Movies

నిత్య పెళ్లికొడుకు వేటలో..

Auto Draft

డబ్బు కోసం పెళ్లి మీద పెళ్లి చేసుకున్న ఓ నేరస్తుడిని పట్టుకునే పవర్‌ ఫుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో నటిస్తున్నది బాలీవుడ్‌ భామ సోనాక్షీ సిన్హా. ‘ఫాలెన్‌’ పేరుతో రూపొందుతున్న వెబ్‌ సిరీస్‌లో ఆమె ఈ క్యారెక్టర్‌ చేస్తున్నది. కేరళలో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకులు రీమా కగ్తి, రుచితా ఓబెరాయ్‌. డబ్బు కోసం వరుస పెళ్లిళ్లు చేసుకున్న ఓ వ్యక్తిని మహిళా పోలీస్‌ అధికారి ఎలా పట్టుకుంది అనేది కథలో ఆసక్తికరంగా చూపిస్తున్నారు. క్రైమ్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ వెబ్‌ సిరీస్‌ ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్నది. ఈ వెబ్‌ సిరీస్‌లో అంజలి భట్‌, విజయ్‌ వర్మ, సోహమ్‌ షా, గుల్షన్‌ దేవయ్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు