారన్నారు. దీన్ని ఎట్టిపరిస్థితుల్లో కమిషన్ సహించబోదని హెచ్చరించారు. ఇటువంటి అధికారులను వదిలే ప్రసక్తే లేదన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా దళితులు ర్యాలీ చేస్తుండగా అగ్రవర్ణాలు దాడి చేసిన కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలన్నారు.
*ఎయిడెడ్ కళాశాలల లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు, బోధనేతర సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసుకునేందుకు వీలుగా విద్యాశాఖలో సూపర్ న్యూమరరీ పోస్టులను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల విలీనం, ఆయా కళాశాలల్లోని సిబ్బంది విలీనానికి గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీనిపై వ్యతిరేకత రావడంతో ఇష్టం ఉన్న విద్యాసంస్థలు, సిబ్బందే విలీనం కావొచ్చంటూ సవరణ ఉత్తర్వులు జారీచేసింది. దీనిలో భాగంగా 125 ఎయిడెడ్ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలు తమ దగ్గర పనిచేస్తున్న 895 మంది బోధన సిబ్బంది, 1,120 బోధనేతర సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అంగీకరించాయి. దీంతో వారంతా ప్రభుత్వానికి జాయినింగ్ లేఖలు ఇచ్చారు. అయితే, ఇలా విలీనమైన సిబ్బందికి ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న ఖాళీల మేరకు పోస్టింగ్‌లు కల్పించారు.
*వార్షిక మహానాడు సమావేశాలను ఈసారి రెండు రోజులకు పరిమితం చేయాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తోంది. ఈసారి మహానాడును మే నెలాఖరులో ఒంగోలులో నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రతిసారి మహానాడు సమావేశాలకు ఏడెనిమిది వేల మంది ప్రతినిధులు హాజరు కావడం అనవాయితీగా జరుగుతోంది. ఏటా మూడు రోజులపాటు దీనిని నిర్వహించేవారు. కాని ఒంగోలు నగరంలో ప్రతినిధుల బసకు అవసరమైన సౌకర్యాలు పరిమితంగా ఉండటంతో ఈసారి రెండు రోజులు మాత్రమే నిర్వహించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. తొలి రోజు మే 27న ప్రతినిధుల సభ నిర్వహిస్తారు. దీనికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 4,000కు మించకుండా ప్రతినిధులను ఆహ్వానించాలని నిర్ణయించారు. రెండో రోజు మే 28న మహానాడు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులంతా హాజరయ్యేలా విస్తృత స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు.
*దళిత బాలికను వివిధ ప్రాంతాలు తిప్పుతూ, వ్యభిచారం చేయించిన ఘటన అప్పట్లో ఎంత కలకలం రేపిందో.. ఆ కేసును పోలీసులు ఛేదిస్తున్న విధానమూ అంతే సంచలనంగా మారింది. బంగారం, బాండ్లు, ప్రా మిసరీ నోట్లు సైతం చేతులు మారి.. రెండు రా ష్ట్రాల్లో అల్లుకున్న కేసు ఇది. 80మందిని నిందితులుగా తేల్చి ఇప్పటివరకు 74మందిని ఈ కేసులో గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు. ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖుల పిల్లలు నిందితులుగా ఉన్నారు. మొత్తం దందాను ఓ మహిళా హోంగ ార్డు, ఆమె కుమార్తె బెజవాడ కేంద్రంగా నడిపించినట్టు తేలడం దిగ్ర్భాంతికర అంశం. లండన్‌లో ఉంటున్న మరో నిందితుడికి రెడ్‌కార్నర్ నోటీసు లు జారీ అయ్యాయి. గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీ్‌సస్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు మాయమాటలు చెప్పి వ్యభిచా ర నిర్వాహకుల ముఠా వ్యభిచార రొంపిలోకి దిం చింది. బాలికను నిర్వాహకులు ఒకరి తర్వాత ఒక రు కొనుగోలు చేస్తూ వివిధ ప్రాంతాలకు తిప్పి వ్యభిచారం చేయించారు. విజయవాడ, తణుకు, ఏలూరు, తాడేపల్లిగూడెం, ఒంగోలు, నెల్లూరు, హైదరాబాద్‌లలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిలో విజయవాడలోని ఇబ్రహీంపట్నం కు చెందిన మహిళా హోంగార్డు జెసింత, ఆమె కుమార్తె హేమలత ముఖ్య పాత్ర పోషించారు.
*రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,62,216 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. ఈ ఏడాది జూన్‌కల్లా 1.34 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందచేస్తాం. ఈ ఏడాది డిసెంబరు చివరికల్లా నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం’’ అని పురపాలక మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. బుధవారం అమరావతి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ముందుగా అసంపూర్తిగా ఉన్న మౌలిక వసతుల కల్పనను పూర్తి చేస్తామన్నారు. ‘‘గత ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చి ఎన్నికల ముందు వరకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయలేదు, పట్టించుకోలేదు. ఎన్నికల కోసం మౌలిక సదుపాయాల కల్పనను 10 శాతం మాత్రమే పూర్తి చేసింది. గత ప్రభుత్వం రూ.3,082 కోట్ల అప్పులను మాత్రమే ఇచ్చింది. ఓవైపు రుణాలు తీరుస్తూ లబ్ధిదారులకు అదనపు ప్రయోజనాలు కల్పింపజేసేలా పథకాన్ని రూ.4,287 వేల కోట్లతో విస్తరిస్తున్నాం. ఒక్క రూపాయికే 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. 365 చదరపు గజాల ఇళ్లకు లబ్ధిదారుల వాటాను రూ.25 వేలకు, 430 చదరపు గజాల ఇళ్లకు లబ్ధిదారుల వాటాను రూ.50 వేలకు పరిమితం చేస్తున్నాం.
*సింహాద్రి సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీపీసీ)లోని 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగో యూనిట్‌లో ఉత్పత్తిని బుధవారం పునరుద్ధరించారు. ఈ యూనిట్‌లోని పైప్‌లైన్‌లో ఫ్లైయాష్ నిలిచిపోవడంతో మంగళవారం తెల్లవారుజామున ఉత్పత్తి నిలిపివేసిన విషయం తెలిసిందే.