ఖమ్మంలో భాజపా కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య కేసులో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.ఆయనతో పాటు కేంద్ర హోంశాఖ, ఖమ్మం సీపీ, త్రీటౌన్ ఎస్‌హెచ్‌వో, సీబీఐ, ఖమ్మం తెరాస నేత ప్రసన్న కృష్ణ, సీఐ సర్వయ్యకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. న్యాయవాది కె.కృష్ణయ్య దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. సాయి గణేశ్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరపాలని పిటిషనర్ ధర్మాసనాన్ని కోరారు. రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశించిన హైకోర్టు.. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.