* దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 714.53 పాయింట్లు కోల్పోయి 57,197.15, నిఫ్టీ 220.60 పాయింట్లు క్షీణించి 17,172 వద్ద ట్రేడింగ్ ముగిసింది. హిందాల్కో ఇండస్ట్రీస్, ఎస్బీఐ, సిప్లా, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్‌యూఎల్ షేర్లు వెనుకపడిపోగా.. అదానీ పోర్ట్స్, ఎంఅండ్ఎం, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, మారుతీ సుజుకీ టాప్ గెయినర్లుగా నిలిచాయి. దలాల్ స్ట్రీట్ మొత్తం ఈ వారం రోలర్ కోస్టర్లా రైడ్‌లా.. పడుతూ లేస్తూ సాగిందని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా పేర్కొన్నారు. సోమవారం నిఫ్టీ 292 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభమైంది. మంగళవారం సైతం 1.73శాతం నష్టపోయాయి. ఈ వారం చివరి రోజు ట్రేడింగ్ సెన్సెక్స్ 1.96 శాతం నష్టంతో ముగిసి, 57197.15 వద్ద, నిఫ్టీ 1.74శాతం నష్టంతో 17,171.95 వద్ద ట్రేడింగ్ ముగిశాయి.
*వెస్ట్ పాక్(ఏఎస్ఎక్స్:డబ్ల్యూబీసీ)కి వ్యతిరేకంగా కార్పొరేట్ వాచ్డాగ్ దాఖలు చేసిన ఆరు వేర్వేరు సివిల్ పెనాల్టీ ప్రొసీడింగ్ల ఫలితంగా ఆస్ట్రేలియన్ సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమీషన్ (ఏఎస్ఐసీ) లీగల్ బ్లిట్జ్ ఈ రోజు ముగిసిన నేపథ్యంలో… బ్యాంకుకు $ 113 మిలియన్ల జరిమానాలు చోటుచేసుకున్నాయి. ఫెడరల్ కోర్ట్ జస్టిస్ జోనాథన్ బీచ్ ఈ రోజు(ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు) వెస్ట్‌పాక్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆరు విచారణలలో చివరిగా తన నిర్ణయాన్ని వెల్లడించారు, మరణించిన 11,800 కంటే ఎక్కువ మంది కస్టమర్లకు సలహా రుసుములను వసూలు చేసినందుకు బ్యాంకుకు $40 మిలియన్ జరిమానా విధించారు.
*ప్రైవేటు బీమా కంపెనీల నుంచి పోటీ ఉన్నా భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ (ఎల్ఐసీ) మార్కెట్లో దూసుకుపోతోంది. మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో నిమిషానికి 41 పాలసీల చొప్పున మొత్తం 2,17,18,695 పాలసీలను విక్రయించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో విక్రయించిన 2,09,75,439 పాలసీలతో పోలిస్తే ఇది 3.54 శాతం ఎక్కువ. కాగా 2021 -22లో ఎల్ఐసీ స్థూల ప్రీమియం ఆదాయం 12.66 శాతం పెరిగి రూ.1,43,938.59 కోట్లకు చేరింది.
*మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్‌నకు చెందిన స్వరాజ్ ట్రాక్టర్స్ హార్టికల్చర్‌లో యంత్రీకరణను పెంచడానికి ‘కోడ్’ పేరుతో ట్రాక్టర్ తరహా కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. హార్టికల్చర్ రంగంలో వివిధ రకాల పనులకు ఉపయోగపడే విధంగా దీన్ని డిజైన్ చేశామని స్వరాజ్ ట్రాక్టర్స్ సీఈఓ హరీష్ చవాన్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ ఉత్పత్తిలో హార్టికల్చర్ ఉత్పత్తి 30 శాతం ఉంటే సాగు చేసే భూమిలో 17 శాతమే హార్టికల్చర్ ఉత్పత్తులను పండిస్తున్నారు. దేశం మొత్తంలో ఉత్పత్తి అవుతున్న కాయలు, పళ్లలో 12 శాతం ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణాల్లో హార్టికల్చర్ యంత్రీకరణపై స్వరాజ్ దృష్టి కేంద్రీకరిస్తోందని చెప్పారు. వచ్చే మూడేళ్లలో హార్టికల్చర్ కోసమే అభివృద్ధి చేసిన మరో రెండు, మూడు ఉత్పత్తులను మార్కెట్లోకి స్వరాజ్ విడుదల చేయనుందని చవాన్ చెప్పారు. ఏపీ, తెలంగాణల్లో కంపెనీకి మొత్తం 80 మంది డీలర్లు ఉండగా.. ముందుగా 10 మంది డీలర్ల వద్ద కోడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 500 కోడ్లు బుక్ అయ్యాయని చెప్పారు. దీని ధర రూ.2-2.5 లక్షలు ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో కోడ్‌ను విడుదల చేశారు.
*అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో మన ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. గురువారం ట్రేడింగ్‌లో బీఎ్‌సఈ సెన్సెక్స్ 874.18 పాయింట్లు బలపడి 57,911.68 వద్దకు చేరుకుంది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 256.05 పాయింట్ల లాభం తో 17,392.60 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 27 లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా షేరు 3.50 శాతం ఎగబాకి సూచీ టాప్ గెయినర్‌గా నిలిచింది. మారుతి సుజుకీ, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎ్‌ఫసీ, టీసీఎస్ షేర్లు 2 శాతానికి పైగా లాభాలను నమోదు చేసుకున్నాయి. టాటా స్టీల్, ఎయిర్టెల్, నెస్లే ఇండియా మాత్రం నష్టాలు చవిచూశాయి. గడిచిన రెండు ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ మార్కెట్ వర్గాల సంపద రూ.5.74 లక్షల కోట్లకు పైగా పెరిగింది. దాంతో బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.271.77 లక్షల కోట్లు దాటింది.
*గత ఆర్థిక సంవత్సరం (2021-22) చివరి త్రైమాసికానికి సైయెంట్ ఆకర్షణీయ నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 39.3 శాతం వృద్ధితో రూ.110.7 కోట్ల నుంచి రూ.154.2 కోట్లకు చేరిందని వెల్లడించింది. గత 12 త్రైమాసికాల్లో ఇదే అత్యధిక నికర లాభమని సైయెంట్ ఎండీ, సీఈఓ కృష్ణ బోదనపు తెలిపారు. కాగా గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి రికార్డు స్థాయి లాభాన్ని ఆర్జించింది. 2021-22 ఏడాదికి సైయెంట్ లాభం 40.6 శాతం వృద్ధితో రూ.371.4 కోట్ల నుంచి రూ.522.4 కోట్లకు చేరింది. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక లాభం. 2022 మార్చితో ముగిసిన త్రైమాసికానికి సైయెంట్ ఆదాయం 8 శాతం పెరిగి రూ.1,093 కోట్ల నుంచి రూ.1,181 కోట్లకు చేరింది. 2021-22 సంవత్సరానికి రూ.4,534 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
*గడిచిన ఆర్థిక సంవత్సరం (2021-22) మార్చి తో ముగిసిన త్రైమాసికానికి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రూ.3,593 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలానికి ఆర్జించిన రూ.1,102 కోట్ల లాభంతో పోలిస్తే మూడింతలకు పైగా పెరిగింది. గడిచిన మూడు నెలలకు కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 15 శాతం వృద్ధితో రూ.22,597 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం (2021-22) మొత్తానికి హెచ్‌సీఎల్ టెక్ రూ.85,651 కోట్ల ఆదాయంపై రూ.13,499 కోట్ల లాభాన్ని గడించింది.
*హైదరాబాద్ కేంద్రంగా ఉన్న పిల్లల హాస్పిటల్ రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 27న ప్రారంభమై 29న ముగియనుంది. సెబీకి సమర్పించిన ముసాయిదా పత్రాల ప్రకారం కొత్త షేర్లను జారీ చేయడం ద్వారా రూ.280 కోట్లను రెయిన్బో సమీకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్‌ఫఎస్) ద్వారా ఇప్పటికే షేర్లను కలిగిన మదుపర్లు 2.4 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఐపీఓ ద్వారా మొత్తం రూ.2,000 కోట్లను సమీకరించే వీలుంది.
*హైదరాబాద్ కేంద్రంగా ఉన్న పిల్లల హాస్పిటల్ రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 27న ప్రారంభమై 29న ముగియనుంది. సెబీకి సమర్పించిన ముసాయిదా పత్రాల ప్రకారం కొత్త షేర్లను జారీ చేయడం ద్వారా రూ.280 కోట్లను రెయిన్బో సమీకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్‌ఫఎస్) ద్వారా ఇప్పటికే షేర్లను కలిగిన మదుపర్లు 2.4 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఐపీఓ ద్వారా మొత్తం రూ.2,000 కోట్లను సమీకరించే వీలుంది.
*ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్ కొనుగోలు కోసం 4,650 కోట్ల డాలర్ల ఫైనాన్స్ ఏర్పాట్లు చేసుకున్నట్లు టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ వెల్లడించారు. కంపెనీతో అగ్రిమెంట్ కోసం ప్రయత్నాలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ట్విటర్లో 100 శాతం వాటా కొనుగోలు కోసం ఒక్కో షేరుకు 54.20 డాలర్ల చొప్పున చెల్లించేందుకు సిద్ధమని గతవారం మస్క్ ప్రకటించారు. ఈ కంపెనీలో ఆయనిప్పటికే 9 శాతానికి పైగా వాటా కలిగి ఉన్నారు. మస్క్ ప్రతిపాదనపై ఇంకా స్పందించని ట్విటర్ బోర్డు.. ఆయన టేకోవర్ ప్రయత్నాలను తిప్పికొట్టే వ్యూహాలపై కసరత్తు చేస్తోంది.
*ట్విట్టర్ కోసం… $33.5 బిలియన్లు అందించేందుకు టెస్టా అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ సిద్ధమైన విషయం తెలిసిందే. అందులో $21 బిలియన్ల ఈక్విటీ, $12.5 బిలియన్ మార్జిన్ లోన్లు ఉన్నాయి. ట్విట్టర్ ఇంక్‌ను కొనుగోలు చేసేందుకుగాను ఎలోన్ మస్క్ $46.5 బిలియన్ల నిధులను పొందారు. ట్విట్టర్ షేర్ల కోసం టెండర్ ఆఫర్‌ను పరిశీలిస్తున్నట్లు యు.ఎస్ రెగ్యులేటర్లతో జరిగిన ఫైలింగ్ గురువారం వెల్లడించింది.
*ఎల్ఐసీ ఐపీఓ తేదీపై ఈ వారంలోగా నిర్ణయం వెలువడే అవకాశమున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అధిక అస్థిరత, అననుకూల స్టాక్ మార్కెట్ పరిస్థితుల కారణంగా ఈ ఐపీఓ… పలుమార్లు వాయిదాపడిన విషయం తెలిసిందే. అయినప్పటికీ… పెట్టుబడిదారులు ఉత్సాహంగా ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే… ఎల్ఐసీ ఐపీఓకు సంబంధించి త్వరలోనే నిర్ణయం వెలువడనుంది. కాగా… రిటైల్ ఇన్వెస్టర్, లేదా… పాలసీ హోల్డర్‌గా ఎల్ఐసీ షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఎల్ఐసీ పాలసీదారుగా ఉన్నపక్షంలో… సంబంధిత పాన్ కార్డ్‌ను పాలసీతో అనుసంధానించి ఉండాలి. ఎల్ఐసీ… తన పాలసీదారులకు ఇష్యూ పరిమాణంలో 10 శాతాన్ని రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. సంస్థ ఉద్యోగులకు ఇష్యూ పరిమాణంలో 5 శాతం కోటా కూడా ఉంటుంది.
*పెన్నార్ ఇండస్ట్రీ్‌సకు గత రెండు నెలల్లో (ఫిబ్రవరి, మార్చి) రూ.498 కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయి. ఈ ఆర్డర్లను వచ్చే రెండు త్రైమాసికాల్లో పూర్తి చేయనున్నట్లు పెన్నార్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎంఎ్‌సఎన్ లేబొరేటరీస్, జేఎ్‌సడబ్ల్యూ కంపెనీల నుంచి ప్రీ ఇంజనీర్డ్ భవనాలను నిర్మించడానికి కంపెనీకి చెందిన పీఈబీ విభాగానికి ఆర్డర్లు వచ్చాయి.