* వరంగల్ నగరంలో ప్రేమోన్మాది అజార్ ఘాతుకానికి తెగబడ్డాడు. కాకతీయ వర్శిటీ విద్యార్థిని అనూషపై దాడి చేశాడు. కత్తితో విద్యార్థిని గొంతు కోశాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. లక్నేపల్లికి చెందిన యువతి కాకతీయ వర్శిటీలో ఎంసీఏ చదువుతోంది. కొంతకాలంగా ప్రేమ పేరుతో ఆ యువతిని ఉన్మాది వేధిస్తున్నాడు. శుక్రవారం ఉదయం యువతి ఇంటికి వెళ్లి కత్తితో ఆమెపై దాడి చేశాడు.విద్యార్థిని అనూష ఇంట్లో ఉండగా ఉన్మాది అజార్ ఆమె బెడ్ రూంలోకి వెళ్లి కత్తితో గొంతు కోసి పరారయ్యాడు. దీంతో ఆమెను కుటుంబసభ్యులు హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం తెలిసిన వర్శిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అలాగే ప్రజా సంఘాల నేతలు కూడా ఆస్పత్రికి వచ్చారు. ఉన్మాది చర్యపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోవడంతోనే మళ్లీ మళ్లీ జరుగుతున్నాయని ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు. కాగా నిందితుడు అజార్ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి
*గుజరాత్లో మరోమారు భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో 260 కిలోల హెరాయిన్ను పట్టుకున్నారు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.1,300 కోట్లు ఉంటుందని తెలిపారు. కచ్ జిల్లాలోని కండ్లా పోర్టుకు సమీపంలో ఉన్న కంటెయినర్ స్టేషన్లో తనిఖీలు నిర్వహించగా ఓ కంటెయినర్లో భారీగా డ్రగ్స్ వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు.
*గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరులోని ఓ ఆయిల్ కంపెనీలో ప్రమాదం జరిగింది. కంపెనీలో ఒక్కసారి సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా… మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
*సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ మండలం నెరడిగుంట ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఒకటవ తరగతి విద్యార్థి(సృజన్)ను ప్రధానోపాధ్యాయురాలు పారిజాతం చెప్పుతో కొట్టారు. తరగతి గదిలో విద్యార్థి అల్లరి చేస్తూ పరీక్షలు సరిగ్గా రాయడం లేదంటూ విద్యార్థిపై ప్రధానోపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన విద్యార్థి కుటుంబీకులు… ప్రధానోపాధ్యాయురాలిని నిలదీశారు. ఈ ఘటనపై ఆందోల్ మండల ఎంఇఓ, డిఇఓకు విద్యార్థి తండ్రి వీఆరోఓ వినోద్ ఫిర్యాదు చేశారు. అయితే పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థిని చెప్పుతో కొట్టిన వ్యవహారాన్ని మండల విద్యాశాఖ అధికారి ఎంఇఓ కృష్ణ పట్టించుకోలేదు. ఎంఇఓ తీరుపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
*వరంగల్ నగరంలో ప్రేమోన్మాది అజార్ ఘాతుకానికి తెగబడ్డాడు. కాకతీయ వర్శిటీ విద్యార్థిని అనూషపై దాడి చేశాడు. కత్తితో విద్యార్థిని గొంతు కోశాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. లక్నేపల్లికి చెందిన యువతి కాకీయ వర్శిటీలో ఎంసీఏ చదువుతోంది. కొంతకాలంగా ప్రేమ పేరుతో ఆ యువతిని ఉన్మాది వేధిస్తున్నాడు. శుక్రవారం ఉదయం యువతి ఇంటికి వెళ్లి కత్తితో ఆమెపై దాడి చేశాడు.
*ద్విచక్రవాహనంపై భార్యా భర్తలు, ముగ్గురు పిల్లలు వెళుతున్నారు. దారిలో ఆ బైక్ ఓ ఫ్లై ఓవర్ ఎక్కింది. ఆ సమయంలో వెనుక నుంచి మితిమీరిన వే గంతో దూసుకొచ్చిన ఓ కారు, బైక్‌ను ఢీకొట్టింది. అంతే.. బైక్‌పై ప్రయాణిస్తున్న ఐదుగురిలో భర్త అక్కడికక్కడే మృతిచెందాడు. మిగతా నలుగురు ఫ్లై ఓవర్ నుంచి ఎగిరి 40 అడుగుల కింద రోడ్డు మీద పడ్డారు. అంతెత్తు నుంచి నేలకు బలంగా తాకడం తో తీవ్ర గాయాలై భార్య, ఓ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో గురువారం రాత్రి ఈ ఘోరం జరిగింది.
*అడవి పందుల నివారణ కోసం అమర్చిన ఆ వైరే ఆ యువ రైతు పాలిట శాపంగా మారింది. ఇప్పుడిప్పుడే వ్యవసాయ రంగంలో రాణిస్తున్న ఆ రైతుకు అప్పుడే నూరేళ్లు నిండాయి. వివరాల్లోకి వెళ్లితే.. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం జామిడి గ్రామానికి చెందిన కమలాకర్‌రెడ్డి (27) అనే యువ రైతు గురువారం ఉదయం తమ జొన్న చేనులోకి నీళ్లు పెట్టడానికి వెళ్లాడు. అక్కడ అడవి పందుల కోసం అమర్చిన వైరును తాకి విద్యుత్ షాక్ తగలడంతో ఆ రైతు అక్కడే మృతి చెందాడు. వ్యవసాయ రంగంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న కమలాకర్‌రెడ్డి మృతి పట్ల కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. కమలాకర్‌రెడ్డికి ఇటీవలే బాబు జన్మించినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ధనుశ్రీ పేర్కొన్నారు.
*మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పట్టపగలు టీఆర్‌ఎస్ వార్డు కౌన్సిలర్ దారుణ హత్యకు గురయ్యారు. ద్విచక్రవాహనంపై వెళుతుండగా పక్కా పథకం ప్రకారం దుండగు లు ట్రాక్టర్‌తో ఢీ కొట్టించి.. గొడ్డలి, తల్వార్‌తో నరికి అత్యంత కిరాతకంగా చంపారు. హతుడు మహబూబాబాద్‌లోని 8వ వార్డు కౌన్సిలర్, బాబూనాయక్ తండా వాసి బానోత్ రవి నాయక్ (35). గురువారం ఉదయం 11:30 గంటలకు పత్తిపాక ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. రాజకీయ విభేదాలే ఈ హత్యకు కారణం అని, ఈ ఘటన వెనుక స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ హస్తం ఉందని రవి నాయక్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే వ్యాపార కక్షలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య ఘటనలో ప్రధాన నిందితులుగా భావిస్తున్న మంగలి కాలనీకి చెందిన భూక్య విజయ్, బాబునాయక్ తండాకు చెందిన భూక్య అరుణ్‌ను దేఏ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను, వాహనాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
*తనను ప్రేమించి పెళ్లి చేసుకోకుండా మరొకరిని వివాహం చేసుకుంటున్నాడని ఓ యువతి తన బంధువులతో కలిసి వరుడి పెళ్లి వేడుక వద్ద గురువారం ఆందోళనకు దిగింది. భద్రాద్రి జిల్లా ఇల్లెందులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. ఇల్లెందుకు చెందిన రవి అనే వ్యక్తికి రెండేళ్ల క్రితం ఏపీలోని కొవ్వూరుకు చెందిన సుజాత అనే యువతి పరిచయమైంది. తరువాత ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకు న్నారు. అయితే కొంతకాలం తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో సుజాత కొవ్యూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ కేసుపై కొవ్వూరు కోర్టులో విచారణ సాగుతోంది. కానీ కేసు విచారణ పూర్తి కాకుండానే రవి ఇల్లెందుకే చెందిన శిరీష అనే యువతితో వివాహనిశ్చయం చేసుకున్నాడు.
*మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పట్టపగలు టీఆర్‌ఎస్ వార్డు కౌన్సిలర్ దారుణ హత్యకు గురయ్యారు. ద్విచక్రవాహనంపై వెళుతుండగా పక్కా పథకం ప్రకారం దుండగు లు ట్రాక్టర్‌తో ఢీ కొట్టించి.. గొడ్డలి, తల్వార్‌తో నరికి అత్యంత కిరాతకంగా చంపారు. హతుడు మహబూబాబాద్‌లోని 8వ వార్డు కౌన్సిలర్, బాబూనాయక్ తండా వాసి బానోత్ రవి నాయక్ (35). గురువారం ఉదయం 11:30 గంటలకు పత్తిపాక ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.
*విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. రెండు రోజుల పాటు ఓ యువతిపై ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు సిబ్బంది ఉన్నారు. మానసిక స్థితి సరిగా లేని ఓ యువతిని పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో ఓ ఉద్యోగి దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని, తాను పనిచేసే ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఎవరికీ తెలియకుండా ఆస్పత్రికి రప్పించి ఓ చిన్న గదిలో ఉంచాడు. ఆ యువకుడు, తోటి ఉద్యోగి, ఉద్యోగి స్నేహితుడు ముగ్గురూ ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
* తిరువళ్లూర్ సమీపంలో ఏడాదిగా ప్లస్ వన్ విద్యార్థినిని బెదిరించి అత్యాచారం చేసి గర్భవతిని చేసిన వృద్ధుడిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. సెంజి గ్రామం మేలాండై వీధికి చెందిన పరశురామన్‌కు (63) ఆ ప్రాంతంలో జామతోట ఉంది. ఈ తోటలో జామకాయలు కోసేందుకు ఓ విద్యార్థిని వస్తుండేంది. తండ్రి మృతిచెందడంతో తల్లితో ఆ బాలిక ఉంటోంది. ఈ నేఫధ్యంలో, ఏడాది క్రితం బాలికకు మాయమాటలు చెప్పిన పరశురామన్ ఆమెపై అత్యాచారానికి పాల్పడి, ఈ విషయమై బయటకు చెబితే చంపుతానని బెదిరించాడు. అనంతరం బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో, బాలిక పొట్ట ఉబ్బెత్తుగా ఉండడం చూసి తల్లి ఆమెను నిలదీయగా జరిగిన విషయం తెలుసుకొని దిగ్ర్భాంతి చెందింది. ఈ విషయమై బాలిక తల్లి తిరువళ్లూర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేయడంతో సీఐ లోకేశ్వరి విచారణ చేపట్టి పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి పరశురామన్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
*కశ్మీర్‌లోని హైదర్‌బోరా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పళ్ళిపట్టుకు చెందిన సీఆర్‌పీఎఫ్ జవాను మృతి చెందారు. తిరువళ్లూరు జిల్లా పళ్ళిపట్టు సమీపంలోని అత్తిమాంజేరికి చెందిన ఎంఎస్ మణి సెంట్రల్ రిజర్వు పోలీసుదళంలో జమ్ముకశ్మీర్‌లో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎస్ మణి సహా 12 మంది జవాన్లు శ్రీనగర్ నుంచి ఓ బస్సులో వెళుతుండగా హైదర్‌బోరా వద్ద అదుపుతప్పిన లారీ ని ఢీకొంది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన మణిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స ఫలించక మృతి చెందారు. తక్కిన జవాన్లు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మణి మృతి చెందినట్లు సమాచారం అందటంతో అత్తిమాంజేరిలోని ఆయన కుటుంబీకులు బోరున విలపించారు. మణి భౌతికకాయాన్ని వీలయినంత త్వరగా స్వస్థలానికి చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. సీఆర్‌పీఎఫ్ దళంలో పనిచేస్తున్న తమిళ జవాను మణి మృతిపట్ల పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు అన్బుమణి రాందాస్ తీవ్ర సంతాపం ప్రకటించారు. దేశాన్ని కాపాడేందుకు సేవలందిస్తున్న మణి ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడటం దిగ్ర్భాంతి కలిగిస్తోందని ఓ ప్రకటన జారీ చేశారు.
*అడవి పందుల నివారణ కోసం అమర్చిన ఆ వైరే ఆ యువ రైతు పాలిట శాపంగా మారింది. ఇప్పుడిప్పుడే వ్యవసాయ రంగంలో రాణిస్తున్న ఆ రైతుకు అప్పుడే నూరేళ్లు నిండాయి. వివరాల్లోకి వెళ్లితే.. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం జామిడి గ్రామానికి చెందిన కమలాకర్‌రెడ్డి (27) అనే యువ రైతు గురువారం ఉదయం తమ జొన్న చేనులోకి నీళ్లు పెట్టడానికి వెళ్లాడు. అక్కడ అడవి పందుల కోసం అమర్చిన వైరును తాకి విద్యుత్ షాక్ తగలడంతో ఆ రైతు అక్కడే మృతి చెందాడు. వ్యవసాయ రంగంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న కమలాకర్‌రెడ్డి మృతి పట్ల కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. కమలాకర్‌రెడ్డికి ఇటీవలే బాబు జన్మించినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ధనుశ్రీ పేర్కొన్నారు.
*కర్నూలు జిల్లాలో గురువారం రెండు చోట్ల పిడుగు పడి నలుగురు మృతి చెందారు. హొళగుంద మండలం వందవాగిలి గ్రామానికి చెందిన బోయ పెద్ద తాయన్న (26), కురువ చంద్రన్న (26) స్నేహితులు. చంద్రన్న తన పొలాన్ని చదును చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ సిద్దప్పకు భోజనం ఇచ్చేందుకు తాయన్నతో కలిసి బైక్‌పై సాయంత్రం నాలుగు గంటల సమయంలో పొలానికి వెళ్లాడు. వర్షం కురుస్తుండడంతో స్నేహితులిద్దరూ పొలం పక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్లారు. సెల్‌ఫోన్ చూస్తుండగా చెట్టుపై పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందారు.
*నంద్యాల జిల్లా మహానంది మండలం చలమ అటవీరేంజ్ పరిధిలో అనుమానా స్పందంగా సంచరిస్తున్న 15 మంది ఎర్రచందనం కూలీలను అరెస్ట్ చేసినట్లు మహానంది ఎస్‌ఐ నాగార్జునరెడ్డి గురువారం తెలిపారు. తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలైకు చెందిన 14 మంది ఎర్రచందనం కూలీలతోపాటు తిరుపతికి చెందిన మరో కూలీని అరెస్ట్ చేసి వీరి నుంచి నాలుగు ఎర్రచందనం దుంగలతోపాటు పది గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితులను కోర్టుకు హాజరుపర్చినట్లు చెప్పారు. కాగా ఎర్రచందనం తరలింపులో ప్రధాన సూత్రధారి ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన ప్రధాన స్మగ్లర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఐ చెప్పారు.
*పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక పోవడంతో మనస్తాపానికి గురైన ఓ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. తిరుపతి రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారిపల్లెకు చెందిన నాగరాజు రెండో కుమార్తె ఎన్.హిమబిందు తిరుపతి పద్మావతి పాలిటెక్నిక్‌లో బీఎస్సీ నర్సింగ్ చివరి సంవత్సరం చదువుతూ.. హాస్టల్లో ఉంటున్నారు. బుధవారం వెలువడిన మూడో సంవత్సరం ఫలితాల్లో ఆమె అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిలయ్యారు. దీంతో ఆ రోజంతా బాధపడుతూ గడిపిన ఆమెను హిమబిందు అక్క వచ్చి ఓదార్చి వెళ్లారు. అయినా కుదుటపడని ఆమె గురువారం సాయంత్రం పాలిటెక్నిక్‌కు సమీపంలోనే ఉన్న రైల్వేట్రాక్‌పై నిలబడితల్లిదండ్రులకు ఫోన్‌చేసి మాట్లాడారు. అనంతరం వచ్చిన రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదుచేసిదర్యాప్తు చేస్తున్నారు.