Devotional

దోష నివారకుడు కమండల గణపతి – TNI ఆధ్యాత్మికం

దోష నివారకుడు కమండల గణపతి  – TNI ఆధ్యాత్మికం

1. తొలి వేలుపుగా పూజలందుకొనే గణనాథుడు కమండల గణపతిగా కొలువైన క్షేత్రం అది. ఈ ఆలయంలో గణపతికి ముందున్న కుండం నుంచవ పొంగుకొని వచ్చే నీటిని సకల శ్రేయస్సులూ కలిగించే దివ్య జలంగా భక్తులు భావిస్తారు.
*కర్ణాటకలోని చిక్‌మగళూరు జిల్లాలోని కేశవె గ్రామంలో ఉన్న కమండల గణపతి ఆలయానికి వెయ్యేళ్ళకు పైగా చరిత్ర ఉంది. ఆ ఆలయాన్ని సందర్శించి, స్వామిని సేవించినా, ధ్యానించినా వారి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మిక. ఇక్కడ ఉన్న కమండల తీర్థం పేరిట… వినాయకుడు కమండల గణపతిగా ప్రసిద్ధి చెందాడు.
*దట్టమైన అటవీ ప్రాంతంలో నెలకొన్న ఈ ఆలయం ఆవిర్భావం గురించి వివరించే కథలు ఎన్నో ఉన్నాయి. స్థల పురాణం ప్రకారం… శని ప్రభావానికి గురైన పార్వతీదేవి దాని నుంచి విముక్తి కోసం తపస్సు చేయడానికి భూలోకానికి వచ్చింది. ఆమె తపస్సుకు అవరోధాలు ఏర్పడడంతో… వాటిని నివారించాల్సిందిగా విఘ్ననాశకుడైన తన కుమారుడు వినాయకుణ్ణి ఆమె కోరింది. బ్రహ్మచారి రూపంలో… కమండలం ధరించి వచ్చిన వినాయకుడు ఆమె తపస్సు సజావుగా సాగేలా చేశాడు. అనంతరం ఇక్కడ గణపతిని పార్వతీదేవి ప్రతిష్ఠించింది. పవిత్రమైన తీర్థాన్ని సృష్టించింది. దీన్ని ‘కమండల తీర్థం’ అని పిలుస్తారు. ఈ కమండల తీర్థమే బ్రహ్మీ నదికి జన్మస్థానం అంటారు. పార్వతీ దేవి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై, తన కమండలంలోని నీటిని ఆమెపై చిలకరించాడనీ, ఆ దివ్య జలాలే ‘బ్రహ్మీ నది’గా మారాయనీ కూడా పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి నుంచి ప్రయాణించే బ్రహ్మీ నది తుంగా నదిలో సంగమిస్తుంది.
*కాగా పూర్వకాలంలో భూలోకం తీవ్ర దుర్భిక్షానికి గురైందనీ, తాగడానికి కూడా నీరు లేని పరిస్థితి ఏర్పడిందనీ, భూలోకవాసుల ప్రార్థనలను ఆలకించిన జగన్మాత పార్వతీదేవి… ఇక్కడ ఒక తీర్థాన్ని సృష్టించిందనీ, దాని ప్రభావంతో భూమి మీద నీటి కొరత తీరిందనీ మరో కథనం. ఈ తీర్థంలో స్నానం చేసి, గణేశుణ్ణి దర్శించుకుంటే సకల కష్టాలు… ప్రధానంగా శనిదోషం తొలగిపోతాయని నమ్మిక. విద్యాప్రదాతగా, సంపత్కారకుడిగా, గ్రహదోష నివారకుడిగా కమండల గణపతి ప్రసిద్ధి చెందాడు.
*దోష నివారకుడు కమండల గణపతిఈ ఆలయంలో విఘ్నేశ్వరుడు సుఖాసనంలో… ఒక చేత్తో మోదకంతో… మరో చేత్తో అభయం ఇస్తూ దర్శనమిస్తాడు. స్వామి ఎదుట ఉండే కుండంలో నీరు నిరంతరం ఉంటుంది. వర్షాకాలంలో కుండాన్ని దాటి ప్రవహిస్తూ ఉంటుంది. మిగిలిన రోజుల్లో సాధారణంగా ఉంటుంది. భక్తులు ఈ నీటిని దివ్య జలంగా భావిస్తారు. దాన్ని ఇళ్ళకు తీసుకువెళ్ళి, పూజా మందిరాల్లో ఉంచుతారు. వ్యాధులను నయం చేసే ఓషధీ గుణాలు ఈ నీటిలో ఉన్నాయని విశ్వసిస్తారు. రోజూ ఉదయం ఏడున్నర నుంచి మఽధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది.

2. వేములవాడలోని రాజరాజేశ్వరక్షేత్రం శుక్రవారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు సర్వదర్శనంశీఘ్రదర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకుని రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకుని తరించారు. శుక్రవారం సందర్భంగా అధికారులు లఘుదర్శనం అమలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. బాలాత్రిపురాసుందరీదేవి ఆలయంలో కుంకుమపూజకళాభవన్‌లో స్వామివారి కల్యాణంసత్యనారాయణవ్రతం తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఆలయ అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు.

3.తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-లోనికంపార్ట్‌మెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలోని రెండు షెడ్లు సర్వదర్శనం భక్తులతో నిండిపోయాయి. వీరికి దాదాపు గంటల దర్శన సమయం పడుతోంది. శనివారం ఉదయానికి అన్ని కంపార్టుమెంట్లుషెడ్లు భక్తులతో నిండి క్యూలైన్‌ వెలుపలకు వచ్చే అవకాశముండడంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. కంపార్టుమెంట్లుషెడ్లుక్యూలైన్లలోని భక్తులకు సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టారు. ఇప్పటికే వైకుంఠంలోని క్యాంటీన్‌ అందుబాటులోకి వచ్చిన క్రమంలో అక్కడ తయారుచేసిన అన్నప్రసాదాలను కంపార్టుమెంట్లలోని భక్తులకు అందజేస్తున్నారు. మరోవైపు.. తిరుమలలో గదులకు మళ్లీ డిమాండ్‌ పెరిగింది. గది కోసం రెండుమూడు గంటలు నిరీక్షించాల్సి వస్తోంది. కల్యాణకట్టలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

4. తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడిన విషయం తెలిసిందే. వరుస సెలవులతో పాటు వారాంతాలు కావడంలో కొండ కిక్కిరిసిపోయింది. అయితే ఆదివారం నుంచి గురువారం వరకు భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో వుండగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి తిరిగి భక్తుల రాక పెరిగింది. దీంతో శుక్రవారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 30 కంపార్టుమెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలోని రెండు షెడ్లు సర్వదర్శనం భక్తులతో నిండిపోయాయి. భక్తులకు దాదాపు 25 గంటల దర్శన సమయం పడుతోంది. శనివారం ఉదయానికి అన్ని కంపార్టుమెంట్లు, షెడ్లు భక్తులతో నిండి క్యూలైన్‌ వెలుపలకు వచ్చే అవకాశముండడంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. కంపార్టుమెంట్లు, షెడ్లు, క్యూలైన్లలోని భక్తులకు సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టారు. మరోవైపు తిరుమలలో గదులకు మళ్లీ డిమాండ్‌ పెరిగింది. గది పొందేందుకు రెండుమూడు గంటలు నిరీక్షించాల్సి వస్తోంది. కల్యాణకట్టలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. శ్రీవారి ఆలయంతో పాటు మాడవీధులు భక్తులతో సందడిగా కనిపిస్తున్నాయి.

5. వేములవాడ రాజరాజేశ్వరక్షేత్రంలో భక్తుల రద్దీ..
వేములవాడలోని రాజరాజేశ్వరక్షేత్రం శుక్రవారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు సర్వదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకుని రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకుని తరించారు. శుక్రవారం సందర్భంగా అధికారులు లఘుదర్శనం అమలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. బాలాత్రిపురాసుందరీదేవి ఆలయంలో కుంకుమపూజ, కళాభవన్‌లో స్వామివారి కల్యాణం, సత్యనారాయణవ్రతం తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఆలయ అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు.

6. భద్రాద్రి రాముని సన్నిధికి.. రైలు
భద్రాద్రి రాముడి భక్తులకు శుభవార్త. భద్రాచలానికి రైలు రానుంది. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి రాష్ట్రంలోని భద్రాచలం మధ్య పాండురంగాపురం వరకు కొత్త రైల్వే మార్గం రాబోతోంది. దీనికి సంబంధించిన చివరి విడత సర్వే జరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరిపై భారీ వంతెన నిర్మించాల్సి ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం రైలు మార్గంతో అనుసంధానం కానుంది. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి రాష్ట్రంలో పాండురంగాపురం వరకు కొత్త రైల్వే లైనుకు సంబంధించిన చివరి విడత సర్వే జరుగుతోంది. జూన్‌ కల్లా ఈ నివేదిక సిద్ధం కానుంది. ప్రాథమికంగా రూ.2,800 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. అనంతరం డీపీఆర్‌ రూపొందించాక నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ మొదలవుతుంది. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించిన తుది సర్వేపై రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ శుక్రవారం ఒడిశాలోని కోరాపూట్‌లో జిల్లా అధికారులు, వాల్తేర్‌ డివిజన్‌ డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సత్పతితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ మార్గానికున్న ప్రాధాన్యం, అనుసంధాన ప్రాంతాలు తదితరాలను డీఆర్‌ఎం మంత్రికి వివరించారు. భద్రాచలం వద్ద గోదావరిపై భారీ వంతెన నిర్మించాల్సి ఉంటుందన్నారు.
**అటు ఆధ్యాత్మిక పర్యాటకం..ఇటు సరకు రవాణా :
భద్రాచలానికి వెళ్లే భక్తులు భద్రాచలం రోడ్‌(కొత్తగూడెం) స్టేషన్‌లో దిగి, రోడ్డు మార్గంలో 40 కి.మీ ప్రయాణించాల్సి వస్తోంది. ఏటా 30 లక్షలకు మందికిపైగా పర్యాటకులు రాములవారి ఆలయాన్ని దర్శిస్తున్నారు. భద్రాచలం ఆలయాన్ని ‘ప్రసాద్‌’ పథకంలో చేర్చేందుకు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఇప్పటికే ఆమోదం తెలిపారు. ఈ మేరకు రూ.92.04 కోట్లతో రాష్ట్ర పర్యాటకశాఖ ప్రతిపాదనలూ పంపింది. ‘ఈ రైలుమార్గం ఒడిశా, తెలంగాణలోని గిరిజన ప్రాంతాల మీదుగా సాగుతుంది. అందుకే రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.మరోవైపు భద్రాచలం రోడ్‌-సత్తుపల్లి కొత్త రైల్వే లైను నిర్మాణం తుది దశలో ఉంది. సత్తుపల్లి నుంచి ఏపీలోని కొవ్వూరు వరకు కొత్త లైను చాలాకాలం క్రితమే మంజూరైనా పట్టాలెక్కలేదు. మల్కన్‌గిరి-భద్రాచలం మార్గం పూర్తయితే కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాల నుంచి బొగ్గు ఇతర ఖనిజాల్ని ఏపీలోని కాకినాడ పోర్టుకు రవాణా చేయడం సులభం అవుతుంది. రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపు ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వస్తుంద’’న్నాయి రైల్వే వర్గాలు.

7. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంతోష్‌ రెడ్డి దర్శించుకున్నారు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వయంభూ నరసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు జస్టిస్‌ సంతోష్‌ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూజానంతరం అద్దాల మండపంలో సంతోష్‌ రెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం ఇవ్వగా, అధికారులు స్వామి వారి ప్రసాదం అందజేశారు.