* కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ భూస్థాపితమేనని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. శుక్రవారం రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, ఎగ్గే మల్లేశంతో కలిసి టీఆర్‌ఎల్పీ కార్యాలయంలో మీడితో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరంగల్‌లో నిన్న రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి.. తెలంగాణను హేళన చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ధీనమైన స్థితిలో ఉందని, ఆ పార్టీ శవయాత్ర జరుగుతోందన్నారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో తెలిసిందన్నారు. రేవంత్ బీజేపీలో ఉన్న సమయంలో ఆ పార్టీ లేవలేదని, టీఆర్‌ఎస్ నుంచి రేవంత్ వెళ్లగానే పార్టీ బాగుపడిందన్నారు.టీడీపీ రేవంత్‌తో ఖతమైందని, కాంగ్రెస్‌లోకి రేవంత్‌రెడ్డి రాక ముందుకు కొన్ని సీట్లు వచ్చాయని.. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉంటే కాంగ్రెస్‌కు వచ్చేవి సున్నా స్థానాలేనని, ఇది రాసిపెట్టుకోవాలన్నారు. టీడీపీలో మేం తెలంగాణ కోసం కొట్లాడుతుంటే.. రేవంత్ చంద్రబాబు ఏజెంట్‌గా పని చేశారని, రేవంత్ ఎక్కడ కాలు పెడితే అక్కడ భూస్థాపితమేనన్నారు. కాంగ్రెస్‌లోనే రేవంత్‌కు ఎవరూ విలువనివ్వడం లేదని, బయట ఇంకెవ్వరైనా ఇస్తారా ? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం రేవంత్ చేసింది ఏమైనా ఉందా?.. కాంగ్రెస్ హయాంలో సాగునీరు, తాగునీటికి కటకట ఉండేదని, ఇపుడు తెలంగాణలో ఆ సమస్యలు ఉన్నాయా? అన్నారు.తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అనీ, రైతుల కోసం పని చేసింది ఇద్దరు ముఖ్యమంత్రులేనన్నారు. ఇందులో ఒకరు ఎన్టీఆర్ అయితే.. మరుకొరు కేసీఆర్ అన్నారు. రైతుబంధు కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. రైతుల కోసం ఇప్పటి దాకా నువ్వు ఏం చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు. సిగ్గు లేకుండా రైతు సంఘర్షణ పేరిట సభ పెడుతున్నారని, ముందు కాంగ్రెస్‌లో కొట్టుకు చస్తున్న వారి సంగతి చూడు అంటూ హితవు పలికారు. రైస్ మిల్లర్లను కేంద్రం వేధిస్తూ రైతుల నుంచి ధాన్యం కొనకుండా కక్ష గట్టిందని, కిషన్ రెడ్డికి రేవంత్ వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. రేవంత్ వాళ్లతోనే రైతులకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. ఇకనైనా రేవంత్ భాష మార్చుకోవాలని హితవు పలికారు.
*బ్రోకర్ రాజకీయాలు నాకు తెలియదు: బైరెడ్డి సిద్దార్థ రెడ్డి
పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు వాయిదా వల్ల తిరుపతిలో శాప్ సమీక్షకు హాజరుకాలేదన్నారు. పార్టీ సిద్ధాంతాల కోసం పని చేస్తున్నానని, తనకు బ్రోకర్ రాజకీయాలు తెలియవన్నారు. కుటిల రాజకీయాలు ఎలాఉంటాయో ఈవారంలో తెలుసుకున్నానని తెలిపారు. నందికొట్కూరు, పగిడ్యాలలో షటిల్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నందికొట్కూరులో పనులు తగ్గించామన్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్‌ది స్ధానిక ప్రోటోకాల్.. తనది రాష్ట్ర ప్రోటోకాల్.. అందుకే ఇద్దరం కలవలేకపోతున్నామని చెప్పారు. తన ప్రోటోకాల్ పరిధిలోని కార్యక్రమాల్లో పాల్గొంటానని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెలిపారు.
*ఏపీ రేషన్‌కార్డుదారులకు నగదు బదిలీ పథకం వాయిదా: మంత్రి నాగేశ్వరరావు
ఏపీ రేషన్‌కార్డుదారులకు నగదు బదిలీ పథకాన్ని వాయిదా వేసినట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. యాప్‌లో సాంకేతిక లోపం వల్ల ప్రస్తుతానికి నగదు బదిలీని నిలిపివేశామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. నగదు బదిలీపై ఏదైనా నిర్ణయం తీసుకుంటే తెలియజేస్తామని ఆయన అన్నారు. రైతుల కల్లాల దగ్గరకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తామని, జిల్లా యూనిట్‌గా తీసుకుని రైతులకు దగ్గరగా ట్రాన్స్‌పోర్ట్ ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లో సకాలంలో డబ్బులు పడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కారుమూరి స్పష్టం చేశారు.
*పంజాబ్ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అమరీందర్ సింగ్
పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అమరీందర్ సింగ్ రాజా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల సమక్షంలో అధికారికంగా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరమే రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ బలోపేతం చేయడానికి త్రీడీ మంత్రను అవలంబించాని అమరీందర్ సింగ్ రాజా సూచించారు. ఆ మూడు మంత్రాలు ‘డిసిప్లిన్, డెడికేషన్, డైలాగ్’ అని ఆయన పేర్కొన్నారు.ఇక అమరీందర్ సింగ్ రాజా గురించి మాజ అధ్యక్షుడు సిద్ధూ మాట్లాడుతూ ‘‘కొత్త అధినేత అమరీందర్ సింగ్ రాజాను అభినందించడానికి ఇక్కడికి వచ్చాను. గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగబోవని అనుకుంటున్నాను. కాంగ్రెస్‌ను పునరావిష్కరించాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తర్వాత రాష్ట్రంలో నాయకత్వాన్ని మార్చాలని అధిష్టానం నిర్ణయించుకుంది. అనుకున్నట్లుగానే ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న సిద్ధూని తప్పించి అమరీందర్ సింగ్ రాజాను నియమించింది.
* జగన్ పాలనలో మహిళలకు అండ అంటే ఇదేనా: Achennaidu
నెల్లూరు కలిగిరి మండలం కుమ్మరకొండూరులో భూ ఆక్రమణకు అడ్డుకున్న సుభరత్నమ్మపై వైసీపీ నేత మహేష్ దాడిని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… జగన్ రెడ్డి పాలనలో మహిళలకు అండ అంటే ఇదేనా అని… ఫ్యాక్షన్ మనస్తత్వమే వైసీపీ సిద్ధాంతమని వ్యాఖ్యానించారు. దాడులు, హత్యలు, దోచుకోవడం, కబ్జాలు, దోపిడీలు చేయడమే వైసీపీ నాయకుల ప్రథమ కర్తవ్యమన్నారు. నేడు దేశంలో మహిళలపై భౌతిక దాడుల్లో ఏపీ 1వ స్థానం, లైంగిక వేధింపుల్లో 3వ స్థానంలో ఉండటానికి జగన్ రెడ్డే కారణమని ఆయన మండిపడ్డారు. మహిళలపై దిశను తీసుకువచ్చి మేలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే జగన్ రెడ్డి నేడు ఈ దాడులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మూడేళ్లల్లో వైసీపీ నేతలు దాదాపు 1500 మంది మహిళలపై దాడులు చేసినా ఇంత వరకు ఒక్క వైసీపీ నేతను అరెస్ట్ చేసిన ధాఖలాలు ఉన్నాయా అని నిలదీశారు. తాడేపల్లిలో జగన్ రెడ్డి ఇంటి సమీపంలో మహిళపై అత్యాచారం చేసిన వెంకటరెడ్డిని ఇంత వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగారు. వైసీపీ అధికారమదంతో అచ్చోసిన ఆంబోతుల్లా తిరుగుతూ మహిళలపై అక్రమాలకు పాల్పడటానికి కారణం జగన్ రెడ్డి కాదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు
* ఏపీ డేరా బాబా కొడాలి నాని: budda venkanna
వైసీపీ నేత కొడాలి నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ డేరా బాబా కొడాలి నాని అని వ్యాఖ్యానించారు. డేరా బాబాకు కొడాలి నానికి ఒకే పోలికలు ఉన్నాయని… డేరా బాబాపై ఎన్ని కేసులు ఉన్నాయో కొడాలి నానిపై అంత కన్నా ఎక్కువ కేసులు ఉన్నాయని తెలిపారు. కొడాలి నాని గుడివాడలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. గుడివాడలో పోలీసులకు కొడాలి నాని నెల నెలా మామూళ్లు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ పాలనలో అధికారులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మట్టి మాఫియా దగ్గర ఉన్న పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మట్టి మాఫియాలో నాని వందల కోట్లు సంపాదిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ ఎందుకు నానిపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. గుడివాడ అక్రమాల పై సీఎం జగన్ ఒక కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. మట్టి మాఫియా కేసులో వెంటనే కొడాలి నానిని అరెస్ట్ చేయాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు
* గౌడ కులస్తులకు అరవింద్ క్షమాపణలు చెప్పాలి: జీవన్ రెడ్డి
బీజేపీకి కేంద్ర నిధులపై మంత్రి కేటీఆర్ స్పష్టమైన సవాల్ విసిరారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… కేటీఆర్ సవాల్‌కు సమాధానమివ్వకుండా బీజేపీ ఎంపీలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సంజయ్.. అరవింద్ హెయిర్ లెస్ హెడ్ లెస్ ఎంపీలుగా మారారని యెద్దేవా చేశారు. బీజేపీ ఎంపీలు చిచోరా, చిల్లర గాళ్లుగా మారిపోయారన్నారు. బీజేపీ ఎంపీలు కేడీ నెంబర్ వన్‌లుగా మారితే రేవంత్ జైలు కెళ్ళి బేడీ నెంబర్ వన్ ఎంపీగా మారారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ పులి లాంటోడు.. అరవింద్, రేవంత్‌లు ఊరకుక్కల్లా మొరుగుతున్నారని ధ్వజమెత్తారు. ధర్మపురి అరవింద్ కాదు ధగుల్భాజి అరవింద్ డెకాయిట్ అని అన్నారు. ఎల్లమ్మ తల్లికి కుడి చెప్పు ముడుపు కట్టావా అని అరవింద్.. మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి అన్న మాటలతో హిందువులను అవమానపరిచారన్నారు. తక్షణమే అరవింద్ గౌడ కులస్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘అరవింద్ మీ తరుణ్ చుగ్ వెంట్రుకలు తెచ్చి పెట్టుకో.. అరవింద్ నాపై దమ్ముంటే పోటీకి రా..అని ఎపుడో చెప్పా.. మళ్లీ చెబుతున్నా. రేవంత్… చంద్రబాబు చెప్పులు మోసినోడు ఆయనకు చప్రాసీగా పని చేసినోడు.. కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు. అనుముల రేవంత్ రెడ్డి కాదు ఆంబోతు రేవంత్ రెడ్డి, అవినీతి రేవంత్ రెడ్డి. బీజేపీ పేదలపై బుల్ డోజర్‌లు ప్రయోగిస్తే మేము బీజేపీపై రాజకీయ బుల్డోజర్ ప్రయోగించి అంతం చేస్తాం. రోజూ హిందువునని చెప్పుకునే అరవింద్ దేవుళ్ళని అవమాన పరుస్తాడా. రేవంత్ లాంటి ఓటుకు నోటు గజదొంగకు పీసీసీ పదవి ఇచ్చి సోనియా తెలంగాణలో తనకున్న గౌరవాన్ని పోగొట్టుకున్నారు’’ అంటూ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
* సున్నా వడ్డీ పథకం కొత్తది కాదు..పాతదే: Tulasireddy
మహిళా స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకం కొత్తది కాదని… ఇది పాత పథకమే అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పాలనలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఒక్కొక్క సంఘానికి రూ.5 లక్షలు వరకు ఈ పథకం వర్తించేదని, దాదాపు అన్ని సంఘాలు పూర్తి స్థాయిలో లబ్ధి పొందేవని తెలిపారు. జగన్ పాలనలో ఒక్కొక్క సంఘానికి రూ.3 లక్షలు వరకు మాత్రమే పరిమితి విధించారన్నారు. దీని వలన 25 శాతం మాత్రమే సంఘాలు లబ్ధి పొందుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు ప్రభుత్వ ఖర్చుతో ఈ పథకం గురించి ప్రచార ఆర్భాటాలు చేసుకోలేదన్నారు. జగన్ ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం మరీ ఎక్కువైందని, పావు కోడికి ముప్పావు మసాలా అన్నట్లుందని యెద్దేవా చేశారు. రూ.3 లక్షల వరకు ఉన్న రుణ పరిమితిని తొలగించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు
* బీజేపీలో రాజ్యసభ ఆశలు.. కుష్బుకు బెర్తు దక్కేనా?
రాజ్యసభ నామినేటెడ్ ఎంపీ పదవి కోసం రాష్ట్రానికి చెందిన పలువురు బీజేపీ నేతలు ఎదురుచూస్తున్నారు. ఇందులో సినీ నటి కుష్భు పేరు ప్రథమంగా వినిపిస్తున్నా, తెర మీదకు మరి కొందరు నేతల పేర్లు రావడంతో ఎవరిని అదృష్టం వరిస్తుందోననే చర్చ ప్రారంభమైంది. రాజ్యసభలో ప్రస్తుతం నామినేటెడ్ ఎంపీలుగా వ్యవహరిస్తున్న సుబ్రహ్మణ్య స్వామి, సురేష్ గోపి, మేరికోం, రూపా గంగూలీ, నరేంద్ర జాదవ్ తదితర ఆరుగురి పదవీకాలం ఈనెల 24వ తేదీతో ముగియనుంది. దీంతో వీరి స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పించేందుకు తగ్గ కసరత్తుల్లో కేంద్రం పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది.సుబ్రహ్మణ్య స్వామికి ఇది వరకు తమిళనాడు నుంచి నామినేటెడ్ ఎంపీ పదవిని కేటాయించారు. ఈసారి ఆయనకు పదవి మళ్లీ దక్కేది అనుమానంగా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన ఇటీవల కాలంలో చేస్తున్న విమర్శలే ఇందుకు కారణమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నా యి. దీంతో తమిళనాడు నుంచి ఈ పదవి సినీనటి, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా ఉన్న కుష్బుకు దక్కవచ్చు అనే చర్చ నడుస్తోంది.పార్టీ కోసం ఆమె తీవ్రంగానే శ్రమిస్తున్నా, సరైన గుర్తింపు రావడం లేదని మద్దతుదారులు వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. అదే సమయంలో గత కొద్దిరోజులుగా మోదీకి మద్దతుగా సంగీత దర్శకుడు ఇలయరాజా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఆయన పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇక, రాష్ట్ర బీజేపీలో సీనియర్లు ఉంటూ, ఎలాంటి పదవులు లేకుండా ఉన్న పొన్ రాధాకృష్ణన్, సీపీ రాధాకృష్ణన్ కూడా రేసులో ఉండటం గమనార్హం. అయితే, కళా రంగం కేటగిరిలో కుష్భుకు లేదా ఇలయరాజాకు పదవీ గ్యారంటీ అన్న ప్రస్తుతం ఊపందుకుంది.
*రాష్ట్రంలో కమ్మకులస్తులంతా ఐక్యంగా ఉండాలి: మంత్రి పువ్వాడ
రాష్ట్రంలో కమ్మ కులస్తులందరూ ఐక్యతగా ఉండాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ పిలుపునిచ్చారు. చిన్న విషయాలను కొందరు రాద్దాంతం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కమ్మ సామాజిక మంత్రులపై కుట్రలు పన్నుతున్నారని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తానొక్కడినే కమ్మ మంత్రినని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. కావాలనే కొంతమంది తనపై కుట్ర పన్నుతున్నారని మంత్రి అజయ్ అన్నారు
*ప్రజలకు నరకం చూపిస్తున్న ఏపీ సర్కార్: దేవినేని
ఏపీలో కరెంట్ కోతలతో ప్రజలకు ఏపీ సర్కార్ నరకం చూపిస్తోందని టీడీపీ నేత దేవినేని ఉమ దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల బాదుడు, కమీషన్ల కక్కుర్తిపై ఉన్న శ్రద్ధ.. ప్రభుత్వానికి విద్యుత్ సరఫరాపై లేదని ఆరోపించారు. టీడీపీ హయాంలో 24 గంటల సరఫరాతో మిగులు విద్యుత్‌గా ఉన్న ఏపీని.. చీకట్లోకి నెట్టడంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలి? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.ఏపీలో విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మొన్నటిదాకా పల్లెలకు మాత్రమే పరిమితమైన విద్యుత్ కోతలు.. ఇప్పుడు పట్టణాలకూ వ్యాపించాయి. ఎండ వేడితోపాటు కరెంటు కష్టాలూ పెరిగిపోయాయి. ‘అసలే ఉక్కపోత.. ఆపై కరెంటు కోత’ అంటూ రాష్ట్రమంతా జనం ఆపసోపాలు పడుతున్నారు. కొన్నిచోట్ల ఉదయం ఐదు గంటలు.. సాయంత్రం రెండు విడతలుగా గంట చొప్పున రోజుకు ఏడు గంటలు ‘పవర్ కట్’ చేస్తున్నారు
*వేసవిలో నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోండి: ఎర్రబెల్లి
వేసవిలో మంచి నీటి సమస్యలు రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని పంచాయితీరాజ్, గ్రామీణ నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. నీటి సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై సంబంధిత అధికారులు, సర్పంచులతో హైదరాబాద్ మిషన్ భగీరథ కార్యాలయం నుండి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు నిర్ణీత నీటిని అందరికీ అందేలా సర్వసన్నద్ధంగా ఉండాలని అన్నారు. నీటి సరఫరా పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, సమస్యలను పరిష్కరిస్తూ, సమన్వయం చేస్తూ, తగిన విధంగా అధికారులు పని చేయాలని అన్నారు. నీటి నిల్వలు ఉంచుకోవాలి. పంపుల నిర్వహణ, లికేజీలు లేకుండా చూసుకోవడం, ఫిల్టర్ బెడ్ల క్లీనింగ్, సమస్యలు ఉత్పన్నం అయితే, ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచుల నుంచి ఆయా గ్రామాల మంచినీటి సరఫరా పై ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడిన సర్పంచులు నీటి సరఫరా అద్భుతంగా ఉందని చెప్పారు.కొందరు మారు మూల గ్రామాల సర్పంచులు అక్కడక్కడ కొన్ని లీకేజీలు ఉన్నాయని తెలిపారు.ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి అధికారులను అదేశించారు.ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా, లేకుండా నూటికి నూరు శాతం నీటిని అందించి సీఎం కేసిఆర్ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని మంత్రి అదేశించారు.అలాగే సర్పంచులు కూడా ఎప్పటికప్పుడు తమ సమస్యలను అధికారుల దృష్టికి తేవాలని సూచించారు.అప్పటికీ పరిష్కారం దొరకక పోతే తమ దృష్టికి తేవాలని మంత్రి చెప్పారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, సీఎం, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, సీఈ లు, ఎస్ఈ లు, ఇతర అధికారులు పాల్గొన్నారు
*వరి వేసుకోమంటారు.. మళ్లీ మీరే వద్దంటారు: షర్మిల ఫైర్
గత 8 ఏళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. అదే రుణమాఫీ చేస్తే ప్రాణత్యాగం చేసుకోకుండా ఉండేవారు కదా అని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల పేర్కొన్నారు. రైతు బంధు అని చెప్పి మిగిలిన రైతు సంక్షేమ పథకాలు నిలిపేశారన్నారు. వరి వేసుకోమంటారని.. మళ్లీ మీరే వద్దంటారని షర్మిల ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఎన్ని అబద్దాలైనా చెప్పగలరన్నారు. తెలంగాణలో అసలు రైతులకు విలువే లేదని షర్మిల పేర్కొన్నారు.
*జగన్ పాలనలో మహిళలకు అండ అంటే ఇదేనా: Achennaidu
నెల్లూరు కలిగిరి మండలం కుమ్మరకొండూరులో భూ ఆక్రమణకు అడ్డుకున్న సుభరత్నమ్మపై వైసీపీ నేత మహేష్ దాడిని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… జగన్ రెడ్డి పాలనలో మహిళలకు అండ అంటే ఇదేనా అని… ఫ్యాక్షన్ మనస్తత్వమే వైసీపీ సిద్ధాంతమని వ్యాఖ్యానించారు. దాడులు, హత్యలు, దోచుకోవడం, కబ్జాలు, దోపిడీలు చేయడమే వైసీపీ నాయకుల ప్రథమ కర్తవ్యమన్నారు. నేడు దేశంలో మహిళలపై భౌతిక దాడుల్లో ఏపీ 1వ స్థానం, లైంగిక వేధింపుల్లో 3వ స్థానంలో ఉండటానికి జగన్ రెడ్డే కారణమని ఆయన మండిపడ్డారు. మహిళలపై దిశను తీసుకువచ్చి మేలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే జగన్ రెడ్డి నేడు ఈ దాడులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మూడేళ్లల్లో వైసీపీ నేతలు దాదాపు 1500 మంది మహిళలపై దాడులు చేసినా ఇంత వరకు ఒక్క వైసీపీ నేతను అరెస్ట్ చేసిన ధాఖలాలు ఉన్నాయా అని నిలదీశారు. తాడేపల్లిలో జగన్ రెడ్డి ఇంటి సమీపంలో మహిళపై అత్యాచారం చేసిన వెంకటరెడ్డిని ఇంత వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగారు. వైసీపీ అధికారమదంతో అచ్చోసిన ఆంబోతుల్లా తిరుగుతూ మహిళలపై అక్రమాలకు పాల్పడటానికి కారణం జగన్ రెడ్డి కాదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు
*ఏపీ డేరా బాబా కొడాలి నాని: budda venkanna
వైసీపీ నేత కొడాలి నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ డేరా బాబా కొడాలి నాని అని వ్యాఖ్యానించారు. డేరా బాబాకు కొడాలి నానికి ఒకే పోలికలు ఉన్నాయని… డేరా బాబాపై ఎన్ని కేసులు ఉన్నాయో కొడాలి నానిపై అంత కన్నా ఎక్కువ కేసులు ఉన్నాయని తెలిపారు. కొడాలి నాని గుడివాడలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. గుడివాడలో పోలీసులకు కొడాలి నాని నెల నెలా మామూళ్లు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ పాలనలో అధికారులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మట్టి మాఫియా దగ్గర ఉన్న పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మట్టి మాఫియాలో నాని వందల కోట్లు సంపాదిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ ఎందుకు నానిపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. గుడివాడ అక్రమాల పై సీఎం జగన్ ఒక కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. మట్టి మాఫియా కేసులో వెంటనే కొడాలి నానిని అరెస్ట్ చేయాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు
*గౌడ కులస్తులకు అరవింద్ క్షమాపణలు చెప్పాలి: జీవన్ రెడ్డి
బీజేపీకి కేంద్ర నిధులపై మంత్రి కేటీఆర్ స్పష్టమైన సవాల్ విసిరారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… కేటీఆర్ సవాల్‌కు సమాధానమివ్వకుండా బీజేపీ ఎంపీలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సంజయ్.. అరవింద్ హెయిర్ లెస్ హెడ్ లెస్ ఎంపీలుగా మారారని యెద్దేవా చేశారు. బీజేపీ ఎంపీలు చిచోరా, చిల్లర గాళ్లుగా మారిపోయారన్నారు. బీజేపీ ఎంపీలు కేడీ నెంబర్ వన్‌లుగా మారితే రేవంత్ జైలు కెళ్ళి బేడీ నెంబర్ వన్ ఎంపీగా మారారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ పులి లాంటోడు.. అరవింద్, రేవంత్‌లు ఊరకుక్కల్లా మొరుగుతున్నారని ధ్వజమెత్తారు. ధర్మపురి అరవింద్ కాదు ధగుల్భాజి అరవింద్ డెకాయిట్ అని అన్నారు. ఎల్లమ్మ తల్లికి కుడి చెప్పు ముడుపు కట్టావా అని అరవింద్.. మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి అన్న మాటలతో హిందువులను అవమానపరిచారన్నారు. తక్షణమే అరవింద్ గౌడ కులస్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘అరవింద్ మీ తరుణ్ చుగ్ వెంట్రుకలు తెచ్చి పెట్టుకో.. అరవింద్ నాపై దమ్ముంటే పోటీకి రా..అని ఎపుడో చెప్పా.. మళ్లీ చెబుతున్నా. రేవంత్… చంద్రబాబు చెప్పులు మోసినోడు ఆయనకు చప్రాసీగా పని చేసినోడు.. కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు. అనుముల రేవంత్ రెడ్డి కాదు ఆంబోతు రేవంత్ రెడ్డి, అవినీతి రేవంత్ రెడ్డి. బీజేపీ పేదలపై బుల్ డోజర్‌లు ప్రయోగిస్తే మేము బీజేపీపై రాజకీయ బుల్డోజర్ ప్రయోగించి అంతం చేస్తాం. రోజూ హిందువునని చెప్పుకునే అరవింద్ దేవుళ్ళని అవమాన పరుస్తాడా. రేవంత్ లాంటి ఓటుకు నోటు గజదొంగకు పీసీసీ పదవి ఇచ్చి సోనియా తెలంగాణలో తనకున్న గౌరవాన్ని పోగొట్టుకున్నారు’’ అంటూ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
*సున్నా వడ్డీ పథకం కొత్తది కాదు..పాతదే: Tulasireddy
మహిళా స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకం కొత్తది కాదని… ఇది పాత పథకమే అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పాలనలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఒక్కొక్క సంఘానికి రూ.5 లక్షలు వరకు ఈ పథకం వర్తించేదని, దాదాపు అన్ని సంఘాలు పూర్తి స్థాయిలో లబ్ధి పొందేవని తెలిపారు. జగన్ పాలనలో ఒక్కొక్క సంఘానికి రూ.3 లక్షలు వరకు మాత్రమే పరిమితి విధించారన్నారు. దీని వలన 25 శాతం మాత్రమే సంఘాలు లబ్ధి పొందుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు ప్రభుత్వ ఖర్చుతో ఈ పథకం గురించి ప్రచార ఆర్భాటాలు చేసుకోలేదన్నారు. జగన్ ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం మరీ ఎక్కువైందని, పావు కోడికి ముప్పావు మసాలా అన్నట్లుందని యెద్దేవా చేశారు. రూ.3 లక్షల వరకు ఉన్న రుణ పరిమితిని తొలగించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు
*బీజేపీలో రాజ్యసభ ఆశలు.. కుష్బుకు బెర్తు దక్కేనా?
రాజ్యసభ నామినేటెడ్ ఎంపీ పదవి కోసం రాష్ట్రానికి చెందిన పలువురు బీజేపీ నేతలు ఎదురుచూస్తున్నారు. ఇందులో సినీ నటి కుష్భు పేరు ప్రథమంగా వినిపిస్తున్నా, తెర మీదకు మరి కొందరు నేతల పేర్లు రావడంతో ఎవరిని అదృష్టం వరిస్తుందోననే చర్చ ప్రారంభమైంది. రాజ్యసభలో ప్రస్తుతం నామినేటెడ్ ఎంపీలుగా వ్యవహరిస్తున్న సుబ్రహ్మణ్య స్వామి, సురేష్ గోపి, మేరికోం, రూపా గంగూలీ, నరేంద్ర జాదవ్ తదితర ఆరుగురి పదవీకాలం ఈనెల 24వ తేదీతో ముగియనుంది. దీంతో వీరి స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పించేందుకు తగ్గ కసరత్తుల్లో కేంద్రం పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది.సుబ్రహ్మణ్య స్వామికి ఇది వరకు తమిళనాడు నుంచి నామినేటెడ్ ఎంపీ పదవిని కేటాయించారు. ఈసారి ఆయనకు పదవి మళ్లీ దక్కేది అనుమానంగా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన ఇటీవల కాలంలో చేస్తున్న విమర్శలే ఇందుకు కారణమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నా యి. దీంతో తమిళనాడు నుంచి ఈ పదవి సినీనటి, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా ఉన్న కుష్బుకు దక్కవచ్చు అనే చర్చ నడుస్తోంది.పార్టీ కోసం ఆమె తీవ్రంగానే శ్రమిస్తున్నా, సరైన గుర్తింపు రావడం లేదని మద్దతుదారులు వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. అదే సమయంలో గత కొద్దిరోజులుగా మోదీకి మద్దతుగా సంగీత దర్శకుడు ఇలయరాజా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఆయన పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇక, రాష్ట్ర బీజేపీలో సీనియర్లు ఉంటూ, ఎలాంటి పదవులు లేకుండా ఉన్న పొన్ రాధాకృష్ణన్, సీపీ రాధాకృష్ణన్ కూడా రేసులో ఉండటం గమనార్హం. అయితే, కళా రంగం కేటగిరిలో కుష్భుకు లేదా ఇలయరాజాకు పదవీ గ్యారంటీ అన్న ప్రస్తుతం ఊపందుకుంది.
*ఫాంహౌజ్‌పై సీబీఐ విచారణకు సిద్ధమా: అర్వింద్
‘‘జన్వాడ ఫాంహౌజ్‌పై, రాష్ట్రంలో బియ్యం బ్లాక్ దందాపై సీబీఐ విచారణకు ఎన్‌ఓసీ ఇచ్చేందుకు సిద్ధమా?’’ అంటూ మంత్రి కేటీఆర్‌కు బీజేపీ ఎంపీ అర్వింద్ సవాలు చేశారు. జన్వాడ ఫాంహౌజ్ 111 జీవో నిబంధనలకు విరుద్ధంగా కట్టింది కాదా? దానిని ఎందుకు కూల్చటంలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో బియ్యం బ్లాక్ దందా సాగుతోందని, ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే సుమారు రూ. 8 కోట్ల విలువైన ధాన్యం నిల్వల వ్యత్యాసం ఉన్నట్లు తేలిందన్నారు. కేటీఆర్, కుక్కను కరిచారని అందుకే.. ఆయన మాటలు చిత్రవిచిత్రంగా ఉంటున్నాయని మండిపడ్డారు. .‘‘ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తంబాకు తింటారంటూ మీరు ఆరోపణ చేశారు. దీనిపై పరీక్షకు ఆయన్ను తీసుకువచ్చే బాధ్యత నాది. కొకైన్ పరీక్షకు మీ తల వెంట్రుకలు ఇచ్చేందుకు సిద్ధమా?’’ అని కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
*తిట్ల పురాణంతో రాజకీయమేంటి?: దాసోజు
ప్రజల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి తిట్ల పురాణంతో రాజకీయం చేయడమేంటని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.. మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చ రాకుండా తిట్ల మీదనే చర్చ వచ్చేలా కేటీఆర్ మాట్లాడారని విమర్శించారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. జీవో నం.111పై హైపవర్ కమిటీ గత మార్చి 31న నివేదిక ఇచ్చిందని, దానిని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆగమేఘాల మీద జీవో నం.111ను ఎత్తివేసి, అక్కడ ఉన్న జలాశయాలు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కమిటీ వేయడమేంటని నిలదీశారు.
*వరి సాగుపై ఆంక్షలు లేవు: నిరంజన్‌రెడ్డి
వ్యవసాయం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని కొందరు స్వార్థపరులు అర్థం చేసుకోకున్నా.. రైతులు అర్థంచేసుకొని ప్రత్యామ్నాయ పంటల దిశగా సాగుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వరి సాగుపై ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించటం లేదని, లాభసాటి పంటలు సాగుచేయాలనేదే తమ ఆకాంక్ష అని అన్నారు. వానాకాలంలో ఎవరికిష్టమొచ్చిన పంటలు వారు సాగు చేసుకోవచ్చని, ఎలాంటి ఆంక్షలు లేవని గురువారం హైదరాబాద్‌లో విడుదలచేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
*సహజ’ పేరుతో 100 సరకులు: కొప్పుల
మహిళల్ని ఆర్థికంగా శక్తిమంతుల్ని చేసేందుకు ప్రభుత్వం అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తుందని సంక్షేమ శాఖల మంత్రి మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అందులో భాగంగానే ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ, కార్పొరేషన్ నిత్యావసరాల్ని ఉత్పత్తి చేసి, మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు ‘సహజ’ బ్రాండ్ ఏర్పాటు చేసిందన్నారు. ఈ బ్రాండ్ పేరుతో దాదాపు వంద నిత్యావసర సరకులు విడుదల చేసే అవకాశం ఉందని చెప్పారు. తన నియోజకవర్గం ధర్మపురికి చెందిన సుమారు 200 మంది మహిళలు మేడ్చల్‌లోని మమతా, జీడిమెట్లలోని సుభా్‌షనగర్‌లో ఉన్న శ్రీయోగి, మణికంఠ మినీ ఇండస్ట్రీ్ట్రలను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సహజ బ్రాండ్‌తో రానున్న రోజుల్లో 100 రకాల సరకుల్ని వినియోగదారులకు అందిస్తామని చెప్పారు.
*స్టార్ట్‌పలకు ప్రత్యేక ప్రాధాన్యం: జయేశ్ రంజన్
ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకుగాను ప్రభుత్వం స్టార్ట్‌పలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆవిష్కరణల (ఇన్నోవేషన్) దినోత్సవం సందర్భంగా గురువారం టి-హబ్‌లో తెలంగాణ ఆవిష్కరణల మహోత్సవం నిర్వహించారు. ఇందులో జయేశ్ రంజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ ఆధ్వర్యంలో 18 స్టార్ట్‌పలకు నగదు పురస్కారాలు అందించారు. ఇందులో వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలు అభివృద్ధి చేసిన కె.తంగమని, బి.లింగం, సి.దివ్యశ్రీ, గొర్రె అశోక్, దీపక్ రెడ్డి, మందన్ గోపాల్‌సింగ్, డొగ్గ త్రివిక్రమ్ కుమార్, విశాల్ సింఘాల్, అంగ్షుజ్యోతి దాస్, అంజయ్య ఇంజాపురి, అబ్బోజు వెంకటేష్, ప్రతిభా భారతి, ఉదయ్ భాస్కర్ ఉన్నారు. వైద్య రంగంలో ఆవిష్కర్తలు రవికిరణ్, డాక్టర్ హైమ గోపరాజు, పూంగోతై రామస్వామి ఉన్నారు. పరిశ్రమల రంగంలో సంయుక్త పెంట, శివకుమార్ మోధ టి-హబ్ పురస్కారాలకు ఎంపికయ్యారు.
*ఆరోపణలు నిరూపించగలరా: ఎమ్మెల్యే మేకా
తనపై, తన కుమారుడిపై చేసిన ఆరోపణలను నిరూపించాలని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సవాల్ చేశారు. రచ్చబండలో ఎవరో ఏదో చెప్పారని తన కుమారుడిపై చేసిన ఆరోపణలను చంద్రబాబు, ఆరోపణలు చేసిన కాజ రాంబాబు వాటిని నిరూపించాలన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల కోసం నెక్కలం గొల్లగూడెంలో భూమిని ఢిల్లీకి చెందిన సిరసా ఆండ్రూ జాన్సన్ తదితరుల నుంచి అధికారులు కొనుగోలు చేశారన్నారు. ఎకరం రూ.22 లక్షలు ఉండగా.. రూ.55 లక్షలకు కొనుగోలు చేశారన్నారు. ఇందులో తమకు ఎలాంటి ప్రమేయం లేదన్నారు. దీనిపై ఏ విచారణ అయినా చేసుకోవచ్చని చెప్పారు. గతంలో మీ హయాంలో దాడికి గురైన తహశీల్దార్‌కు ఏం న్యాయం చేశారని ప్రతాప్ ప్రశ్నించారు.
*ఉత్సవ విగ్రహాల్లా ఉంటే ఊరుకోను: మేరుగ
‘‘సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల పర్యవేక్షణలో సంబంధిత అధికారులు ఉత్సవ విగ్రహాల్లాగా ఉండిపోతే ఊరుకునేది లేదు. విద్యాసంస్థల పర్యవేక్షణ పటిష్ఠంగా జరగాలి. అవసరమైన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి’’ అని మంత్రి మేరుగ నాగార్జున హెచ్చరించారు. సచివాలయంలో సాంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ సమీక్ష సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. తప్పుచేస్తే ఎవరినీ ఉపేక్షించాల్సిన అవసరం లేదని, రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి గురుకుల విద్యాసంస్థలను పరిశీలిస్తానని తెలిపారు.
&*పోలవరంపై టీడీపీ అనవసర రాద్ధాంతం: సజ్జల
‘‘పోలవరం సాగునీటి ప్రాజెక్టుపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది. పోలవరం జాప్యానికి చంద్రబాబే కారణం. డయాఫ్రమ్ వాల్ వద్ద నీటి తోడాలంటే రూ.2000 కోట్లు వ్యయం అవుతుందని నిపుణులు అంచనా వేశారు’’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘‘సీఎం కాన్వాయ్ కోసం తిరుపతి వెళ్తున్న కుటుంబం నుంచి రవాణాశాఖ అధికారులు కారును లాక్కోవడాన్ని చంద్రబాబు రాద్ధాంతం చేశారు. ఒక అధికారి చేసిన తప్పునకు సీఎం జగన్‌ది తప్పెలా అవుతుంది? ఈ సమాచారం తెలిసిన వెంటనే సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు’ అని సజ్జల చెప్పారు.
*ఊరూరా స్పోర్ట్స్ క్లబ్‌లు: మంత్రి రోజా
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, మండల స్థాయిలో స్పోర్ట్స్ క్లబ్‌లు ఏర్పాటు చేసి మట్టిలో మాణిక్యాల్లాంటి ఆటగాళ్లను వెలికి తీస్తామని పర్యాటక, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీ సెనేట్ హాల్‌లో క్రీడా శాఖపై గురువారం రాష్ట్రస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. వివిధ క్రీడాంశాల్లో ఆసక్తి కలిగిన, ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించేందుకు గ్రామ, మండల స్థాయిల్లో స్పోర్ట్స్ క్లబ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామనితెలిపారు. కార్యక్రమంలో క్రీడాశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ వాణీమోహన్, శాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డి, జిల్లాల క్రీడాభివృద్ధి అధికారులు, కోచ్‌లు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.