ScienceAndTech

ఆ అలవాటు కోతలు నుంచే..

ఆ అలవాటు కోతలు నుంచే..

ఆల్కహాలికి అలవాటు పడినవాళ్ళు అంత తేలికగా మానుకోలేదు. దానికి గల కారణం ఏమిటో తెలుసుకుందామని ప్రయత్నించినప్పుడు- మనిషి ఆల్కహాల్కి అలవాటుపడటం అనేది ఈనాటిది కాదు, కోతుల నుంచే వచ్చింది అని చెబుతున్నారు. బెర్కెలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు. చెట్లమీద కాయలు తెగ పండినప్పుడు వాటి నుంచి వచ్చే ఒక రకమైన పుల్లటి వాసనని పసిగట్టిన కోతులు రోజూ ఒకే సమయానికి ఆ పండ్ల దగ్గరకు వెళ్లి వాటిని తినేవల పనామాకి చెందిన స్పైడర్ కోతులు తింటున్న పండ్లను పరిశీలించినప్పుడు వాటిల్లో ఒకటి నుంచి రెండు శాతం బడనాల్ ఉందనీ, కొన్ని పండ్లలో ఏడు శాతం కూడా ఉన్నట్లు గుర్తించారు. తరువాత ఆ కోతుల మూత్రాన్ని పరిశీలించినప్పుడు- ఆ ఆల్కహాలికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయట. అయితే ఆ కోతులు పండ్ల ద్వారా ఆల్కహాల్న ఎక్కువ శక్తికోసమే తీసుకునేవి. అదేవిధంగా మనిషి సైతం మిగలపండిన పండ్లను శక్తికోసం తీసుకోవడం మొదలై, క్రమంగా అది తిన్నప్పుడు కలిగే ఆనందాన్ని గుర్తించి దాన్ని ద్రవపదార్థ రూపంలో తీసుకోవడం ప్రారంభించి ఉంటారని భావిస్తున్నారు సదరు పరిశోధకులు.