Politics

హాట్ హాట్ గా ఏపీ రాజకీయం

హాట్ హాట్ గా ఏపీ రాజకీయం

దిగ్గజాల గురి-బ్యాలెట్ బరి…………నేతల నోట ఓట్ల వేట……………..ప్రధాన పార్టీల ఎత్తుగడలు షురూ….ఆట మొదలైంది..!!*

2024 ఎన్నికల్లో ఎవరి నినాదం ఏంటి. జగన్ నమ్ముకున్న గెలుపు మంత్ర ఒక్కటే. చంద్రబాబు నినాదం ఫిక్స్ అయిపోయింది. ఈ నినాదాలే 2024 ఎన్నికల్లో గెలుపు మంత్రంగా ఇద్దరు అధినేతలు భావిస్తున్నారు. ఏపీలో 2024 ఎన్నికల దిశగా ముఖ్య నేతలు అడుగులు వేస్తున్నారు. సీఎం జగన్ – ప్రతిపక్ష నేత చంద్రబాబు తమ కార్యాచరణ సిద్దం చేసుకుంటున్నారు. దాదాపుగా ఎన్నికల షెడ్యూల్ కు ఇంకా ఏడాదిన్నార సమయం ఉంది. అధికారంలో ఉన్న వైసీపీ ఎలాగైనా తామే మరోసారి అధికారంలో కొనసాగే విధంగా వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం పైన భారీ స్థాయిలో ప్రతికూలత ఉందని..ఖచ్చితంగా తమకు కలిసి వస్తుందని అంచానతో టీడీపీ ఉంది. ఇక, ప్రతిపక్ష ఓట్లు చీలకుండా జగన్ ను ఓడించటమే లక్ష్యంగా పని చేస్తానని జనసేన అధినేత పవన్ ప్రకటించారు. అయితే, పొత్తుల పైన మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

టీడీపీ – జనసేన పొత్తు ఖచ్చితంగా ఉంటుందని వైసీపీ అంచనా వేస్తోంది. తాము మాత్రం సింగిల్ గానే పోటీ చేస్తామని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు నుంచే నాటి ప్రతిపక్ష నేత జగన్..నాటి సీఎం చంద్రబాబు విశ్వసనీయత పైన దెబ్బ కొట్టటంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. 2014 లో చంద్రబాబు ఇచ్చిన హామీలు..అమలు చేయపోవటం పైన ప్రధానంగా ప్రతీ సభలోనూ ప్రచారం చేసారు. తన తండ్రి నుంచి తమకు విశ్వసనీయ వారసత్వంగా వచ్చిందని నమ్మించటంలో సక్సెస్ అయ్యారు. ఫలితంగా చంద్రబాబు పధకాలు..పసుపు – కుంకుమ 2019 టీడీపీకి వర్కవుట్ కాలేదు. ఇక, అధికారంలోకి వచ్చిన సమయం నుంచి జగన్ తాను చెప్పిన పథకాలు అమలు చేయకుంటే…తాను చంద్రబాబు పైన చేసిన ప్రచారమే తన మీద చేసే అవకాశం ఉండటంతో..ఎటువంటి పరిస్థితుల్లోనూ పథకాలు అమలు కొనసాగిస్తున్నారు. దీంతో..టీడీపీ రాష్ట్ర ఆర్దిక పరిస్థితిని టార్గెట్ చేస్తోంది. జగన్ రాష్ట్రంలో డెవలప్ మెంట్ వదిలేసారని..శ్రీలంక పరిస్థితి తీసుకొస్తున్నారంటూ విమర్శలు చేస్తోంది. దీనిని ఇప్పుడు జగన్ తనకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ విమర్శలు చూపిస్తూ.. ఇప్పుడు సీఎం జగన్ కొత్త నినాదం ఎత్తుకొన్నారు.

పథకాలు అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ఎల్లో గ్యాంగ్ ప్రచారం చేస్తుందని..ఎల్లో పార్టీకి ఓటేస్తే పధకాలు ఆగిపోతాయని..పథకం రద్దు చేస్తారంటూ లబ్ది దారుల సభల్లో చెప్పుకొస్తున్నారు. పథకాలు రద్దు చేస్తే మీరు ఒప్పుకుంటారా అంటూ వారి నుంచే సమాధానం రాబడుతున్నారు. దీంతో పాటుగా సెంటిమెంట్ జోడించి…తాను చేస్తున్న పథకాలను వివరిస్తూ..జగన్ మంచి చేస్తుంటే ఆశీర్వదించండి…మంచి చేయట్లేదని భావిస్తే ద్వేషించండి..అంతే కానీ, ఎల్లో పార్టీ నేతల ప్రచారం మాత్రం నమ్మకండి అంటూ సీఎం జగన్ చెబుతున్నారు. పరోక్షంగా టీడీపీకి ఓట్లు వేస్తే..పథకాలు అమలు కావనే భావన లబ్దిదారుల్లో తీసుకొచ్చే ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ఇక, చంద్రబాబు సైతం తాను తిరిగి అధికారంలోకి రావటానికి నినాదం ఖరారు చేసినట్లు కనిపస్తోంది. ఏపీని పునర్ నిర్మించాలి అనే నినాదంతో..అది తనతోనే సాధ్యమని చెప్పటం ద్వారా ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మూడేళ్ల కాలంలో రోడ్లు వేయలేదని..ఎక్కడా డెవపల్ మెంట్ జరగలేదని..రాజధాని – పోలవరం ఆగిపోయాయనేది ప్రధాన ప్రచార అంశాలుగా డిసైడ్ అవుతున్నారు. అయితే, చంద్రబాబు ఎన్నికల సమయం నాటికి ఈ పథకాల గురించి స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పుడుతుందనేది వైసీపీ నేతల వాదన.

సీఎం జగన్ కు డెవపల్ మెంట్ పట్టటం లేదు..పరిశ్రమలు లేవు.. ఉద్యోగ కల్పన లేదనే విమర్శలకు త్వరలోనే సమాధానాలు దొరుకుతాయని వైసీపీ నేతలు అంతర్గత చర్చల్లో చెబుతున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు… దావోస్ పర్యటనతో పెట్టుబడులు వంటి వాటి పైన వారు భారీ అంచనాలతో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, ప్రధానంగా జగన్ మాత్రం చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు కొనసాగవనేది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో.. వైసీపీ వర్సెస్ టీడీపీ..ప్రధానంగా జగన్ వర్సెస్ చంద్రబాబు.. వ్యక్తిగతంగానూ ఇద్దరికి..రెండు పార్టీలకు వచ్చే ఎన్నికలు రాజకీయ భవిష్యత్ ను డిసైడ్ చేయనున్నాయి. దీంతో..ఇప్పటి నుంచే ఇద్దరు నేతలు మైండ్ గేమ్ ప్రారంభించారు. మరి..ఓటర్ల ఎటువైపు మొగ్గుతారనేది తేలాల్సి ఉంది.