గల్ఫ్ దేశం కువైత్‌లో డొమెస్టిక్ వర్కర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. 2020లో 6,68,600గా ఉన్న గృహ కార్మికుల సంఖ్య 2021 నాటికి 5,93,640కు పడిపోయింది. ఏడాది వ్యవధిలో సుమారు 75వేల మంది డొమెస్టిక్ వర్కర్లు కువైత్ నుంచి వెళ్లిపోయారు. అధికారిక డేటా ప్రకారం 2021లో కువైత్‌ను విడిచిపెట్టిన డొమెస్టిక్ వర్కర్లలో 56.5 శాతం మంది మహిళలు(42,360) ఉన్నారు. అలాగే 32,600 మంది పురుషులు ఉన్నట్లు తెలిసింది. అంతేగాక ఇలా ఆ దేశాన్ని వదిలి వెళ్లిన గృహ కార్మికుల్లో అత్యధికంగా 53 శాతం మంది భారతీయులు ఉన్నారు. 2020లో 3,19,300గా ఉన్న భారతీయ డొమెస్టిక్ వర్కర్ల సంఖ్య 2021 వచ్చేసరికి 2,79,590కు తగ్గిపోయంది. ఏడాది కాలంలో ఏకంగా 40వేల మంది వరకు భారత గృహ కార్మికులు కువైత్‌ను విడిచిపెట్టారు. భారత్ తర్వాతి స్థానంలో ఫిలిప్పీన్స్(7,100), బంగ్లాదేశ్(4,580) ఉన్నాయి.