DailyDose

రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరువు.. “దిశ” ఎక్కడ..? – TNI తాజా వార్తలు

రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరువు.. “దిశ” ఎక్కడ..?  – TNI తాజా వార్తలు

*విజయవాడలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం దుర్మార్గమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరవవుతోందన్న పవన్.. అత్యాచార ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. శనివారం పవన్ నిర్వహించనున్న యాత్రకు అడ్డంకులు కలిగించేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరవవుతోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం దుర్మార్గమన్నారు. పోలీసులు సకాలంలో స్పందిస్తే ఇంత ఘోరం జరిగేది కాదన్నారు. ఆస్పత్రిలో పని చేస్తున్నవారే అఘాయిత్యానికి ఒడిగట్టడం.. అక్కడి నిఘా, సెక్యూరిటీ లోపభూయిష్టానికి అద్దం పడుతోందని దుయ్యబట్టారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించటంతోపాటు బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని కోరారు. అత్యాచార ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని జనసేనాని డిమాండ్ చేశారు. మహిళల రక్షణ పట్ల పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పవన్ సూచించారు. మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన దిశ చట్టం ఇప్పటికీ అమలు కావడం లేదన్న పవన్‌కల్యాణ్.. దిశ చట్టం ఎప్పటి నుంచి అమలవుతుందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.జనసేన చేపట్టిన ‘కౌలు రైతు భరోసా యాత్ర’కు ఆటంకం స్పష్టంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో శనివారం.. పవన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో చింతలపూడి నియోజకవర్గం ధర్మాజీగూడెం వద్ద రహదారిని అడ్డంగా తవ్వించేస్తున్నారు. ఉన్నపళంగా జేసీబీతో రోడ్డుని తవ్విస్తుండడాన్ని చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. చింతలపూడిలో పవన్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించేందుకు వెళ్తున్న నాదెండ్ల మనోహర్.. మార్గం మధ్యలో రోడ్డు తవ్వుతున్న దృశ్యాలు చూసిన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, నాదెండ్ల.. జేసీబీని అడ్డుకున్నారు. రహదారి పనుల ముసుగులో పవన్ యాత్రను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

* విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక లైంగిక దాడికి గురైన యువతిని పరామర్శించేం దుకు వచ్చిన ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌కు నిరసనలు ఎదురయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించేందుకు చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ప్రభుత్వ ఆసుపత్రికి తరలి వచ్చారు. అప్పటికే వివిధ మహిళా సంఘాలు, టీడీపీకి చెందిన మహిళలు ఆస్పత్రి ఎదుట బైఠాయించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసన తెలుపుతుండగా అక్కడికి వచ్చిన చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ఆమె లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు.చివరకు పోలీసు బలగాలతో ఆమె బాధితురాలి వద్దకు వెళ్లి పరామర్శించారు. విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతి రాణా టాటా బాధితురాలిని పరామర్శించేందుకు రాగా ఆందోళనకారుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందని మహిళలు మండిపడ్డారు.

*విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచార బాధిత కుటుంబాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరామర్శించారు. ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా వ్యవహరించటం వల్లే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వాసుపత్రిలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేయటం రాష్ట్రానికే అవమానమన్నారు. ఈ ఘటన పట్ల ప్రభుత్వానికి సిగ్గుందో లేదో కానీ నేను సిగ్గుపడుతున్నానని అన్నారు. అత్యాచారం చేసిన శ్రీకాంత్‌, బాబురావు, పవన్‌ కల్యాణ్‌కు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు.బాధితురాలి తండ్రి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు పట్టించుకోకపోగా.. కుమార్తెను వెతుక్కోవాలని తండ్రికి చెప్పడం ఏంటని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ ఉందా అని సీఎంను ప్రశ్నించారు. సీఎం ఒంగోలుకు కాదు వెళ్లాల్సింది… ఇక్కడకు రావాలన్నారు. ఏపీలో దిశ చట్టం లేదు..దిశ యాప్‌ లేదు. కేవలం లేనిదాన్ని ఉందని చెప్పుకొని సీఎం తిరుగుతున్నారని ధ్వజమెత్తారు.

* శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ అధికారి ఇంట్లో భారీగా ఆస్తులను గుర్తించి ఏసీబీ. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన ఉన్నారన్న సమాచారంతో సిటీ ప్లానర్ నర్సింహులు ఇంటిపై ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఏకకాలంలో నాలుగు చోట్ల ఏసీబీ సోదాలు చేసింది. ఇప్పటి వరకు 15 కోట్ల ఆస్తులను గుర్తించింది. ఏసీబీ సోదాలు జరిగే సమయంలో నర్సింహులు ఇంట్లో, ఆఫీస్‌లో లేరని… షిరిడి సాయి దర్శనానికి వెళ్లినట్లు తెలుస్తోంది. నర్సింహులు కార్యాలయంలో పలు డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలు భారీగా గుర్తించారు. సోదాలకు సంబంధించి ఏసీబీ ఈరోజు పూర్తి వివరాలను తెలియజేయనుంది.

* మట్టి కోసం అధికార పార్టీ నేతల మధ్య ఘర్షణ చెలరేగింది. వెల్వడం వైసీపీలో చెరువు మట్టి తవ్వకాలు చిచ్చురేపాయి. వెల్వడం మోదుగుల చెరువులో రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. మట్టి ట్రాక్టర్‌లకు అడ్డంగా కూర్చున్న వెల్వడం సొసైటీ ప్రెసిడెంట్ తోట తిరుపతిరావును మైలవరం వైస్ ఎంపీపీ ప్రత్తిపాటి రత్నబాబు ట్రాక్టర్‌తో తొక్కించబోయాడు. గ్రామ పార్టీ అధ్యక్షుడు రాంభూపాల్ రెడ్డి, తోట తిరుపతిరావు వర్గాల మధ్య గత కొంతకాలంగా గొడవలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే వసంతతో తేల్చుకొనేందుకు తోట తిరుపతిరావు తన వర్గంతో మైలవరం పార్టీ ఆఫీస్ వద్దకు వచ్చారు. పార్టీ ఆఫీస్ వద్ద ఎటువంటి గొడవలు చేయవద్దని ఎస్‌ఐ రాంబాబు హెచ్చరించాడు. దీంతో ఎస్‌ఐ, ఎమ్మెల్యే పీఏకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో మైలవరం ఎమ్మెల్యే వసంత కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే సాక్షిగా అధికార పార్టీ గొడవలు బహిర్గతం కావడంతో స్థానికులు చర్చించుకుంటున్నారు.

* సంగారెడ్డి: జిల్లాలోని ఆందోల్ మండలం నెరడిగుంట ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఒకటవ తరగతి విద్యార్థి(సృజన్)ను ప్రధానోపాధ్యాయురాలు పారిజాతం చెప్పుతో కొట్టారు. తరగతి గదిలో విద్యార్థి అల్లరి చేస్తూ పరీక్షలు సరిగ్గా రాయడం లేదంటూ విద్యార్థిపై ప్రధానోపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన విద్యార్థి కుటుంబీకులు… ప్రధానోపాధ్యాయురాలిని నిలదీశారు. ఈ ఘటనపై ఆందోల్ మండల ఎంఇఓ, డిఇఓకు విద్యార్థి తండ్రి వీఆరోఓ వినోద్ ఫిర్యాదు చేశారు. అయితే పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థిని చెప్పుతో కొట్టిన వ్యవహారాన్ని మండల విద్యాశాఖ అధికారి ఎంఇఓ కృష్ణ పట్టించుకోలేదు. ఎంఇఓ తీరుపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

* విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఘటన హేయనీయమని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఘటనకు సంబంధించిన నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు ప్రభుత్వం ఉపేక్షించదని తెలిపారు. నిందితులను ఉరి తీయడం న్యాయస్థానం పరిధిలో ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని పేర్కొన్నారు. బాధితురాలికి ఇల్లు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అన్ని విధాలుగా ఆదుకుంటా.

* విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటనపై సీఎం జగన్ స్పందించారు. ఈ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని.. ఆ కుటుంబానికి వెంటనే రూ.10లక్షల పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు.జయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటన నేపథ్యంలో పోలీసుల అలసత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా ఉపేక్షించవద్దని.. బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎంవో అధికారులకు జగన్‌ ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని.. ఆ కుటుంబానికి వెంటనే రూ.10లక్షల పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

*సీపీఎస్‌పై ఈ నెల 25న ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం సమావేశం కానుంది. 16 ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ఏపీ ఉద్యోగులు, సీపీఎస్‌ ఎంప్లాయిస్ అసోసియేషన్లకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. దెబ్బ ఒకచోట ఉంటే కట్టు మరోచోట కట్టి ఉపయోగం లేదని సీపీఎస్‌ కోసం పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు.

*సీపీఎస్‌పై ఈ నెల 25న ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం సమావేశం కానుంది. 16 ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ఏపీ ఉద్యోగులు, సీపీఎస్‌ ఎంప్లాయిస్ అసోసియేషన్లకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. దెబ్బ ఒకచోట ఉంటే కట్టు మరోచోట కట్టి ఉపయోగం లేదని సీపీఎస్‌ కోసం పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు.

*కోవూరు చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించాలని కార్మికులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. చక్కెర కర్మాగారం వద్ద రైతు సంఘం నాయకులు, రైతులు, సీపీఎం నాయకులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరిస్తామని మాట తప్పడం దారుణమన్నారు. జీవో నెంబర్ 15తో చక్కెర కర్మాగారాన్ని మూసివేసి విలువైన ఆస్తులను అమ్ముకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. 3500 మందికి బకాయిలు చెల్లించకపోగా పరికరాలను సైతం తరలించేశారని ఆరోపిస్తున్నారు.

*విజయవాడ బాధితురాలికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ తరపున రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు. బాధితురాలికి న్యాయం జరగాలని… నిందితులకు తక్షణం శిక్ష పడాలని ఈ సందర్భంగా చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ సంఘటనలో నిర్లక్ష్యం వహించన పోలీసులపై, ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత అన్నారు.మరోవైపు విజయవాడ ఆస్పత్రి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకునే ముందు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్టి పద్మ అక్కడకు చేరుకున్నారు. చంద్రబాబు వచ్చినా అక్కడి నుండి వాసిరెడ్డి పద్మ అక్కడి నుంచి బయటకు రాకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందు ఆస్పత్రికి వచ్చిన వాసిరెడ్డి పద్మను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులను పక్కకు లాగిన పోలీసులు.. అతి కష్టం మీద వాసిరెడ్డి పద్మను ఆసుపత్రి లోపలకి పంపించారు. ఈ క్రమంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

*మట్టి కోసం అధికార పార్టీ నేతల మధ్య ఘర్షణ చెలరేగింది. వెల్వడం వైసీపీలో చెరువు మట్టి తవ్వకాలు చిచ్చురేపాయి. వెల్వడం మోదుగుల చెరువులో రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. మట్టి ట్రాక్టర్‌లకు అడ్డంగా కూర్చున్న వెల్వడం సొసైటీ ప్రెసిడెంట్ తోట తిరుపతిరావును మైలవరం వైస్ ఎంపీపీ ప్రత్తిపాటి రత్నబాబు ట్రాక్టర్‌తో తొక్కించబోయాడు. గ్రామ పార్టీ అధ్యక్షుడు రాంభూపాల్ రెడ్డి, తోట తిరుపతిరావు వర్గాల మధ్య గత కొంతకాలంగా గొడవలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే వసంతతో తేల్చుకొనేందుకు తోట తిరుపతిరావు తన వర్గంతో మైలవరం పార్టీ ఆఫీస్ వద్దకు వచ్చారు. పార్టీ ఆఫీస్ వద్ద ఎటువంటి గొడవలు చేయవద్దని ఎస్‌ఐ రాంబాబు హెచ్చరించాడు. దీంతో ఎస్‌ఐ, ఎమ్మెల్యే పీఏకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో మైలవరం ఎమ్మెల్యే వసంత కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే సాక్షిగా అధికార పార్టీ గొడవలు బహిర్గతం కావడంతో స్థానికులు చర్చించుకుంటున్నారు.

*శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ అధికారి ఇంట్లో భారీగా ఆస్తులను గుర్తించి ఏసీబీ. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన ఉన్నారన్న సమాచారంతో సిటీ ప్లానర్ నర్సింహులు ఇంటిపై ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఏకకాలంలో నాలుగు చోట్ల ఏసీబీ సోదాలు చేసింది. ఇప్పటి వరకు 15 కోట్ల ఆస్తులను గుర్తించింది. ఏసీబీ సోదాలు జరిగే సమయంలో నర్సింహులు ఇంట్లో, ఆఫీస్‌లో లేరని… షిరిడి సాయి దర్శనానికి వెళ్లినట్లు తెలుస్తోంది. నర్సింహులు కార్యాలయంలో పలు డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలు భారీగా గుర్తించారు. సోదాలకు సంబంధించి ఏసీబీ ఈరోజు పూర్తి వివరాలను తెలియజేయనుంది.

* కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామ సచివాలయంలో రెవెన్యూ అధికారి ఎండి ఇమ్రానుల్లాహ్ ఆనారోగ్యంతో మృతి చెందాడు. ఇమ్రానుల్లాహ్ స్వస్థలం కృత్తివెన్ను మండలం చినపాండ్రాక గ్రామం. మృతుని సోదరుడు కూడా బంటుమిల్లి గ్రామ సచివాలయంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇమ్రానుల్లాహ్ భౌతికకాయాన్ని బంటుమిల్లి మండల రెవిన్యూ కార్యాలయ సిబ్బంది సందర్శించి నివాళులర్పిస్తున్నారు.

*కృష్ణా జిల్లాలోని గుడివాడ మండలం మోటూరులో ఆర్‌ఐపై దాడి జరిగింది. అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న ఆర్‌ఐపై మట్టి మాఫియా దాడికి దిగింది. కొన్నిరోజులుగా రాత్రివేళ అధికార పార్టీ నేతలు మట్టి తవ్వుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. అడ్డుకుంటున్న అధికారులను మట్టి మాఫియా బెదిరిస్తోంది. ఈ క్రమంలో ఆర్ఐపై దాడి జరిగింది. ఈ ఘటనపై రెవెన్యూ సంఘాలు స్పందించాయి. దాడి చేసిన వారిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశాయి.

*అక్రమ మార్గంలో చేనేత పింఛన్లు పొందిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. అక్రమార్కుల అర్హతలు, దరఖాస్తు ఫారంతో జతచేసిన పత్రాలను పరిశీలించిన అధికారులు వాటిని బోగ్‌సగా నిర్ధారించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేటలో ఈ ఏడాది జనవరి 27న ‘చేనేత పింఛన్లలో చేతివాటం’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కలెక్టర్‌ భారతి హోళికేరి ఈ వ్యవహారంపై విచారణ జరపాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శేషాద్రిని అప్పుడు ఆదేశించారు. మండల పరిధిలో చేనేత పారిశ్రామిక సహకార సంఘంలో గుర్తింపు పొంది, తద్వారా పింఛన్లు పొందుతున్న మొత్తం 50 మందిని అధికారులు గుర్తించారు. వారిలో ఇద్దరు మృతి చెందగా, మిగతా 48 మంది ధ్రువీకరణ పత్రాలను ఫిబ్రవరి 3లోపు సమర్పించాలని అప్పటి ఎంపీడీవో శ్రీనివాస్‌ ఆదేశించారు.

*ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దక్షిణ బస్తర్‌ ప్రాంతంలోని పామేడ్‌ గెరిల్లా బేస్‌ ఏరియాలో ఏప్రిల్‌ 15న అర్ధరాత్రి తర్వాత డ్రోన్లతో పీఎల్‌జీఏ, ఆదివాసీలపై పోలీసులు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ(మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వైమానిక దాడుల్లో 50కి పైగా డ్రోన్లను ఉపయోగించి, 50కిపైగా భారీ విధ్వంసం సృష్టించే బాంబులను విడిచి పెట్టారని ఆరోపించారు. దీంతో అటవీ సంపదను దాచుకునేందుకు ప్రజలు నిర్మించుకున్న గుడిసెలు దెబ్బతిన్నాయని తెలిపారు. అప్రమత్తంగా ఉండటంతో స్థానికులు, పీఎల్‌జీఏకు ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. ఇలాంటి వైమానిక దాడి 2021 ఏప్రిల్‌ 19న ఒకటి జరిగిందని, ఇది రెండోదని తెలిపారు. ఆదివాసీలు నివసించే ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో సైన్యం మోహరింపు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఇదిఅమానవీయమని, ఐక్యరాజ్య సమితి నియమాలను ఉల్లంఘించడమేనని విమర్శించారు. ఇలాంటి దాడులను బలంగా ప్రతిఘటించాల్సిందిగా పార్టీ కేడర్‌కు, పీఎల్‌జీఏ, విప్లవ ప్రజా కమిటీలకు పిలుపునిచ్చారు. బస్తర్‌ ప్రజలపై డ్రోన్‌ దాడులను వ్యతిరేకించాలని ప్రజాస్వామికవాదులు, ప్రగతిశీల శక్తులు, మానవ హక్కుల సంస్థలు, వామపక్ష పార్టీలను కోరారు.

* విద్యుత్తు అనధికార లోడు కలిగి ఉన్నారని, అనుమతించిన దాని కంటే అధికలోడు వాడుతున్నారన్న కారణాలతో డిస్క మ్‌లు ఏకపక్షంగా విధిస్తున్న డెవలప్‌మెంట్‌ చార్జీలకు అడ్డుకట్టపడనుంది. నోటీసులు ఇవ్వకుండా డెవలప్‌ మెంట్‌ చార్జీలు విధించవద్దని తెలంగాణరాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి(టీఎస్‌ఈఆర్‌సీ) డిస్కమ్‌లను ఆదేశించింది. ఇప్పటికే ఉత్తర డిస్కమ్‌లో అడ్డదిడ్డంగా చార్జీలు వసూలు చేశారు. దక్షిణ డిస్కమ్‌లో కూడా మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే నోటీసులు ఇవ్వ కుండా డెవలప్‌మెంట్‌ చార్జీలు వసూలు చేస్తున్నారని పలు ఫిర్యాదులు అందడంతో ఈఆర్‌సీ స్పందించి ఈ ఉత్తర్వులు ఇచ్చింది. నోటీసులు ఇస్తే, లోడు పెరుగు దలకు కారణమైన ఉపకరణాల వాడకం తగ్గించుకునే అవకాశం వినియోగదారులకు ఉంటుంది.

*‘రాష్ట్రంలో రేషన్‌ బియ్యం బ్లాక్‌ మార్కెట్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దళారులతో కలిసి బియ్యం వ్యాపారం చేస్తోంది. దొంగల ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడేది లేదు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్న ప్రకాశం జిల్లా మార్కాపురంలోని బీజేపీ కార్యకర్తలపై కేసుల నమోదు చేశారు. అందుకు నిరసనగా ఆ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్‌ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. అందులో వీర్రాజు పాల్గొని మాట్లాడారు. ‘‘రేషన్‌బియ్యాన్ని దళారులు రీసైక్లింగ్‌ చేసి ఇతర దేశాలకు అక్రమంగా తరలిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం చేయలేని పనిని బీజేపీ కార్యకర్తలు చేసి రేషన్‌ బియ్యం అక్రమ తరలింపును అడ్డుకుంటే కేసులు బనాయిస్తారా? ప్రజలు తినడానికి ఉపయోగపడని బియ్యం ఇస్తూ బ్లాక్‌ మార్కెట్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కొంతమంది మంత్రులు క్రైస్తవ మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారు. ఒక మహిళా మంత్రి ఆర్‌ఎ్‌సఎస్‌ కార్యకర్తపై కేసులు పెట్టించి ఉద్యోగం నుంచి తొలగించింది. సీఎం పర్యటన కోసం బలవంతంగా కార్లు లాక్కొనే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని వీర్రాజు డిమాండ్‌ చేశారు. ధర్నాలో పాల్గొన్న వీర్రాజుకు ఎండ తగలకుండా గొడుగు పట్టడం చర్చనీయాంశమైంది. కాగా, ‘‘పాలనపై అవగాహన లేని వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని మరో శ్రీలంకలా మార్చేందుకు చూస్తోంది. ఎమర్జెన్సీ ప్రకటిస్తారేమో అన్న విధంగా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ఉన్నాయి’’ అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ మండిపడ్డారు. గురువారం ఆయన కాకినాడలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

*వైఎస్సార్‌ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం వీరపునాయునిపల్లెలో తహసీల్దార్‌గా డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఈశ్వరయ్యను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈశ్వరయ్య అట్లూరు మండలంలో 2015 నుంచి 2017 వరకు తహసీల్దార్‌గా పనిచేశారు. ఆ సమయంలో భూ అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదు కావడంతో అప్పటి కలెక్టర్‌ ఆయనను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్‌ రోహిణిని విచారణాధికారిగా నియమించారు. మండలంలో దాదాపు రూ.100 కోట్ల విలువైన వందల ఎకరాల డీకేటీ భూముల రికార్డులను తారుమారు చేయడంతో పాటు వీటిని కొందరు రాజకీయ నేతలకు సొంతం చేసేలా అక్రమాలకు పాల్పడినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. నేతలకు అక్రమంగా భూములు కట్టబెట్టడంతో పాటు ఓ వీఆర్వో భార్య పేరిట వందల ఎకరాల ప్రభుత్వ భూములను బదలాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విచారణ నివేదికను కలెక్టర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అందచేశారు.

*‘నాగార్జున సాగర్‌, శ్రీశైలం, తుంగభద్ర డ్యాముల కోసం నిర్మించిన డయాఫ్రం వాల్స్‌ వరదల్లో కొట్టుకుపోలేదేం? చంద్రబాబు అవినీతికి పాల్పడినందునే పోలవరం వద్ద రూ.400 కోట్లతో నిర్మించిన డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోయింది’ అని గురువారం బాధ్యతలు చేపట్టిన జలవనరుల మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పై మూడు డ్యాములకు డయాఫ్రం వాల్స్‌ లేవన్న సంగతి ఆయనకు తెలిసినట్లు లేదు. మీడియా పదే పదే ప్రశ్నించినా.. ఉన్నాయని వాదించారు. చివరకు తన ఓఎ్‌సడీ అసలు నిజం చెప్పడంతో మాటమార్చారు. ‘పోలవరం వద్ద నిర్మించిన డయాఫ్రం వాల్‌ ఎందుకు కొట్టుకుపోయింది? నాగార్జున సాగర్‌, శ్రీశైలం, తుంగభద్ర ఆనకట్టల వద్ద నిర్మించిన డయాఫ్రం వాల్‌ ఎందుకు కొట్టుకుపోలేదు? పోలవరం ప్రాజెక్టుకు రీడిజైనింగ్‌ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందో చంద్రబాబు చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు. ఈ మూడు డ్యాముల నిర్మాణ సమయంలో డయాఫ్రం వాల్‌ నిర్మించారా అని విలేకరులు అడుగగా.. అది నిర్మించకుండానే డ్యాములు కడతారా అని మంత్రి ఎదురుప్రశ్న వేశారు. పోలవరం స్పిల్‌వే వద్ద కూడా డయాఫ్రం వాల్‌ నిర్మించారా అనే ప్రశ్నకు.. నిర్మించారని బదులిచ్చారు. అయితే అది నదిని మళ్లించిన చోట నిర్మించడం గమనార్హం. అయితే సాగర్‌, తుంగభద్ర, శ్రీశైలం జలాశయాల నిర్మాణ సమయంలో గ్రౌటింగ్‌ చేశారని.. డయాఫ్రం వాల్‌ నిర్మించలేదని విలేకరులు చెప్పడంతో.. మంత్రి తన ఓఎ్‌సడీని ప్రశ్నించారు. ఆ మూడు డ్యాముల వద్ద డయాఫ్రం వాల్‌ నిర్మించలేదని.. సోమశిల జలాశయానికి కట్టారని ఓఎ్‌సడీ వివరించారు.

*ఏలూరు జిల్లా కైకలూరు మండలం ఆలపాడు శివారు సోమేశ్వరం వద్ద రూ.66 కోట్లతో చేపట్టిన ఆర్వోబీ నిర్మాణంలో స్పెయిన్‌ గడ్డర్లు బుధవారం రాత్రి కుప్పకూలాయి. పామర్రు నుంచి దిగమర్రు వరకు 165వ జాతీయ రహదారి 4 లైన్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. సోమేశ్వరంలో ఒక్కొక్కటి 1.6 కిలోమీటర్ల పొడవునా రెండు లైన్ల ఓవర్‌బ్రిడ్జ్‌ పనులను హైదరాబాద్‌కు చెందిన కేపీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ పనులను నిర్వహిస్తోంది. బుధవారం రాత్రి ఒక్కసారిగా ఎడమవైపు బ్రిడ్జ్‌ నుంచి 4 స్పెయిన్‌ గడ్డర్లు కుప్పకులాయి. ఆ సమయంలో పెద్ద ఎత్తున శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దగ్గరో ఉంటున్న కూలీలు, ఇతర వర్కర్లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కూలిన కాంక్రీట్‌ గడ్డర్లు ఒక్కొక్కటీ 40 మీటర్ల పొడవు, 1.40 మీటర్లు వెడల్పున వేల టన్నుల బరువుంటాయి.

15 రోజుల కింద వీటిని పిల్లర్లపై ఎక్కించారు. గడ్డర్ల నిర్మాణంలో నాణ్యత లోపించడమో వాటిని అమర్చే క్రమంలో సాంకేతిక లోపాలను గుర్తించకపోవడమో తెలియదు గానీ అవి కుప్పకూలడం అధికారుల వైఫల్యానికి నిదర్శనంగా మారాయి. వీటి విలువ సుమారు రూ.కోటిపైనే ఉంటుంది. ఇదే ఘటన బ్రిడ్జ్‌ నిర్మాణ పనులు పూర్తయిన తరువాతగానీ, లేదా పగటిపూట పనులు జరిగే సమయంలో గానీ జరిగితే ఊహించని ఉపద్రవం వచ్చిపడేదంటూ స్థానికులు ఆందోళన వెలిబుచ్చారు. నిర్మాణ దశలోనే అధికారుల పర్యవేక్షణ లోపం విమర్శలకు తావితీస్తోంది.

*దేశంలో ఉపాధి హామీ పథకంలో ముందున్న ఆంధ్రప్రదేశ్‌ గడచిన ఏడాదిలో వెనుకబడింది. 2020-21 కంటే 2021-22లో 6.9 శాతం పనిదినాలు తగ్గాయని లిబ్‌టెక్‌ ఇండియా చేపట్టిన విశ్లేషణలో తేలింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ మూడేళ్లలో రాష్ట్రంలో జరిగిన ఉపాధి పనులకు సంబంధించి నివేదిక విడుదల చేసింది. నవంబరులో ఉపాధి వెబ్‌సైట్‌ టీసీఎస్‌ నుంచి ఎన్‌ఐసీకి మారడంతో తద్వారా ఉపాధి పనులు గణనీయంగా తగ్గాయని పేర్కొంది. దీంతో అంతకు ముందు ఏడాది కంటే రూ.449 కోట్లు తగ్గినట్లు వివరించింది. ఉపాధి హామీ పథకం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా 2019-20 నుంచి 2021-22 వరకు ఉపాధి పురోగతిని విశ్లేషించారు. ఈ పథకంలో ఉపయోగిస్తున్న టీసీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ను వదిలేసి గత ఏడాది నవంబరు 15న ఎన్‌ఐసీ వెబ్‌సైట్‌లోకి మార్చారు. గతంలో టీసీఎస్‌ ద్వారా ఉపాధి కూలీల పనిదినాలను లెక్కించే విధానాన్ని ఎన్‌ఐసీలోకి మారిన తర్వాత రద్దు చేశారు. ఎన్‌ఐసీ నిబంధనల ప్రకారం కూలీలు ఒక రోజులో ఎన్ని గంటలు పనిచేసినా.. ఒక రోజుగానే గుర్తిస్తారు. పని పరిమాణం బట్టి రోజు వేతనానికి లోబడి వేతనం చెల్లిస్తారు. దీంతో కూలీలకు పని దినాలు వృథా అవుతుండటం పనిదినాలు తగ్గడానికి కారణంగా పేర్కొన్నారు.

*అవినీతికి వ్యతిరేకమని సీఎం జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడడం అసహ్యంగా ఉందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఢిల్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్‌పై సీబీఐ అవినీతి కేసులు నమోదు చేసిందనికానీ సీఎం కోర్టుకు వెళ్లడం లేదనిట్రయల్‌ మొదలుపెట్టాలని సీఎం కోర్టులను అడగాలని సూచించారు. సీఎంకు అకస్మాత్తుగా అవినీతి అంటే కోపమొచ్చిందనిగతంలో కూడా ఫిర్యాదులకు నంబరు ఇచ్చారనిఅదేమైందో ఎవరికీ తెలియదన్నారు. ఆ నంబరుకు ఫిర్యాదు చేసిన వారి వివరాలు తెలుసుకున్న ప్రజాప్రతినిధులు వారికి పోలీసులతో దేహశుద్ధి చేయించారని ఆరోపించారు.

*తెలుగుదేశం పార్టీలో సభ్యులైన లక్షల మంది కార్యకర్తల ఆరోగ్య పర్యవేక్షణకు సమగ్ర యాప్‌ రూపొందిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ వెల్లడించారు. పార్టీ ఆన్‌లైన్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం సందర్బంగా గురువారమిక్కడ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రతి కార్యకర్త జేబులో ఒక డిజిటల్‌ డాక్టర్‌ ఉండాలని మేం ప్రయత్నిస్తున్నాం. ప్రతి వ్యక్తి శరీర తీరుకు అనుగుణంగా ఎటువంటి ఆహారం తీసుకోవాలి.. ఎలా బరువు తగ్గాలి.. ఎలా ఫిట్‌గా ఉండాలో న్యూట్రి ఫిట్‌ అనే కార్యక్రమం ద్వారా సలహాలు అందిస్తాం. వాట్సాప్‌ ద్వారా వైద్యులను సంప్రదించవచ్చు. వరు మందులు కూడా సిఫారసు చేస్తారు. రాయితీతో వైద్య పరీక్షలు చేయించుకునే సదుపాయం కూడా కల్పించాలని చూస్తున్నాంఅని వివరించారు. టీడీపీ వినియోగిస్తున్న ఆన్‌లైన్‌ టెక్నాలజీపై అక్కసుతో వైసీపీ ప్రభుత్వం వాట్సాప్‌ సంస్ధకు నాలుగు పేజీల ఫిర్యాదు లేఖ పంపిందని లోకేశ్‌ ధ్వజమెత్తారు. వాట్సాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదును మేం ప్రారంభించాం. అదేదో పెద్ద నేరమైనట్లు మాపై ఫిర్యాదు చేశారు. అందుకే వైసీపీ వాళ్లను చేతగాని దద్దమ్మలని అంటున్నాం. మీకు టెక్నాలజీని వినియోగించుకోవడం చేతగాదు. మేం వినియోగించుకుంటే అసూయ. ఆ టెక్నాలజీ మీకు కావాలనుకుంటే మమ్మల్ని అడగండి. మీకూ ఇస్తాం. నాపై కేసులు పెట్టారు.

*రాష్ట్రంలోని వివిధ శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల సర్వీసును ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను పొడిగిస్తూ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

*రాష్ట్ర వ్యాప్తంగా 998 అద్దె బస్సుల కోసం ఏపీఎ్‌సఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. ఏసీ స్లీపర్‌ 10, నాన్‌ ఏసీ స్లీపర్‌ 62, ఇంద్ర ఏసీ 6, సూపర్‌ లగ్జరీ 87, అలా్ట్ర డీలక్స్‌ 37, ఎక్స్‌ప్రెస్‌ 122, అలా్ట్ర పల్లె వెలుగు 316, పల్లె వెలుగు 310, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ 39, సిటీ ఆర్డినరీ 9 బస్సులకు ఈ టెండర్లు ఆహ్వానించినట్లు ఆపరేషన్స్‌ విభాగం ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఎంఎ్‌సటీసీ ఈ కామర్స్‌ పోర్టల్‌ ద్వారా బస్సుల యజమానులు టెండర్‌ దాఖలు చేసుకోవచ్చని, 22 ఉదయం 10నుంచి మే 5 సాయంత్రం ఐదింటి వరకూ అవకాశం ఉంటుందన్నారు.

* విజయవాడలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం దుర్మార్గమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరవవుతోందన్న పవన్.. అత్యాచార ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. శనివారం పవన్ నిర్వహించనున్న యాత్రకు అడ్డంకులు కలిగించేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరవవుతోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం దుర్మార్గమన్నారు. పోలీసులు సకాలంలో స్పందిస్తే ఇంత ఘోరం జరిగేది కాదన్నారు. ఆస్పత్రిలో పని చేస్తున్నవారే అఘాయిత్యానికి ఒడిగట్టడం.. అక్కడి నిఘా, సెక్యూరిటీ లోపభూయిష్టానికి అద్దం పడుతోందని దుయ్యబట్టారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించటంతోపాటు బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని కోరారు. అత్యాచార ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని జనసేనాని డిమాండ్ చేశారు. మహిళల రక్షణ పట్ల పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పవన్ సూచించారు. మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన దిశ చట్టం ఇప్పటికీ అమలు కావడం లేదన్న పవన్‌కల్యాణ్.. దిశ చట్టం ఎప్పటి నుంచి అమలవుతుందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.జనసేన చేపట్టిన ‘కౌలు రైతు భరోసా యాత్ర’కు ఆటంకం స్పష్టంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో శనివారం.. పవన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో చింతలపూడి నియోజకవర్గం ధర్మాజీగూడెం వద్ద రహదారిని అడ్డంగా తవ్వించేస్తున్నారు. ఉన్నపళంగా జేసీబీతో రోడ్డుని తవ్విస్తుండడాన్ని చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. చింతలపూడిలో పవన్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించేందుకు వెళ్తున్న నాదెండ్ల మనోహర్.. మార్గం మధ్యలో రోడ్డు తవ్వుతున్న దృశ్యాలు చూసిన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, నాదెండ్ల.. జేసీబీని అడ్డుకున్నారు. రహదారి పనుల ముసుగులో పవన్ యాత్రను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.